కార్గిల్

లడఖ్ లోని పట్టణం

కార్గిల్ లడఖ్, కార్గిల్ జిల్లాలో పట్టణం. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఉమ్మడి రాజధాని.[3] లేహ్ తరువాత, ఇది లడఖ్లో రెండవ అతిపెద్ద పట్టణం.[4] ఇది శ్రీనగర్ నుండి 204 కి.మీ. తూర్పున, లేహ్కు పశ్చిమాన 234 కి.మీ. దూరం లోనూ ఉంది. చారిత్రికంగా దీన్ని పూరిగ్ అని పిలుస్తారు.ఇది కార్గిల్ జిల్లా ముఖ్యపట్టణం

కార్గిల్
కార్గిల్
కార్గిల్
కార్గిల్ is located in Ladakh
కార్గిల్
కార్గిల్
కార్గిల్ is located in India
కార్గిల్
కార్గిల్
Coordinates: 34°33′N 76°08′E / 34.550°N 76.133°E / 34.550; 76.133
దేశం భారతదేశం
కేంద్రపాలిత ప్రాంతంలడఖ్
జిల్లాకార్గిల్
తహసీల్కార్గిల్
Government
 • Typeలడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్, కార్గిల్
Area
 • Total2.14 km2 (0.83 sq mi)
Elevation
2,676 మీ (8,780 అ.)
Population
 (2011)[1]
 • Total16,338
ఇతర
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationLA 02
అధికార భాషపుర్గి, లడాఖి, హిందీ, ఇంగ్లీషు[2]

శబ్దవ్యుత్పత్తి మార్చు

కార్గిల్ అనే పేరు ఖార్, ర్కిల్ అనే పదాల నుండి వచ్చింది. ఖార్ అంటే "కోట" అని, ర్కిల్ అంటే "కేంద్ర" అనీ అర్ధం. కార్గిల్, అనేక కోటల మధ్య, ప్రజలు నివసించగలిగే కేంద్ర ప్రదేశాన్ని సూచిస్తుంది. శ్రీనగర్, లేహ్, స్కర్దూ (కాశ్మీర్ లోయ, లడఖ్, బాల్టిస్తాన్ ల రాజధానులు) ల నుండి సమానమైన దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి ఈ పేరు తగినదిగానే కనిపిస్తుంది.[5]

చారిత్రికంగా, కార్గిల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పూరిగ్ అని పిలిచేవారు.[6] పూరిగ్ చరిత్ర గురించి ఒక ప్రధాన అధ్యయనం 1987 లో కచో సికందర్ ఖాన్ రాసిన ఖదీమ్ లడఖ్ పుస్తకంలో ఉంది. ఇందులో ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజవంశాల వంశవృక్షాలు ఉన్నాయి.[7]

చరిత్ర మార్చు

కార్గిల్ చారిత్రక ప్రాంతమైన పూరిగ్‌లో ప్రధాన పట్టణం. సురు నది పరీవాహక ప్రాంతం ఈ ప్రాంతంలో భాగం. చారిత్రికంగా కార్గిల్, ఈ ప్రాంతానికి రాజధాని కాదు. పూర్వం, పూరిగ్‌లో పాష్కం, చిక్తాన్, ఫోకర్, సోత్, సురు లోయ వంటి అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుండేవి. ఈ చిన్న సంస్థానాలు తరచూ చిన్న సమస్యలపై తమలో తాము కలహించుకుంటూండేవి. సా.శ. 9 వ శతాబ్దంలో బహిష్కృతుడైన యువరాజు గాషో “థాతా ఖాన్” బహుశా ఈ భూభాగాలన్నిటినీ మొదటిసారి ఐక్యం చేసి ఒకే ఛత్రం కిందకి తెచ్చాడు. పూరిగ్ యొక్క మరొక సుల్తాను జాన్స్కర్, సోట్, బార్సూ, సంకూలను ప్రస్తుత కార్గిల్ జిల్లా భూభాగానికి కలుపుకుని తన రాజ్యాన్ని విస్తరించాడు. అతన్ని "ది పూరిగ్ సుల్తాన్" అని పిలుస్తారు. అతని రాజధాని సురు లోయలోని కార్పోఖర్ వద్ద ఉండేది. కార్గిల్ యొక్క ఇతర ప్రసిద్ధ రాజులు బోటి ఖాన్, అబ్దుల్ ఖాన్, అమ్రూద్ చూ, త్సేరింగ్ మాలిక్, కుంచోక్ షెరాబ్ స్టాన్, థీ సుల్తాన్.

16 వ శతాబ్దం చివర, 17 వ శతాబ్దం మొదట్లో స్కర్దూను పాలించిన ఆలీ షేర్ ఖాన్ అంచాన్ తన కాలంలో ఈ ప్రాంతంపై ఒక గొప్ప ప్రభావాన్ని కలిగించాడు. బాల్టిస్తాన్ కు చెందిన ఈ యువరాజు పూరిగ్ లోని చాలా రాజ్యాలను జయించాడు. కార్గిల్ జిల్లాలో బాల్టి సంస్కృతిని ప్రవేశపెట్టాడు. తదనంతరం, 19 వ శతాబ్దం మొదటి భాగంలో డోగ్రాలు బాల్టిస్తాన్, పూరిగ్, జాన్స్కర్, ప్రస్తుత లేహ్ జిల్లాలను ఏకం చేసి తమ పాలన లోకి తెచ్చుకున్నారు. 1947-49 లలో భారత, పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన కొత్త కాల్పుల విరమణ రేఖ స్కర్దూ కార్గిల్‌లను వేరు చేసేవరకు ఇది కొనసాగింది.[8]

నియంత్రణ రేఖ - కార్గిల్
కార్గిల్ యుద్ధంలో యుద్ధంలో గెలిచిన తరువాత భారత సైనికులు

1947 లో భారతదేశ విభజనకు ముందు కార్గిల్, లడఖ్ వజారత్ (జిల్లా) లో భాగంగా ఉండేది. విభిన్న భాష, జాతి, మత సమూహాలతో కూడుకున్న కొద్దిపాటి జనాభా కలిగిన ప్రాంతం. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. వీటి మధ్య ఉన్న లోయల్లో ప్రజల నివాసాలుంటాయి: లడఖ్ వజారత్లో లేహ్, స్కర్దూ, కార్గిల్ అనే మూడు ప్రధాన తహసీళ్ళున్నాయి. జిల్లా ప్రధాన కార్యాలయం ప్రతి సంవత్సరం ఈ మూడు ప్రదేశాల మధ్య మారుతూండేది.[9]

మొదటి కాశ్మీర్ యుద్ధం (1947-48) తరువాత, కార్గిల్, లెహ్ తహసీళ్ళు భారత వైపు, స్కర్దూ పాకిస్తాన్ వైపుకూ వెళ్ళాయి. భారత్ వైపుకు వచ్చిన రెండు తహసీళ్ళు, జిల్లాలయ్యాయి. లడఖ్ రెవెన్యూ డివిజనైంది. పాకిస్తాన్ వైపుకు వెళ్ళిన స్కర్దూ తహసీలుకు, బాల్టిస్తాన్ అని పేరు మార్చారు. దానిని మరిన్ని జిల్లాలుగా విభజించారు.

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం ముగింపులో, ఇరు దేశాలు సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. 1949 కరాచీ ఒప్పందం నాటి కాల్పుల విరమణ రేఖనే కొన్ని సర్దుబాట్లతో నియంత్రణ రేఖగా మార్చారు. ఆ రేఖకు సంబంధించి ఇకపై పోరాటాలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.[10]

1999 లో ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ దళాలు చొరబడ్డాయి. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసింది. శ్రీనగర్ - లెహ్ రహదారికి సమీపంలో 160 కి.మీ. పొడవున ఉన్న శిఖరాలపై ఈ పోరాటం జరిగింది.[11] రహదారి పైన ఉన్న శిఖరాలపై ఉన్న సైనిక కేంద్రాలు సాధారణంగా 5,000 మీటర్లు (16,000)  అడుగులు) ఎత్తు, 5,485 మీటర్లు (18,000)  అడుగులు) ఎత్తున ఉన్నాయి. అనేక నెలల పోరాటం, దౌత్య కార్యకలాపాల తరువాత, ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అమెరికా సందర్శన తరువాత, పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది.[12]

భౌగోళికం మార్చు

కార్గిల్ సమీపంలో సురు నది
కార్గిల్ యుద్ధ స్మారకం

కార్గిల్ సగటు ఎత్తు 2,676 మీటర్లు (8,780 అడుగులు). ఇది సురు నది (సింధు) ఒడ్డున ఉంది. కార్గిల్ పట్టణం శ్రీనగర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది.[13] LOCకి ఆవల ఉన్న ఉత్తర ప్రాంతాలకు ఎదురుగా ఉంది. హిమాలయాల్లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, కార్గిల్‌లో కూడా సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. వేసవిలో వేడిగాను, రాత్రుళ్ళు చల్లగానూ ఉంటుంది. శీతాకాలాలు సుదీర్ఘంగా, ఉష్ణోగ్రతలు − 20 °C వరకు పడిపోతూ ఉంటాయి.[14]

జనాభా వివరాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, కార్గిల్ పట్టణ జనాభా 16,338. జనాభాలో ఎక్కువ భాగం (11,496) షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. ఇక్కడి అక్షరాస్యత రేటు 75%.[1]

మతం మార్చు

కార్గిల్ పట్టణంలో 77% మంది గల ముస్లిములు అతిపెద్ద మతవర్గం. 19.21% మందితో హిందువులు రెండవ స్థానంలో ఉంటారు. బౌద్ధ, సిక్కుమతావలంబికులు 0.54%, 2.2%గా ఉన్నారు.[15]

సమాచార ప్రసార సౌకర్యాలు మార్చు

ఆల్ ఇండియా రేడియో ఛానల్ AIR కార్గిల్ AM 684 కార్గిల్ పట్టణం నుండి ప్రసారాలు చేస్తుంది.[16]

రవాణా సౌకర్యాలు మార్చు

విమానాశ్రయం మార్చు

కార్గిల్ విమానాశ్రయం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది పని చేసే విమానాశ్రయం కాదు. దీన్ని ఉడాన్ పథకంలో చేర్చారు. సమీప భవిష్యత్తులో పనిచెయ్యడం మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దగ్గరి లోని విమానాశ్రయం లేహ్‌లో ఉంది.

రైలు మార్చు

కార్గిల్‌కు ఇంకా రైలు మార్గం లేదు. శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైల్వే లైన్ ప్రతిపాదనలో ఉంది. ఇది శ్రీనగర్, లేహ్‌ లను కార్గిల్ ద్వారా కలుపుతుంది. కార్గిల్‌కు సమీప ప్రధాన రైల్వే స్టేషన్ 472 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ తావి.

రోడ్డు మార్చు

శ్రీనగర్‌ను లేహ్‌తో కలిపే భారతీయ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 1) కార్గిల్ ద్వారా వెళ్తుంది.

కార్గిల్-స్కర్దూ రోడ్ మార్చు

కార్గిల్-స్కర్ధు ల మధ్య అన్ని వాతావరణాల్లోనూ పనిచేసే రోడ్డు ఉండేది. 1948 కాశ్మీర్ యుద్ధం తరువాత, దాన్ని మూసివేసారు. మానవతా దృష్టితో ఈ రహదారిని తెరవడానికి భారత ప్రభుత్వం ఆసక్తి కనబరిచినప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరించింది.[17][18][19]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమొదటి పేజీతెలంగాణ అవతరణ దినోత్సవంప్రత్యేక:అన్వేషణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహనుమంతుడుహనుమజ్జయంతితెలంగాణ ఉద్యమంతనికెళ్ళ భరణిహనుమాన్ చాలీసావాతావరణంతెలుగుసెక్స్ (అయోమయ నివృత్తి)ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్అందెశ్రీరామాయణంతెలంగాణకార్తెలోక్‌సభ నియోజకవర్గాల జాబితా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులోక్‌సభజయ జయహే తెలంగాణసుందర కాండభారతదేశంలో కోడి పందాలుకుక్కుట శాస్త్రంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాయూట్యూబ్ఇండియా కూటమిగాయత్రీ మంత్రంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరావణుడుపల్నాడు జిల్లాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంకిష్కింధకాండ (సినిమా)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా