వికీపీడియా:అనాథ

అనాథ పేజీ అంటే "ప్రధాన పేరుబరి లోని పేజీల నుండి ఒక్క లింకైనా లేని పేజీ". వికీపీడియా అన్వేషణలో ఈ పేజీలు దొరుకుతాయి. కానీ ఈ పేజీలు సంబంధిత పేజీల నుండి ఈ పేజీలను చేరుకోగలగడం వంఛనీయం. అందుచేత్ సంబంధిత సమాచారం కలిగిన పేజీల నుండి ఈ పేజీకి లింకులివ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. అనాథలను తొలగించడం జాలనిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం.

అనాథ అంటే ఏమిటి? పరిగణించడం ఎలా? మార్చు

ఓ పేజీకి మరే ఇతర పేజీ నుండీ లింకు లేకపోతే దాన్ని అనాథ పేజీగా పరిగణిస్తారు. ఏ పేజీకైనా ఇన్‌కమింగు లింకులు అస్సలేమీ లేకపోతేనే {{Orphan}} మూసను ఉంచండి. అనాథల జాబితా నుండి తీసెయ్యడానికి ఒక్క లింకు ఉన్నా సరిపోతుంది. కానీ రెండు కంటే ఎక్కువ లింకులుంటే మంచిది.

కింది పేజీల నుండి వచ్చే లింకులు ఇన్‌కమింగు లింకులుగా పరిగణింపబడవు:

  1. అయోమయ నివృత్తి పేజీలు
  2. దారిమార్పులు సాఫ్టు దారిమార్పులు
        ...దారిమార్పులకు వచ్చే ఇన్‌కమింగు లింకులు పరిగణనలోకి వస్తాయి
  3. చర్చా పేజీలు
  4. ప్రధాన పేరుబరిలో కాకుండా వేరే ఏ ఇతర పేరుబరిలో ఉన్న పేజీలైనా

కింది లింకులు పరిగణన లోకి వస్తాయి:

  1. ప్రధాన పేరుబరి లోని ఏ పేజీ అయినా -పైన చూపిన జాబితాలోనివి కాకపోతే.
  2. జాబితా వ్యాసాలు
  3. సెట్ ఇండెక్సులు

వ్యాసం అనాథ అయితే ఏంటి? మార్చు

అనాథ వ్యాసాలకు వేరే ఇతర పేజీల నుండి లింకులేమీ లేనందున పాఠకులు ఇతర పేజీల నుండి ఈ పేజీలకు వెళ్ళే అవకాశం లేదు. పాఠకులు వాటికి వెళ్ళాలంటే సాధారణంగా రెండే మార్గాలున్నాయి - వెతుకులాటలో కనబడడం, లేదా కేవలం కాకతాళీయంగా కనబడడం. ఈ కారణం వలన, ఆయా వ్యాసాలున్నట్లు ఎక్కువ మందికి తెలియకుండా పోతుంది. వీటిని చదివేవారు తక్కువగా ఉంటారు, మార్పుచేర్పులూ తక్కువ గానే జరుగుతూంటాయి.

దీనికి తోడు వ్యాసపు విషయం కూడా అంతగా ప్రాచుర్యం లేనిదైతే, ఇక ఆ వ్యాసం ఉందని తెలుసుకోవడం మరీ కష్టమౌతుంది. ప్రత్యేకించి ఆ వ్యాసం కోసమో, ఆ విషయం గురించో వెతికినపుడు, అది ఉన్న వర్గాన్ని శోధించినపుడు, ఆ పేజీలో మార్పు చేర్పులు చేసిన వారి వాడుకరి రచనలను చూసినపుడో మాత్రమే ఈ పేజీ కనిపించే అవకాసం ఉంది. లేదా యాదృచ్ఛిక పేజీ లింకు ద్వారా కాకతాళీయంగా కనబడాలి.

అనాథగా గుర్తించడం మార్చు

ఏదైనా పేజీకి వెళ్ళి, పరికరాల పెట్టె లోని ఇక్కడికి లింకున్న పేజీలు అనే లింకును నొక్కి, సదరు పేజీకి ఎక్కడెక్కడి నుండి లింకులున్నాయో చూడవచ్చు. పైన చూపిన పరిగణన లోకి వస్తే, {Tl|Orphan}} అనే మూసను పేజీలో పైన చేర్చండి.

ముందే అనాథలను తయారుచెయ్యకుండా ఉండడం మార్చు

కొత్త వ్యాసాన్ని తయారుచేసేటపుడే దాన్ని అనాథ కాకుండా చూడాలి. సంబంధిత లింకులను పట్టుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ పట్టుకోవచ్చు. సమయం పడితే పట్టనీండి, పనులన్నీ ఒకే రోజులో అయ్యేవి కాదుగదా! ఈ పని మీ మనసులో ఉంటే చాలు, ఇవ్వాళ కాకపోతే రేపవుతుంది.

మూసలు మార్చు

  • {{Orphan}} - అనాథగా గుర్తించేందుకు

మూలాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

🔥 Top keywords: పవిత్ర జయరామ్మొదటి పేజీప్రత్యేక:అన్వేషణకన్యకా పరమేశ్వరిశ్రీ గౌరి ప్రియఈనాడువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమహేంద్రసింగ్ ధోనినారా చంద్రబాబునాయుడుతెలుగు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబోండా ఉమామహేశ్వర రావుసెక్స్ (అయోమయ నివృత్తి)వై.యస్.భారతిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅనసూయ భరధ్వాజ్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)తెలుగు అక్షరాలుకుక్కుట శాస్త్రంభారతదేశంలో కోడి పందాలుకార్తెతీన్మార్ మల్లన్నవిరాట్ కోహ్లిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఅంగుళంయూట్యూబ్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలుగు సినిమాలు 2024శుభాకాంక్షలు (సినిమా)గాయత్రీ మంత్రంపుచ్చలపల్లి సుందరయ్యభారత రాజ్యాంగంనారా బ్రహ్మణికేతిరెడ్డి పెద్దారెడ్డిఇండియన్ ప్రీమియర్ లీగ్