మూలకాల ప్రాకృతిక సమృద్ధి

విశ్వం లోను, భూమిపైన, మానవ శరీరంలో మూలకాల సమృద్ధి

రసాయన మూలకాల సమృద్ధి అనేది ఒక నిర్దుష్ట వాతావరణంలో అన్ని ఇతర మూలకాలకు సంబంధించి రసాయన మూలకాలు లభించే కొలత. సమృద్ధిని మూడు విధాలుగా కొలవవచ్చు: ద్రవ్యరాశి భిన్నం (మాస్ ఫ్రాక్షన్); మోల్-ఫ్రాక్షన్ ద్వారా (పరమాణువుల సంఖ్య, లేదా కొన్నిసార్లు వాయువులలోని అణువుల సంఖ్య); లేదా ఘనపరిమాణ భిన్నం. ఘనపరిమాణ భిన్నం అనేది గ్రహ వాతావరణం వంటి మిశ్రమ వాయువులలో లభ్యతను కొలిచేందుకు సాధారణంగా వాడతారు. సాపేక్షికంగా తక్కువ సాంద్రతలు, పీడనాలు ఉన్నపుడు వాయుమిశ్రమాల లోను, ఆదర్శ వాయుమిశ్రమాల లోనూ సమృద్ధిని కొలిచే అణు మోల్-ఫ్రాక్షన్‌కు ఇది సమానం, ఈ వ్యాసంలో చాలా సమృద్ధి విలువలను ద్రవ్యరాశి-భాగలుగా ఇచ్చాం.

ఉదాహరణకు, స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్ సమృద్ధిని రెండు విధాలుగా కొలవవచ్చు: ద్రవ్యరాశి భిన్నం సుమారు 89%, ఎందుకంటే ఇది నీటి ద్రవ్యరాశిలో ఆక్సిజన్ ఉన్న భాగం. అయితే, మోల్-ఫ్రాక్షన్ మాత్రం దాదాపు 33% -ఎందుకంటే నీటిలో (H2O) మూడింట 1 అణువు మాత్రమే ఆక్సిజన్. మరొక ఉదాహరణగా, యావత్తు విశ్వం లోను, బృహస్పతి వంటి గ్యాస్-జెయింట్ గ్రహాల వాతావరణం రెండింటిలోనూ హైడ్రోజన్, హీలియంల ద్రవ్యరాశి-భిన్నం సమృద్ధిని పరిశీలిస్తే, ఇది హైడ్రోజన్‌కు 74%, హీలియంకు 23-25% ఉంటుంది; ఈ వాతావరణాలలో హైడ్రోజన్ (అణు) మోల్-ఫ్రాక్షన్ 92%, హీలియం 8%. బృహస్పతి బాహ్య వాతావరణంలో హైడ్రోజన్ డయాటోమిక్ గా ఉంటుంది. హీలియం అలా ఉండదు. అక్కడ పరమాణు మోల్-ఫ్రాక్షన్ (మొత్తం వాయు అణువులలో భాగం), అలాగే ఘనపరిమాణం ప్రకారం వాతావరణం లోని భిన్నం, రెండూ హైడ్రోజన్ కు 86%, హీలియం 13% ఉంటాయి. [Note 1]

విశ్వంలోని రసాయన మూలకాల సమృద్ధిలో హైడ్రోజన్, హీలియంలదే ఆధిపత్యం. బిగ్ బ్యాంగ్‌లో ఇవి పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యాయి. మిగిలిన మూలకాలన్నీ కలిపి, విశ్వంలో కేవలం 2% మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కువగా సూపర్నోవాలు లోను, కొన్ని రెడ్ జెయింట్ నక్షత్రాల లోనూ ఉత్పత్తి అయ్యాయి. లిథియం, బెరీలియం, బోరాన్ లకు పరమాణు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, అవి చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే అవి కేంద్రక సంలీనం ద్వారానే ఉత్పత్తి అయినప్పటికీ, నక్షత్రాలలో జరిగే ఇతర ప్రతిచర్యల ద్వారా అవి నాశనమవుతాయి. [1] [2] సూపర్నోవా న్యూక్లియోసింథసిస్‌లో తయారవడం సులభం కావడం వల్ల కార్బన్ నుండి ఇనుము వరకు మూలకాలు విశ్వంలో ఎక్కువగా ఉన్నాయి. ఇనుము (మూలకం 26) కంటే ఎక్కువ పరమాణు సంఖ్య కలిగిన మూలకాలు విశ్వంలో క్రమంగా అరుదుగా మారతాయి, ఎందుకంటే వాటి ఉత్పత్తి జరిగేందుకు అవి నక్షత్ర శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే, ఆవర్తన పట్టికలో సరి సంఖ్యలో పరమాణు సంఖ్య ఉన్న మూలకాలు మిగతావాటి కంటే ఎక్కువగా లభిస్తాయి. ఎందుకంటే ఏర్పడేందుకు అవసరమైన శక్తి అనుకూలంగా ఉంటుంది కాబట్టి.

సూర్యుడి లోను, బాహ్య గ్రహాలలోనూ మూలకాల సమృద్ధి విశ్వంలో ఉన్నట్లే ఉంటుంది. సౌర వేడి కారణంగా, భూమి, సౌర వ్యవస్థ లోపలి రాతి గ్రహాల లోని అస్థిర హైడ్రోజన్, హీలియం, నియాన్, నైట్రోజన్, కార్బన్ (మీథేన్‌గా అస్థిరత చెందుతాయి) ల సమృద్ధి క్షీణించింది. భూమి పైపెంకు, మాంటిల్, కోర్ లలో రసాయన విభజన, సాంద్రత ద్వారా కొంత సీక్వెస్ట్రేషన్ జరిగినట్లుగా ఆధారాలున్నాయి. అల్యూమినియం యొక్క తేలికపాటి సిలికేట్‌లు పెంకులో కనిపిస్తాయి, మాంటిల్‌లో ఎక్కువ మెగ్నీషియం సిలికేట్ ఉంటుంది. కోర్‌లో మెటాలిక్ ఇనుము, నికెల్‌లు ఎక్కువగా ఉంటాయి. వాతావరణం, లేదా మహాసముద్రాలు లేదా మానవ శరీరం వంటి ప్రత్యేక వాతావరణాలలో మూలకాల యొక్క సమృద్ధి, ప్రధానంగా అవి నివసించే మాధ్యమంతో రసాయన పరస్పర చర్యలను బట్టి ఉంది.

విశ్వం

మార్చు
పాలపుంత గెలాక్సీలోని పది అత్యంత సాధారణ మూలకాలు స్పెక్ట్రోస్కోపికల్‌గా అంచనా వేయబడ్డాయి [3]
Zమూలకంద్రవ్యరాశి భిన్నం
(ppm)
1హైడ్రోజన్
739,000
2హీలియం
240,000
8ఆక్సిజన్
10,400
6కార్బన్
4,600
10నియాన్
1,340
26ఇనుము
1,090
7నైట్రోజన్
960
14సిలికాన్
650
12మెగ్నీషియం
580
16సల్ఫర్
440
మొత్తం
999,060

మూలకాలు - అంటే, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లతో తయారు చేయబడిన సాధారణ (బారియోనిక్) పదార్థం, విశ్వంలోని మొత్తం పదార్థంలో ఒక చిన్న భాగం మాత్రమే. విశ్వం లోని మొత్తం శక్తిలో 4.6% మాత్రమే (శక్తి ద్వారా వచ్చే ద్రవ్యరాశితో సహా, E = mc 2m = E / c2) నక్షత్రాలు, గ్రహాలు, జీవులను కలిగి ఉండే కనిపించే బార్యోనిక్ పదార్థాన్ని కలిగి ఉంటుందని కాస్మోలాజికల్ పరిశీలనల్లో తేలింది. మిగిలినది డార్క్ ఎనర్జీ (68%), డార్క్ మ్యాటర్ (27%)తో కూడుకుని ఉంది. [4] ఈ పదార్థ, శక్తి రూపాలు శాస్త్రీయ సిద్ధాంతం, పరిశీలనలు, తార్కిక ఊహ ఆధారంగా ఉనికిలో ఉన్నాయని విశ్వసిస్తున్నవే తప్ప, వాటిని నేరుగా గమనించలేదు, వాటి స్వభావం కూడా సరిగా అర్థం కాలేదు.

చాలా ప్రామాణికమైన పదార్థం నక్షత్రమండలాల మద్యవున్న వాయువు, నక్షత్రాలు, నక్షత్ర మేఘాలలో, పరమాణువులు లేదా అయాన్ల (ప్లాస్మా) రూపంలో ఉంది. అయితే, ఇది తెల్ల మరగుజ్జు నక్షత్రాలు, న్యూట్రాన్ నక్షత్రాలలో అధిక సాంద్రత వంటి తీవ్ర ఖగోళ భౌతిక పరిస్థితులలో క్షీణించిన రూపాల్లో కూడా ఉంటుంది. .

హైడ్రోజన్ విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం కాగా, హీలియం రెండవది. అయితే, వీటి తరువాత, మూలకాల సమృద్ధిని చూస్తే అది పరమాణు సంఖ్యకు అనుగుణంగా లేదు; ఆక్సిజన్ సమృద్ధి ర్యాంక్ 3, కానీ పరమాణు సంఖ్య మాత్రం 8. మిగతా మూలకాలన్నీ చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి.

అతి తేలికైన మూలకాల సమృద్ధి ప్రామాణిక కాస్మోలాజికల్ మోడల్ ద్వారా బాగా అంచనా వేయగలిగారు. ఎందుకంటే అవి బిగ్ బ్యాంగ్ తర్వాత (కొన్ని వందల సెకండ్ల లోపు) బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ అని పిలువబడే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యాయి. భారీ మూలకాలు మాత్రం ఆ తరువాత చాలా కాలం తరువాత, నక్షత్రాల లోపల ఉత్పత్తి అయ్యాయి.

హైడ్రోజన్, హీలియంలు విశ్వంలోని మొత్తం బారియోనిక్ పదార్థంలో 74%, 24% వరకు ఉంటాయని అంచనా వేసారు. మిగిలిన "భారీ మూలకాలు", విశ్వంలో చాలా చిన్న భాగం మాత్రమే అయినప్పటికీ, ఖగోళ దృగ్విషయాలను ఇవి బాగా ప్రభావితం చేస్తాయి. పాలపుంత గెలాక్సీ డిస్క్‌లో కేవలం 2% (ద్రవ్యరాశి ద్వారా) మాత్రమే భారీ మూలకాలతో కూడుకుని ఉంటుంది.

ఈ ఇతర మూలకాలు నక్షత్ర ప్రక్రియల్లో ఉత్పన్నమవుతాయి. [5] [6] [7] ఖగోళ శాస్త్రంలో, హైడ్రోజన్, హీలియంలు కాకుండా ఏ ఇతర మూలకమైనా "లోహమే". ఈ వ్యత్యాసం ముఖ్యమైనది ఎందుకంటే హైడ్రోజన్, హీలియంలు మాత్రమే బిగ్ బ్యాంగ్‌లో గణనీయమైన పరిమాణంలో ఉత్పత్తయిన మూలకాలు. అందువల్ల, గెలాక్సీ లేదా ఇతర ఖగోళ వస్తువుల్లోని లోహత్వం, బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిన నక్షత్ర కార్యకలాపాలకు సూచన.

సాధారణంగా, ఇనుము వరకు ఉన్న మూలకాలు సూపర్నోవాగా మారే ప్రక్రియలో పెద్ద నక్షత్రాలలో తయారవుతాయి. ముఖ్యంగా ఐరన్-56 సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత స్థిరమైన న్యూక్లైడ్ (దీనిలో ఒక్కో న్యూక్లియోన్‌కు అత్యధిక అణు బంధన శక్తి ఉంటుంది). ఆల్ఫా కణాల నుండి సులభంగా తయారౌతుంది (రేడియో యాక్టివ్ నికెల్-56 యొక్క క్షయం నుండి ఉత్పత్తి అవుతుంది. అంతిమంగా 14 హీలియం కేంద్రకాలతో ఏర్పడుతుంది). ఇనుము కంటే బరువైన మూలకాలు, పెద్ద నక్షత్రాలలో శక్తిని ఆరగించే ప్రక్రియలలో తయారవుతాయి. పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ విశ్వంలోనూ, భూమి పైనా వాటి సమృద్ధి సాధారణంగా తగ్గుతుంది.

పాలపుంత గెలాక్సీలోని పది అత్యంత సాధారణ మూలకాలను ఈ పట్టిక చూపిస్తుంది (స్పెక్ట్రోస్కోపికల్‌గా వేసిన అంచనా). దీన్ని ద్రవ్యరాశి ప్రకారం పిపిఎమ్‌లో కొలుస్తారు. [8] ఇలాంతి పద్ధతి లోనే ఉద్భవించిన సమీప గెలాక్సీల్లో హైడ్రోజన్, హీలియంల కంటే భారీ మూలకాల సమృద్ధి ఈ విధంగానే ఉంది. మరింత సుదూరాల్లో ఉన్న గెలాక్సీలను నిజసమయంలో కాకుండా గత కాలపు పరిస్థితిని చూస్తాం కాబట్టి, వాటిలో మూలకాల సమృద్ధి ఆదిమకాలపు మిశ్రమానికి దగ్గరగా కనిపిస్తాయి. భౌతిక సూత్రాలు, ప్రక్రియలు విశ్వం అంతటా ఏకరీతిగా ఉన్నందున, ఈ గెలాక్సీలు కూడా ఒకే విధమైన మూలకాల సమృద్ధిని కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

మూలకాల సమృద్ధి, అవి ఉద్భవించిన మూలానికి తగినట్లుగా - బిగ్ బ్యాంగ్ లోను, ఆ తరువాత జరిగిన అనేక సూపర్నోవాల లోను, నక్షత్రాలలో న్యూక్లియోసింథసిస్ ద్వారానూ - ఉంటుంది. చాలా సమృద్ధిగా ఉన్న హైడ్రోజన్, హీలియంలు బిగ్ బ్యాంగ్ లో ఉద్భవించినవి. అయితే ఆ తరువాతి మూడు మూలకాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే అవి బిగ్ బ్యాంగ్‌లో ఏర్పడటానికి తగినంత సమయం లేదు. నక్షత్రాలలో నేమో అవి తయారు కావు (అయితే అవి, కాస్మిక్ కిరణాల ప్రభావం ఫలితంగా ఇంటర్స్టెల్లార్ ధూళిలో ఉండే భారీ మూలకాలు విచ్ఛిన్నం కావడం ద్వారా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. ).

కార్బన్‌తో ప్రారంభించి, ఆల్ఫా పార్టికల్స్ (హీలియం న్యూక్లియై) నుండి బిల్డప్ చేయడం ద్వారా మూలకాలు నక్షత్రాలలో ఉత్పత్తి అయ్యాయి. దీని ఫలితంగా సరి సంఖ్యలో పరమాణు సంఖ్యలు కలిగిన మూలకాలు పెద్ద సంఖ్యలో సమృద్ధిగా ఉంటాయి. బేసి-సంఖ్యల మూలకాల సమృద్ధి సాధారణంగా విశ్వంలో చాలా అరుదుగా ఉంటుంది. 1914లో అనుభవపూర్వకంగా దీన్ని గుర్తించారు. దీనిని ఓడ్డో-హార్కిన్స్ నియమం అని పిలుస్తారు.

కింది గ్రాఫ్ (లాగరిథమిక్ స్కేలు) సౌర వ్యవస్థలోని మూలకాల సమృద్ధిని చూపుతుంది.

సౌర వ్యవస్థలో మూలకాల సమృద్ధి అంచనాలు (లాగరిథమిక్ స్కేలు)
సౌర వ్యవస్థలో అత్యంత సమృద్ధిగా ఉండేన్యూక్లైడ్‌లు [9]
న్యూక్లైడ్ద్రవ్యరాశి భిన్నం -పార్ట్స్ పర్ మిలియన్‌లోపరమాణు భిన్నం -పార్ట్స్ పర్ మిలియన్‌లో
హైడ్రోజన్-11
705,700
909,964
హీలియం-44
275,200
88,714
ఆక్సిజన్-1616
9,592
477
కార్బన్-1212
3,032
326
నైట్రోజన్-1414
1,105
102
నియాన్-2020
1,548
100
ఇతర న్యూక్లైడ్లు:
3,616
172
సిలికాన్-2828
653
30
మెగ్నీషియం-2424
513
28
ఐరన్-5656
1,169
27
సల్ఫర్-3232
396
16
హీలియం-33
35
15
హైడ్రోజన్-22
23
15
నియాన్-2222
208
12
మెగ్నీషియం-2626
79
4
కార్బన్-1313
37
4
మెగ్నీషియం-2525
69
4
అల్యూమినియం-2727
58
3
ఆర్గాన్-3636
77
3
కాల్షియం-4040
60
2
సోడియం-2323
33
2
ఐరన్-5454
72
2
సిలికాన్-2929
34
2
నికెల్-5858
49
1
సిలికాన్-3030
23
1
ఐరన్-5757
28
1
Periodic table showing the cosmological origin of each element

సూర్యుడు ఏర్పడిన పదార్థ మేఘం నుండే భూమి కూడా ఏర్పడింది. అయితే సౌర వ్యవస్థ ఏర్పడి, పరిణామం చెందే సమయంలో గ్రహాలు వేర్వేరు కూర్పులను పొందాయి. భూమి ప్రాకృతిక చరిత్రలో కూడా గ్రహంలో మూలకాల సాంద్రతలు విభిన్నంగా ఉండటానికి కారణమైంది.

భూమి ద్రవ్యరాశి సుమారు 5.97×1024 కిలొగ్రాములు. ద్రవ్యరాశిని బట్టి ఇది ఎక్కువగా ఇనుము (32.1%), ఆక్సిజన్ (30.1%), సిలికాన్ (15.1%), మెగ్నీషియం (13.9%), సల్ఫర్ (2.9%), నికెల్ (1.8%), కాల్షియం (1.5%), అల్యూమినియం (1.4%) లతో కూడుకుని ఉంది. మిగిలిన 1.2% భాగంలో ఇతర మూలకాలు కొద్దిపాటి మొత్తాల్లో ఉన్నాయి. [10]

మౌలిక ద్రవ్యరాశి ప్రకారం చూస్తే సౌర వ్యవస్థ కూర్పు ఎలా ఉందో స్థూలంగా భూమి కూర్పు కూడా అలాగే ఉంది. ప్రధాన తేడా ఏమిటంటే అస్థిర మూలకాలైన హైడ్రోజన్, హీలియం, నియాన్, నత్రజని, అలాగే అస్థిర హైడ్రోకార్బన్‌లుగా కోల్పోయిన కార్బన్‌లు భూమిపై తక్కువగా ఉన్నాయి. మిగిలిన మౌలిక కూర్పు ప్రకారం చూస్తే భూమి సౌర వ్యవస్థ లోపలి రాతిగ్రహాల లాగానే ఉంటుంది. ఉష్ణ మండలంలో ఉన్న ఈ లోపలి రాతిగ్రహాల లోని అస్థిర సమ్మేళనాలు సౌర వేడి కారణంగా అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయి. భూమి ద్రవ్యరాశిలో రెండవ అతిపెద్ద దైన ఆక్సిజన్ (ఇదే అతిపెద్ద పరమాణు భిన్నం) ప్రధానంగా సిలికేట్ ఖనిజాల రూపంలో ఉంది. ఈ ఖనిజానికి చాలా ఎక్కువ ద్రవీభవన స్థానం, అతి తక్కువ బాష్ప పీడనం ఉన్నాయి.

పైపెంకు

మార్చు
పరమాణు సంఖ్యను బట్టి భూమి ఖండాంతర పెంకులోని మూలకాల యొక్క సమృద్ధి (పరమాణు భిన్నం). క్రస్ట్‌లోని అరుదైన మూలకాలు (పసుపు రంగులో) కారకాల కలయిక కారణంగా చాలా అరుదు: గోల్డ్‌స్చ్‌మిడ్ట్ వర్గీకరణలో ఒకటి మినహా మిగిలినవన్నీ దట్టమైన సైడెరోఫిల్స్ (ఇనుమును ప్రేమించే) మూలకాలు, అంటే అవి లోహ ఇనుముతో బాగా మిళితమయ్యే ధోరణిని కలిగి ఉంటాయి. భూమి అంతర్భాగంలోకి చొచ్చుకు పోవడం వలన అవి తగ్గిపోయాయి. ఉల్కలలో వాటి సమృద్ధి ఎక్కువ. అదనంగా, అస్థిర హైడ్రోజన్ టెల్యురైడ్ ఏర్పడటంతో టెల్లూరియం క్షీణించింది. [12]

భూమి పైపెంకులో అత్యంత సమృద్ధిగా ఉన్న తొమ్మిది మూలకాల యొక్క ద్రవ్యరాశి-సమృద్ధి సుమారుగా: ఆక్సిజన్ 46%, సిలికాన్ 28%, అల్యూమినియం 8.3%, ఇనుము 5.6%, కాల్షియం 4.2%, సోడియం 2.5%, మెగ్నీషియం 2.4%, పొటాషియం, 20%, టైటానియం 0.61%. ఇతర మూలకాలు 0.15% కంటే తక్కువగా ఉంటాయి.

కుడివైపున ఉన్న గ్రాఫ్ భూమి ఖండాంతర పెంకు లోని మూలకాల సాపేక్ష పరమాణు-సమృద్ధిని వివరిస్తుంది. ఈ పెంకు భాగంలో కొలతలు అంచనాలు వెయ్యడం మిగతా భాగాల కంటే తేలిక - అందుబాటులో ఉంటుంది కాబట్టి.

గ్రాఫ్‌లో చూపించిన అనేక అంశాలు (పాక్షికంగా అతివ్యాప్తి చెందాయి) వర్గాలుగా వర్గీకరించబడ్డాయి:

  1. రాతిని ఏర్పరచే మూలకాలు (ఆకుపచ్చ ఫీల్డ్‌లోని ప్రధాన మూలకాలు, లేత ఆకుపచ్చ క్షేత్రంలోని చిన్న మూలకాలు);
  2. అరుదైన భూమి మూలకాలు (లాంతనైడ్స్ (La–Lu), Sc, Y; నీలం రంగులో);
  3. ప్రధాన పారిశ్రామిక లోహాలు (ప్రపంచ ఉత్పత్తి >~3×10 7 kg/సంవత్సరం; ఎరుపు రంగులో);
  4. విలువైన లోహాలు (ఊదా రంగులో);
  5. తొమ్మిది అరుదైన "లోహాలు" – ఆరు ప్లాటినం సమూహ మూలకాలు ప్లస్ Au, Re, Te (ఒక మెటాలాయిడ్) – పసుపు క్షేత్రంలో. ఇవి ఇనుములో కరిగడం వలన భూమి కోర్‌లో కేంద్రీకృతమై ఉంటాయి, పెంకులో చాలా అరుదు. టెల్లూరియం అనేది విశ్వ సమృద్ధికి సంబంధించి భూమిలో అత్యంత క్షీణించిన మూలకం. [13]

మాంటిల్

మార్చు

భూమి మాంటిల్‌లో అత్యంత సమృద్ధిగా ఉన్న ఏడు మూలకాల యొక్క ద్రవ్యరాశి-సమృద్ధి సుమారుగా: ఆక్సిజన్ 44.3%, మెగ్నీషియం 22.3%, సిలికాన్ 21.3%, ఇనుము 6.32%, కాల్షియం 2.48%, అల్యూమినియం 2.29%, నికెల్ 0.19% [14]

ద్రవ్యరాశి విభజన కారణంగా, భూమి కోర్‌లో ప్రధానంగా ఇనుము (88.8%), చిన్న మొత్తంలో నికెల్ (5.8%), సల్ఫర్ (4.5%), 1% కంటే తక్కువ భాగం ట్రేస్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుందని భావిస్తున్నారు. [15]

సముద్రం

మార్చు

ద్రవ్యరాశి శాతం ప్రకారం సముద్రంలో అత్యధికంగా లభించే మూలకాలు ఆక్సిజన్ (85.84%), హైడ్రోజన్ (10.82%), క్లోరిన్ (1.94%), సోడియం (1.08%), మెగ్నీషియం (0.13%), సల్ఫర్ (0.09%), కాల్షియం (0.04%), పొటాషియం (0.04%), బ్రోమిన్ (0.007%), కార్బన్ (0.003%), బోరాన్ (0.0004%).

వాతావరణం

మార్చు

వాతావరణంలో ఘనపరిమాణ-ఫ్రాక్షన్ (సుమారుగా మాలిక్యులర్ మోల్-ఫ్రాక్షన్ అంతే) ద్వారా మూలకాల క్రమం నైట్రోజన్ (78.1%), ఆక్సిజన్ (20.9%), [16] ఆర్గాన్ (0.96%), ఆ తర్వాత కార్బన్, హైడ్రోజన్. ఈ చివరి రెండూ ఎంత స్థాయిల్లో ఉంటాయనేది నిశ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఈ రెండూ గాలిలో ఉండే నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ రూపాలలో ఉంటాయి, ఈ రెండూ మారుతూ ఉంటాయి. సల్ఫర్, భాస్వరం, తదితర మూలకాలు గణనీయంగా తక్కువ నిష్పత్తిలో ఉంటాయి.

సమృద్ధి కర్వ్ గ్రాఫ్ ప్రకారం, వాతావరణంలోని ముఖ్యమైన భాగంగా కాకపోయినా గణనీయమైన భాగంగా ఉండే ఆర్గాన్, పైపెంకులో అస్సలు కనిపించదు. ఎందుకంటే వాతావరణ ద్రవ్యరాశి క్రస్ట్ ద్రవ్యరాశి కంటే చాలా తక్కువ. కాబట్టి క్రస్ట్‌లో మిగిలి ఉన్న ఆర్గాన్ అక్కడ ద్రవ్యరాశి-భాగానికి చాలా తక్కువ దోహదం చేస్తుంది, అదే సమయంలో వాతావరణంలో ఆర్గాన్ స్థాయి గణనీయమైన స్థాయిలో ఉంటుంది.


మానవ శరీరం

మార్చు

ద్రవ్యరాశి ప్రకారం, మానవ కణాల్లో 65-90% నీరు (H2O) ఉంటుంది. మిగిలిన వాటిలో ముఖ్యమైన భాగం కార్బన్-ఉండే ఆర్గానిక్ అణువులతో కూడి ఉంటుంది. అందువల్ల మానవ శరీర ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం ఆక్సిజన్, దాని తర్వాత కార్బన్‌ ఉంటాయి. మానవ శరీర ద్రవ్యరాశిలో దాదాపు 99% ఆరు మూలకాలతోనే కూడుకుని ఉంది. అవి: హైడ్రోజన్ (H), కార్బన్ (C), నైట్రోజన్ (N), ఆక్సిజన్ (O), కాల్షియం (Ca), ఫాస్పరస్ (P). ఆ తరువాతి 0.75% మరో ఐదు మూలకాలతో రూపొందించబడింది. అవి: పొటాషియం (K), సల్ఫర్ (S), క్లోరిన్ (Cl), సోడియం (Na), మెగ్నీషియం (Mg). మొత్తమ్మీద కేవలం 17 మూలకాలు మాత్రమే మానవ జీవితానికి అవసరమని ఖచ్చితంగా తెలుసు, ఒక అదనపు మూలకం (ఫ్లోరిన్) పంటి ఎనామిల్ బలానికి సహాయపడుతుందని భావించారు. క్షీరదాల ఆరోగ్యంలో మరికొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ కొంత పాత్ర పోషిస్తాయి. బోరాన్, సిలికాన్ ముఖ్యంగా మొక్కలకు అవసరం కానీ జంతువులలో వీటి పాత్ర అనిశ్చితంగా ఉంది. అల్యూమినియం, సిలికాన్ మూలకాలు, భూమి పెంకులో చాలా సాధారణమే అయినప్పటికీ, మానవ శరీరంలో చాలా అరుదు. [17]

పోషక మూలకాలను హైలైట్ చేసే ఆవర్తన పట్టిక క్రింద ఉంది.

Nutritional elements in the periodic table
H He
LiBe BCNOFNe
NaMg AlSiPSClAr
KCaSc TiVCrMnFeCoNiCuZnGaGeAsSeBrKr
RbSrY ZrNbMoTcRuRhPdAgCdInSnSbTeIXe
CsBaLa*HfTaWReOsIrPtAuHgTlPbBiPoAtRn
FrRaAc**RfDbSgBhHsMtDsRgCnUutFlUupLvUusUuo
 
 *CePrNdPmSmEuGdTbDyHoErTmYbLu
 **ThPaUNpPuAmCmBkCfEsFmMdNoLr
  నాలుగు ఆర్గానిక్ మూలకాలు
  ఎక్కువ పరిమాణంలో ఉండే మూలకాలు
  ఆవశ్యకమైన కొద్దిపాటి మూలకాలు
  ఇవి తక్కువగా ఉంటే ప్రభావాన్ని చూపిస్తాయి, కానీ మానవుల్లో వీటి జీవ సహాయక గుణమేంటో కచ్చితంగా తెలియదు

ఇవి కూడా చూడండి

మార్చు
  • మూలకాల సమృద్ధి (డేటా పేజీ)
  • భూమి పైపెంకులో మూలకాల సమృద్ధి
  • ప్రాకృతిక సమృద్ధి (ఐసోటోపిక్ సమృద్ధి)
  • ప్రిమోర్డియల్ న్యూక్లైడ్
  • రసాయన మూలకాల కోసం డేటా సూచనల జాబితా

నోట్స్

మార్చు
  1. Below Jupiter's outer atmosphere, volume fractions are significantly different from mole fractions due to high temperatures (ionization and disproportionation) and high density where the Ideal Gas Law is inapplicable.

మూలాలు

మార్చు
  1. Vangioni-Flam, Elisabeth; Cassé, Michel (2012). Spite, Monique (ed.). Galaxy Evolution: Connecting the Distant Universe with the Local Fossil Record. Springer Science & Business Media. pp. 77–86. ISBN 978-9401142137.
  2. Trimble, Virginia (1996). Malkan, Matthew A. (ed.). The origin and evolution of the universe. Jones and Bartlett Publishers. ISBN 0-7637-0030-4.
  3. Croswell, Ken (February 1996). Alchemy of the Heavens. Anchor. ISBN 0-385-47214-5. Archived from the original on 2011-05-13.
  4. What is Dark Energy? Archived 2016-01-15 at the Wayback Machine, Space.com, 1 May 2013.
  5. (1956). "Abundances of the Elements".
  6. (1973). "Abundances of the elements in the solar system".
  7. (1982). "Solar-system abundances of the elements".
  8. Croswell, Ken (February 1996). Alchemy of the Heavens. Anchor. ISBN 0-385-47214-5. Archived from the original on 2011-05-13.
  9. Arnett, David (1996). Supernovae and Nucleosynthesis (First ed.). Princeton, New Jersey: Princeton University Press. p. 11. ISBN 0-691-01147-8. OCLC 33162440.
  10. Morgan, J. W.; Anders, E. (1980). "Chemical composition of Earth, Venus, and Mercury". Proceedings of the National Academy of Sciences. 77 (12): 6973–6977. Bibcode:1980PNAS...77.6973M. doi:10.1073/pnas.77.12.6973. PMC 350422. PMID 16592930.
  11. William F McDonough The composition of the Earth. quake.mit.edu, archived by the Internet Archive Wayback Machine.
  12. Anderson, Don L.; ‘Chemical Composition of the Mantle’ in Theory of the Earth, pp. 147–175 ISBN 0865421234
  13. Anderson, Don L.; ‘Chemical Composition of the Mantle’ in Theory of the Earth, pp. 147–175 ISBN 0865421234
  14. Wang, Haiyang S. (2018-01-01). "The elemental abundances (with uncertainties) of the most Earth-like planet".
  15. Morgan, J. W.; Anders, E. (1980). "Chemical composition of Earth, Venus, and Mercury". Proceedings of the National Academy of Sciences. 77 (12): 6973–6977. Bibcode:1980PNAS...77.6973M. doi:10.1073/pnas.77.12.6973. PMC 350422. PMID 16592930.
  16. Zimmer, Carl (3 October 2013). "Earth's Oxygen: A Mystery Easy to Take for Granted". The New York Times. Archived from the original on 3 October 2013. Retrieved 3 October 2013.
  17. Table data from Chang, Raymond (2007). Chemistry (Ninth ed.). McGraw-Hill. p. 52. ISBN 978-0-07-110595-8.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ