బైట్ అనగా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికర సమాచార పరిమాణం యొక్క కొలత ప్రమాణం. టైపు చేయబడిన ఒంటి అక్షరం (ఉదాహరణకు, 'x' లేదా '8') కొలత ఒక బైట్. సింగిల్ బైట్ సాధారణంగా ఎనిమిది బిట్స్ (బిట్స్ అనేవి క్రమంగా ఉండే కంప్యూటర్లోని నిల్వ యొక్క అతిచిన్న యూనిట్, అర్థమయ్యేలా చెప్పాలంటే పదార్థం కోసం అణువులుగా) లను కలిగి ఉంటుంది. బైట్లు తరచూ B అక్షరం ద్వారా సూచించబడతాయి. చారిత్రాత్మకంగా, బైట్లు పాఠ్య అక్షరాలు ఎన్కోడ్ చెయ్యటానికి ఉపయోగిస్తారు.

వాడకం మార్చు

చాలా ప్రోగ్రామింగ్ భాషల్లో బైట్ అనే డేటాటైపు ఉంది. సీ, సీ++ భాషల్లో ఒక బైట్ అంటే ఒక అక్షరాన్ని సూచించడానికి సరిపడే పరిమాణం కలిగిన మెమరీ లొకేషన్. ప్రామాణికత ప్రకారం ఒక బైట్ లో కనీసం 256 విలువలు భద్రపరచగలగాలి. అంటే కనీసం ఎనిమిది బిట్లు పరిమాణం ఉండాలి.

జావాలో బైట్ డేటాటైపు కచ్చితంగా ఎనిమిది బిట్లు ఉండాలి. అందులో ఒక బిట్ ను విలువ ధనాత్మకమా, ఋణాత్మకమా అని సూచించడానికి మిగతా వాటిని విలువను సూచించడానికి వాడతారు. అంటే జావాలో ఒక బైటు −128 నుంచి 127 సంఖ్యలను సూచిస్తుంది.

"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=బైట్&oldid=3014600" నుండి వెలికితీశారు
🔥 Top keywords: కింజరాపు రామ్మోహన నాయుడుభారత కేంద్ర మంత్రిమండలిమొదటి పేజీరామోజీరావుప్రత్యేక:అన్వేషణకింజరాపు ఎర్రన్నాయుడునారా చంద్రబాబునాయుడుచిరాగ్ పాశ్వాన్నిర్మలా సీతారామన్చెరుకూరి సుమన్తెలుగుదేశం పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపవన్ కళ్యాణ్నరేంద్ర మోదీబండి సంజయ్ కుమార్వాతావరణంనందమూరి బాలకృష్ణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుతెలుగువికీపీడియా:Contact usజి.కిషన్ రెడ్డిగాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఈనాడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలురామ్ విలాస్ పాశ్వాన్భక్తప్రహ్లాద (1931 సినిమా)వై.యస్.భారతిపరకాల ప్రభాకర్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాకల్కి 2898 ఏ.డీసురేష్ గోపీపెమ్మసాని చంద్ర శేఖర్తీన్మార్ మల్లన్నభారత హోం వ్యవహారాల మంత్రిభక్త ప్రహ్లాద (1967 సినిమా)