మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
వినాయక్ దామోదర్ సావర్కర్

వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు.

సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... శంకర్-ఎహసాన్-లాయ్ పలు భారతీయ భాషల్లో 50కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారనీ!
  • ... ఒడిషాలో జరిగే ధను జాతర ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ అయిర్ థియేటర్లో జరిగే ప్రదర్శనగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందినదనీ!
  • ... కర్ణాటకలోని బనవాసి నగరం పురాతన కన్నడ రాజవంశమైన కదంబులకు రాజధాని అనీ!
  • ... భారతదేశంలో పశ్చిమం వైపుకు ప్రవహించే అతి కొద్ది నదుల్లో మహీ నది ఒకటనీ!
  • ... 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం స్థాపించిన ఏడు కేంద్ర సాయుధ బలగాల్లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఒకటనీ!
చరిత్రలో ఈ రోజు
మే 27:
ఈ వారపు బొమ్మ
మిద్దె మీద మొక్కల సాగు

మిద్దె మీద మొక్కల సాగు

ఫోటో సౌజన్యం: Maheshcm76


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
భాష
🔥 Top keywords: పార్వతిస్వీడన్మొదటి పేజీనాగలిలోపాముద్రప్రత్యేక:అన్వేషణతీన్మార్ మల్లన్నద్వాదశ జ్యోతిర్లింగాలుత్రినాథ వ్రతకల్పంవసంత ఋతువుసెక్స్ (అయోమయ నివృత్తి)శ్రీ గౌరి ప్రియనటాషా స్టాంకోవిక్నితీశ్ కుమార్ రెడ్డితెలుగుబెల్లి లలితవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడుతెలుగుదేశం పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్కార్తెసన్ రైజర్స్ హైదరాబాద్కావ్య మారన్హార్దిక్ పాండ్యాశ్రీ కృష్ణదేవ రాయలుభారతదేశంలో కోడి పందాలువిక్రమార్క చరిత్రవాతావరణంఋతువులు (భారతీయ కాలం)హేమ2024 భారత సార్వత్రిక ఎన్నికలుకుక్కుట శాస్త్రంమత్తేభ విక్రీడితముభాస్కర శతకమునక్షత్రం (జ్యోతిషం)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువెంకటేశ్ అయ్యర్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపర్యాయపదం