వడియం

(వడియాలు నుండి దారిమార్పు చెందింది)

వడియం (బహువచనం వడియాలు) ఒక ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే మూల పదార్థాల ఆధారంగా వివిధ రకాలుగా ఉంటాయి.

వడియాలలో రకాలు మార్చు

  1. పిండి వడియాలు
  2. బియ్యం పిండి వడియాలు
  3. సగ్గుబియ్యం వడియాలు
  4. మినపపిండి వడియాలు
  5. పెసరపిండి వడియాలు
  6. బూడిదగుమ్మడి వడియాలు
  7. సొరకాయ వడియాలు
  8. టమాట వడియాలు
  9. ఉల్లిపాయ వడియాలు
  10. రేగు వడియాలు

తెలగ పిండి వడియాలు మార్చు

తగినన్ని నీళ్లల్లో తెలగపిండిని సుమారు 8 గంటలు నానబెట్టాలి. పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి... మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తెలగపిండికి కలపాలి. చపాతీపిండిలా తయారు చేసుకున్న తరువాత దానిని ∙చిన్నచిన్న ఉండలు తీసుకుని అరచేతితో ఒత్తి వడియాల మాదిరి ఒత్తి, నువ్వులు అద్ది ఎండలో ఆరబెట్టాలి. ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించవలసిన అవసరం లేదు. పెరుగన్నంలో కాని, మజ్జిగతో కాని తింటే రుచిగా ఉంటాయి.[1]

గుమ్మడి వడియాలు మార్చు

మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. గుమ్మడి గింజలను తొలగించాలి. ఉప్పు, పసుపు, ఇంగువ జత చేసి ఒక వస్త్రంలో గట్టిగా మూట కట్టి, దాని మీద పెద్ద బరువు పెట్టి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం మినపపప్పు పొట్టు తీసి, పచ్చిమిర్చి, ఉప్పు జత చేసి మెత్తగా రుబ్బాలి. బూడిదగుమ్మడికాయ ముక్కలు జత చేయాలి. ∙ప్లాస్టిక్‌ కాగితం మీద నిమ్మకాయ పరిమాణంలో వడియాలు పెట్టాలి. రెండు రోజులపాటు ఎండిన తరవాత, వాటిని జాగ్రత్తగా తీసి, రెండవ వైపుకి తిరగేసి, మరో రెండు రోజులు ఎండనివ్వాలి. ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వేసవిలో మామిడికాయ పప్పులో వడియాలు నంచుకుని తింటే రుచిగా ఉంటుంది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "వేడియాలు". Sakshi. 2018-04-28. Retrieved 2022-06-06.
🔥 Top keywords: మొదటి పేజీతెలంగాణ అధికారిక చిహ్నంప్రత్యేక:అన్వేషణఈనాడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డికార్తెఅందెశ్రీతెలుగువాతావరణంసీతాదేవి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ గౌరి ప్రియసెక్స్ (అయోమయ నివృత్తి)యూట్యూబ్బొంబాయి రక్త వర్గంరామాయణంఆంధ్రప్రదేశ్తెలంగాణద్వాదశ జ్యోతిర్లింగాలుచుక్కా రామయ్య2024 భారత సార్వత్రిక ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)జయ జయహే తెలంగాణతెలుగు అక్షరాలుఅంగుళంచార్మినార్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికుక్కుట శాస్త్రంఘట్టమనేని కృష్ణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఛందస్సువికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నంహేమభారతదేశంలో కోడి పందాలుమహాభారతంనారా చంద్రబాబునాయుడు