క్షేత్రం (వ్యవసాయం)

క్షేత్రం (వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ భూమి) అనగా రైతులు పంటలు పండించే ప్రదేశం యొక్క విస్తీర్ణం. క్షేత్రాలలో మాగాణి అని, బీడు భూమి అని రకాలు ఉన్నాయి. బీడు భూములలో కూడా మనుషులకు, జంతువులకు కూడా ఉపయోగపడే కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి. బీడు భూములలో పెరిగే మొక్కలు సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ క్షేత్రాలలో పశువులకు పశుగ్రాసం సహజసిద్ధంగానే లభిస్తుంది. సాధారణంగా ఉపయోగించే చీపురు పుల్లలు బీడు భూములలో సహజసిద్ధంగా పెరుగుతాయి. సాధారణంగా ఈ క్షేత్రాలు పొదలు, వృక్షసంపదలతో కూడి ఉంటాయి. వన్యప్రాణుల మనుగడకు అవసరమైన ఆహారం ఈ క్షేత్రాలు అందిస్తాయి, అయితే దిగుబడి తక్కువగా వుంటుంది.

స్పెయిన్ లోని కార్డెజోన్‌లో పొద్దుతిరుగుడు పువ్వుల క్షేత్రం (2012)

వ్యవసాయ క్షేత్రాలు మార్చు

ప్రధాన వ్యాసం: పొలం

వ్యవసాయ భూములు సారవంతమైన నేలను కలిగివుంటాయి, ఇవి ప్రధానంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడతాయి. ఆహారం, ఇతర పంటలను ఉత్పత్తి చేయుటకు ప్రాథమిక అవసరం పొలం. ప్రధానంగా వ్యవసాయ ప్రక్రియలకు అంకితం చేయబడిన భూమినే పొలం అంటారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆహారం, ఇతర పంటలను ఉత్పత్తి చేయడం. వ్యవసాయ యోగ్యమైన భూమిలో కూరగాయలు పండిస్తున్నట్లయితే ఆ భూమిని కూరగాయల పొలాలు అని అంటారు. పండ్ల చెట్లను పండించే క్షేత్రాలను పండ్ల క్షేత్రాలు లేదా పండ్ల తోటలని అంటారు. పొలాలను సహజ ఫైబర్స్, జీవ ఇంధనాలు, ఇతర పదార్థాల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. పశువులకు పశుగ్రాసం కొరకు పొలాలలో గడ్డిని పెంచుతారు. పంటలను బట్టి, ఉపయోగించే విధానాన్ని బట్టి పొలాలకు తోటలని, ఎస్టేట్లు అని, ఫామ్‌హౌస్‌లు అని కొన్ని రకాలు ఉన్నాయి.

🔥 Top keywords: మొదటి పేజీతెలుగుప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపిన్నెల్లి రామకృష్ణారెడ్డిఈనాడుశ్రీ గౌరి ప్రియబొత్స సత్యనారాయణభాగ్యరెడ్డివర్మమాచెర్ల శాసనసభ నియోజకవర్గంపవిత్ర జయరామ్తీన్మార్ మల్లన్నవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాతావరణంతెలుగు అక్షరాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంసెక్స్ (అయోమయ నివృత్తి)వేటూరి సుందరరామ్మూర్తి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుయూట్యూబ్అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంహేమనక్షత్రం (జ్యోతిషం)అంగుళంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅరుణాచలంకుక్కుట శాస్త్రంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివిరాట్ కోహ్లిభారతదేశంలో కోడి పందాలుపిన్నెల్లి లక్ష్మారెడ్డిప్రత్యేక:ఇటీవలిమార్పులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారామాయణంమహేంద్రసింగ్ ధోనిబంజారా దసరా పండుగగాయత్రీ మంత్రంఎనుముల రేవంత్ రెడ్డిప్రకృతి - వికృతి