అంగస్తంభన (penile erection) అనగా పురుషాంగం పరిమాణంలో పెద్దదిగా, గట్టిగా తయారౌతుంది. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఈ క్లిష్టమైన ప్రక్రియలో మానసిక, నాడీ మండలం, రక్తనాళాలు, వినాళగ్రంధులు విశేషమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువమందిలో ఇది శృంగార భావాల మూలంగా జరుగుతుంది అయితే మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు కూడా అంగం స్తంభించవచ్చును. కొంతమందికి నిద్రలో కూడా అంగస్తంభన జరుగుతుంది. అంగస్తంభన రతి ప్రక్రియలో యోనిలో వీర్యం స్కలించడానికి చాలా అవసరం. పురుషాంగమే కాకుండా స్త్రీలలో వక్షోజాల చూచుకము, క్లైటోరిస్లు కూడా స్తంభిస్తాయి.

అంగస్తంభనలో వివిధ దశలు
స్తంభించక ముందు స్తంభించిన తర్వాత పురుషాంగం.

శరీర ధర్మశాస్త్రం

పురుషాంగంలోని రెండు స్తంభాకార నిర్మాణాలైన కార్పొరా కెవర్నోసా, స్పాంజియోసాలు రక్తంతో నిండుట వలన అంగస్తంభన జరుగుతుంది. వీని మధ్యనుండే మూత్రం, వీర్యం ప్రయాణించే ప్రసేకం పోతుంది. అంగంతో పాటు వృషణాలను చుట్టియుండే చర్మ కండరాలు కూడా బిగుసుకుంటాయి. చాలామందిలో పుర్వచర్మం వెనుకకు పోయి ఎర్రని గ్లాన్స్ బయటకు కనిపిస్తుంది. స్కలనం జరిగిన తర్వాత అంగం కుంచించుకొని పోతుంది.[1]

మూలాలు

  1. Harris, Robie H. (et al.), It's Perfectly Normal: Changing Bodies, Growing Up, Sex And Sexual Health. Boston, 1994. (ISBN 1-56402-199-8)
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఅందెశ్రీప్రత్యేక:అన్వేషణ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువికీపీడియా:Contact usవజ్రాయుధంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసెక్స్ (అయోమయ నివృత్తి)హేమవాతావరణంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుజయ జయహే తెలంగాణ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసజ్జల రామకృష్ణా రెడ్డినారా చంద్రబాబునాయుడుయూట్యూబ్రోజా సెల్వమణిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతెలుగు అక్షరాలుశ్రీ గౌరి ప్రియకార్తెతెలంగాణ2024 భారత సార్వత్రిక ఎన్నికలుపరిపూర్ణానంద స్వామిగాయత్రీ మంత్రంద్వాదశ జ్యోతిర్లింగాలురామాయణంప్రత్యేక:ఇటీవలిమార్పులునరేంద్ర మోదీపవన్ కళ్యాణ్శ్రీ కృష్ణుడుకుక్కుట శాస్త్రంశాంతికుమారియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశంలో కోడి పందాలు