భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలు

భారత రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థలు

భారతదేశంలో 29 రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రి మండలికి, ముఖ్యమంత్రి అధిపతిగా ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారం విభజించబడింది.కేంద్ర ప్రభుత్వం రక్షణ, బాహ్య వ్యవహారాలు మొదలైనవాటిని నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల ద్వారా రాష్ట్ర అంతర్గత భద్రత,ఇతర రాష్ట్రాల సమస్యలతో వ్యవహరిస్తుంది.సరిహద్దు సుంకం,ఉత్పత్తి పన్ను, ఆదాయపు పన్ను మొదలైనవి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంకాగా, అమ్మకపు పన్ను (వ్యాట్), స్టాంప్ డ్యూటీ మొదలైన వాటి నుండి రాష్ట్ర ప్రభుత్వాానికి ఆదాయంగా వస్తుంది.ఇప్పుడు అమ్మకపు పన్ను, వస్తువులు, సేవల పన్ను (భారతదేశం) రూపంలో వివిధ విభాగాల క్రింద విధించబడుతుంది. ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది. రాష్ట్ర పరిపాలనా సంభంధమైన చట్టాలు రాష్ట్ర శాసనసభ (విధానసభ) ద్వారా జరుగుతాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్ర శాసనసభకు ఒక సభా మందిరం (అసెంబ్లీ హాలు) ఉంటుంది. శాసనమండలి (విధాన పరిషత్) ఉన్న రాష్ట్రాలుకు రెండు సభా మందిరాలు వేర్వేరుగా ఉంటాయి. ద్విసభ అనగా రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసనమండలి (విధాన పరిషత్)లు, శాసనసభ, లోక్‌సభకు అనుగుణంగా, శాసనమండలి (విధాన పరిషత్), భారత పార్లమెంటు రాజ్యసభకు అనుగుణంగా ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికార సమతుల్యతను సమీక్షించడానికి సర్కారియా సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన (వి.ఎస్.ఆర్. బొమ్మై, కేంద్ర ప్రభుత్వం) తీర్పులో కొన్ని షరతులకు లోబడి, అవసరమైతే రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా (ఇది 5 సంవత్సరాలకు మించకుండా) మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటానికి అవకాశం ఉంది.

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనం, హైదరాబాదు

ప్రతి రాష్ట్రానికి, ఒక శాసనసభ ఉంది, ఇందులో ఒక గవర్నర్, ఒకటి లేదా రెండు సభలు ఉంటాయి.[1]

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంశాసన సభ రకంస్థానాల సంఖ్య పరిమితి
దిగువ సభ[2]ఎగువ సభ[3]మొత్తం స్థానాలు సంఖ్య
ఆంధ్రప్రదేశ్ద్విసభ17558233
అరుణాచల్ ప్రదేశ్ఏకసభ6060
అసోంఏకసభ126126
బీహార్ద్విసభ24375318
ఛత్తీస్‌గఢ్ఏకసభ9090
ఢిల్లీఏకసభ7070
గోవాఏకసభ4040
గుజరాత్ఏకసభ182182
హర్యానాఏకసభ9090
హిమాచల్ ప్రదేశ్ఏకసభ6868
జమ్మూ కాశ్మీరుఏకసభ9090
జార్ఖండ్ఏకసభ8181
కర్ణాటకద్విసభ22475299
కేరళఏకసభ140140
మధ్య ప్రదేశ్ఏకసభ230230
మహారాష్ట్రద్విసభ28878366
మణిపూర్ఏకసభ6060
మేఘాలయఏకసభ6060
మిజోరంఏకసభ4040
నాగాలాండ్ఏకసభ6060
ఒడిశాఏకసభ147147
పుదుచ్చేరిఏకసభ30[a]30
పంజాబ్ఏకసభ117117
రాజస్థాన్ఏకసభ200200
సిక్కింఏకసభ3232
తమిళనాడుఏకసభ234234
తెలంగాణద్విసభ11940159
త్రిపురఏకసభ6060
ఉత్తర ప్రదేశ్ద్విసభ403100503
ఉత్తరాఖండ్ఏకసభ7070
పశ్చిమ బెంగాల్ఏకసభ294294
మొత్తం సంఖ్య4,1234264,549
  1. భారత ప్రభుత్వంచే మూడు అదనపు స్థానాలు నామినేట్ చేయబడతాయి

శాసనసభ మార్చు

ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది. దీనిలో రాష్ట్ర పాలకుడు, (గవర్నరు) ఒక సభ లేదా ద్విసభలు (శాసనసభ, శాసనమండలి) ఉంటాయి ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్త్రరప్రదేశ్‌లలో ద్విసభలతో కూడిన శాసనసభ ఉంది. మిగిలిన రాష్ట్రాలు ఏకసభ (శాసనసభ)గా ఉన్నాయి. సంబంధిత రాష్ట్ర శాసనసభ తీర్మానం ద్వారా, ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తే, ప్రస్తుత శాసనమండలిని రద్దు చేయడానికి లేదా ఉనికిలో లేని ఒకదాన్ని సృష్టించడానికి పార్లమెంటు చట్టం ద్వారా వెసులుపాటు ఉంది.

రాష్ట్ర శాసనమండలి, రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు కంటే మించకుండా, ఏ సందర్భంలోనూ 40 మంది కంటే తక్కువ మంది సభ్యులను కలిగి ఉండదు. శాసనమండలిలో సభ్యులలో మూడింట ఒకవంతు సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. శాసనసభ సభ్యులు కాని వ్యక్తుల నుండి మూడవ వంతు సభ్యులను పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్తులు, రాష్ట్రంలోని ఇతర స్థానికసంస్థలకు ఎన్నికైన ఓటర్లు ద్వారా, పన్నెండవ వంతు సభ్యులను ద్వితీయ ప్రాధాన్యత కలిగిన పాఠశాల కంటే ప్రామాణికత లేని, రాష్ట్రంలోని విద్యా సంస్థల బోధనలో మూడేళ్ళకు పైగా పనిచేస్తూ నమోదైన పట్టభద్రుల వ్యక్తులతో కూడిన ఓటర్ల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మిగిలిన సభ్యులను సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకార ఉద్యమం, సామాజిక సేవలలో ప్రత్యేకత చూపిన వారి నుండి రాష్ట్ర పాలకుడుచే నియించబడతారు. శాసన మండళ్లు రద్దుకు లోబడి ఉండవు, కానీ దాని మూడింట ఒకవంతు సభ్యులలో ప్రతి రెండవ సంవత్సరం పదవీ విరమణ పొందుతారు.

ఒక రాష్ట్రం శాసనసభ 500 కంటే ఎక్కువ కాకుండా, 60 మంది సభ్యుల కంటే తక్కువ సభ్యులను కలిగి ఉండదు. (రాజ్యాంగంలోని అధికరణం 371 ఎఫ్ సిక్కిం శాసనసభలో 32 మంది సభ్యులు, పుదుచ్చేరిలో 33 మంది సభ్యులు, గోవా, మిజోరాంలకు ఒక్కొకదానికి 40 మంది సభ్యులు చొప్పున ఉన్నారు) రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాల విభజన అనేది, ప్రతి నియోజకవర్గ జనాభా, దానికి కేటాయించిన సీట్ల సంఖ్య మధ్య నిష్పత్తి, ఆచరణలో ఉన్నంతవరకు, రాష్ట్రమంతటా సమానంగా ఉంటుంది. శాసనసభను అంతకుముందు రద్దు చేయకపోతే దాని కాలపరిమితి ఐదేళ్ళుగా ఉంటుంది.

అధికారాలు, విధులు మార్చు

రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఏడవ విభాగం II) లో పేర్కొన్న విషయాలపై రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఉప జాబితా III లో పేర్కొన్న వాటిపై ఏకకాలిక అధికారాలు రాష్ట్ర శాసనసభకు ఉన్నాయి. శాసనసభ ఆర్థిక అధికారాలలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు భరించటానికి అధికారం కలిగిఉంది. అలాగే పన్నులు విధించడం, రుణాలు తీసుకోవడంలాంటి అధికారాలు కలిగిఉంది. శాసనసభకు మాత్రమే డబ్బు సంభంధమైన బిల్లులను రూపొందించే అధికారం ఉంది. శాసనసభ నుండి డబ్బు బిల్లులు అందిన పద్నాలుగు రోజుల వ్యవధిలో అవసరమని భావించే మార్పులకు సంబంధించి మాత్రమే శాసనమండలి సిఫార్సులు చేయగలదు. ఈ సిఫార్సులను శాసనమండలి అంగీకరించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు.

ఒక రాష్ట్ర పాలకుడు (గవర్నరు) ఏదైనా చట్టమును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు. తప్పనిసరిగా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, అధికారాలు, హైకోర్టుల స్థానాన్ని ప్రభావితం చేసే చర్యలు, అంతర్-రాష్ట్ర నది లేదా నదీలోయ అభివృద్ధి ప్రాజెక్టులలో నీరు లేదా విద్యుత్ నిల్వ పంపిణీ, అమ్మకంపై పన్ను విధించడం వంటి అంశాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. అంతరాష్ట్ర వాణిజ్యంపై ఆంక్షలు విధించాలని కోరుతున్న ఏ బిల్లులను రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశపెట్టలేరు.

రాష్ట్ర శాసనసభలు, ఆర్థిక నియంత్రణ సాధారణ శక్తిని ఉపయోగించడమే కాకుండా, రోజువారీ నిర్వహణ పనులపై నిఘా ఉంచడానికి ప్రశ్నలు, చర్చలు జరపటానికి, చర్చలు వాయిదా వేయటానికి, అవిశ్వాస తీర్మానాలు, కదలికలు వంటి అన్ని సాధారణ పార్లమెంటరీ పద్ధతులు ఉపయోగిస్తాయి. శాసనసభ మంజూరు చేసిన గ్రాంట్లు సక్రమంగా వినియోగించబడతాయని నిర్ధారించడానికి వారు అంచనాలు, పబ్లిక్ ఖాతాలపై వారి స్వంత కమిటీలను కలిగి ఉండవచ్చు.

భారతదేశం లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో శాసనసభ స్థానాలు మొత్తం 4,121 ఉన్నాయి.[4][5][6] ఆంధ్రప్రదేశ్ తన శాసనమండలిని 1984లో రద్దుచేసింది, కానీ తిరిగి 2007 లో ఎన్నికల తరువాత కొత్త శాసనమండలిని ఏర్పాటు చేసింది.[7]

సభ్యత్వం, కార్యాలయ నిబంధనలు మార్చు

రాజకీయాలు మార్చు

ప్రస్తుత పాలక పార్టీలు మార్చు

2019 డిసెంబరు నాటికి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఐక్య ప్రగతిశీల కూటమి 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉంది. 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అన్‌లైన్ చేయని మూడవ పార్టీలచే నిర్వహించబడుతున్నాయి. కొత్తగా ఏర్పడిన కేంద్ర భూభాగం జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలు జరగలేదు. అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడింది.

నిర్వహణ మార్చు

రాష్ట్ర పరిపాలనా నిర్వహణకు [8] రాష్ట్ర పాలకుడు, మంత్రుల మండలి ముఖ్యమంత్రి దాని అధిపతిగా ఉంటుంది. ఒక రాష్ట్ర పాలకుడును రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమించవచ్చు. ఆసమయంలో అతను ఆ పదవిలో ఉంటాడు. 35 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు మాత్రమే ఈ పదవిలో నియామకానికి అర్హులు. రాష్ట్ర పాలకుడుకు రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ఉంది.

మంత్రి మండలి మార్చు

ముఖ్యమంత్రిని రాష్ట్ర పాలకుడు నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు, ఇతర మంత్రులను కూడా నియమిస్తాడు. మంత్రుల మండలి రాష్ట్ర శాసనసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.

ముఖ్యమంత్రితో ఉన్న మంత్రుల మండలి దాని సహాయంగా తన విధులను నిర్వర్తించటానికి రాష్ట్ర పాలకుడుకు సలహా ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం లేదా తన విచక్షణాధికారం మేరకు తన విధులను రాష్ట్ర పాలకుడు నిర్వర్తించవచ్చు. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, దాని రాష్ట్ర పాలకుడుకు శాంతిభద్రతలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 A కింద ప్రత్యేక బాధ్యత ఉంది. శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలలో తీసుకోవలసిన చర్యల గురించి, మంత్రుల మండలిని సంప్రదించడం అవసరం అయినప్పటికీ, అతను తన వ్యక్తిగత తీర్పును అమలు చేయవచ్చు

అదేవిధంగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 హెచ్ ప్రకారం శాంతిభద్రతలకు సంబంధించి, దానికి సంబంధించి అతని విధులను నిర్వర్తించడంలో దాని రాష్ట్ర పాలకుడు‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. మంత్రుల మండలిని సంప్రదించిన తరువాత తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర పాలకుడు తన వ్యక్తిగత తీర్పును అమలు చేయవచ్చు. అయితే ఇవి తాత్కాలిక నిబంధనలు. రాష్ట్ర పాలకుడు నుండి భారత రాష్ట్రపతి, ఒక నివేదిక అందుకున్నప్పుడు లేదా రాష్ట్ర పాలకుడుకు శాంతిభద్రతలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అవసరం లేదని సంతృప్తి చెందితే, అతను ఒక ఉత్తర్వు ద్వారా ఆ అధికారాలను సడలించవచ్చు.

అదేవిధంగా షెడ్యూల్ 20 వ పేరాలో పేర్కొన్న విధంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం గిరిజన ప్రాంతాలకు వర్తించే ఆరవ షెడ్యూల్ లో, జిల్లా మండలి, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాయల్టీలను పంచుకోవటానికి సంబంధించిన విషయాలలో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఇవ్వబడ్డాయి. ఆరవ షెడ్యూల్‌లో మిజోరాం, త్రిపుర రాష్ర్ట్ర పాలకులు‌ దాదాపు అన్ని విధుల్లో (పన్నులు విధించడం గిరిజనేతర జిల్లా మండలిల ద్వారా రుణాలు ఇవ్వడం కోసం నిబంధనలను ఆమోదించడం మినహా) అదనపు విచక్షణాధికారాలను 1998 డిసెంబరు నుండి కలిగి ఉంది. సిక్కింలో జనాభాలోని వివిధ వర్గాల శాంతి, సామాజిక, ఆర్థిక పురోగతికి రాష్ర్ట్ర పాలకుడుకు‌ ప్రత్యేక బాధ్యత ఇవ్వబడింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగంపై వైఫల్యం చెందినప్పుడు, రాష్ట్ర శాసనసభను రద్దు చేయుటకు అంగీకారానికి, లేదా ఒక బిల్లును ఆమోదించడానికి సంబంధించిన విషయాలకు సంబంధించి వారి రాజ్యాంగ విధులను నిర్వర్తించడానికి అన్ని రాష్ట్రాల రాష్ర్ట్ర పాలకులు‌ రాష్ట్రపతికి నివేదిక పంపడాని బాధ్యత వహిస్తారు.

న్యాయవ్యవస్థ మార్చు

భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదికలు పంపుటకు లోబడి, అన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలకు రాష్ట్రంపై అధికార పరిధిని కలిగి ఉన్నాయి, కానీ ఇది ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, శాసనాలకు లోబడి ఉంటాయి.

ఇది కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "Home | Know India: National Portal of India". Know India. Archived from the original on 14 December 2012. Retrieved 2022-03-18.
  2. "Terms of the Houses". Election Commission of India. Retrieved 30 August 2022.
  3. "List of State Legislative Councils of India". Jagranjosh.com. 2021-05-25. Retrieved 2022-08-30.
  4. "Glass ceilings in State Cabinets".
  5. "Election Commission of India". eci.nic.in. Archived from the original on 2018-12-26. Retrieved 2020-10-29.
  6. "Ministry of Social Justice and Empowerment - Government of India" (PDF). socialjustice.nic.in.
  7. "Legislature". www.aplegislature.org.
  8. "The Polity : The States -Profile - Know India: National Portal of India". knowindia.gov.in. Archived from the original on 2015-09-23. Retrieved 2020-10-29.

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: తెలుగుదేశం పార్టీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు2024 భారత సార్వత్రిక ఎన్నికలునారా చంద్రబాబునాయుడుపవన్ కళ్యాణ్మొదటి పేజీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఇండియా కూటమిలోక్‌సభయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాజనసేన పార్టీభారత పార్లమెంట్2019 భారత సార్వత్రిక ఎన్నికలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంగోరంట్ల బుచ్చయ్య చౌదరిసజ్జల రామకృష్ణా రెడ్డిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంప్రత్యేక:అన్వేషణనరేంద్ర మోదీతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఈనాడుపిఠాపురంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతీయ జనతా పార్టీధర్మవరం శాసనసభ నియోజకవర్గంపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్దర్శి శాసనసభ నియోజకవర్గంరోజా సెల్వమణిఆంధ్రప్రదేశ్ శాసనసభకడప లోక్‌సభ నియోజకవర్గంవిడదల రజిని