హోమో హైడెల్‌బెర్గెన్సిస్

హోమో హైడెల్‌బెర్గెన్సిస్ హోమో ప్రజాతికి చెందిన, అంతరించిపోయిన ప్రాచీన మానవ జాతి లేదా ఉపజాతి. జర్మనీలోని హైడెల్‌బర్గ్ సమీపంలో మొట్టమొదట కనుగొన్నందున ఈ జాతికి హోమో హైడెల్‌బెర్గెన్సిస్ అని పేరు పెట్టారు. [1] దక్షిణాది ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా, ఐరోపాల్లో లభించిన శిలాజాల ప్రకారం ఇది మధ్య రాతియుగంలో 7,00,000 - 3,00,000 సంవత్సరాల క్రితం విస్తరించింది. ఆఫ్రికన్ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ లో అనేక ఉపజాతు లున్నాయి. ఈ ఉపజాతులు హోమో హైడెల్‌బర్గెన్సిస్ హైడెల్‌బర్గెన్సిస్, హోమో హైడెల్‌బర్గెన్సిస్ డాలియెన్సిస్, హోమో హైడెల్‌బర్గెన్సిస్ రొడీసియెన్సిస్, హోమో హైడెల్‌బర్గెన్సిస్ స్టీన్‌హీమెన్సి.[2] హోమో సేపియన్స్, హోమో రొడీసియెన్సిస్ నుండి ఉద్భవించిందని తరచూ ప్రతిపాదించారు. కానీ 4 - 2.6 లక్షల సంవత్సరాల మధ్య శిలాజాల లేమి కారణంగా ఇది అస్పష్టంగా ఉంది.

హోమో హైడెల్‌బెర్గెన్సిస్
కాల విస్తరణ: 0.7–0.2 Ma Middle Pleistocene
The type specimen Mauer 1
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Mammalia
Order:Primates
Suborder:Haplorhini
Infraorder:Simiiformes
Family:Hominidae
Subfamily:Homininae
Tribe:Hominini
Genus:Homo
Species:
H. హైడెల్‌బెర్గెన్సిస్
Binomial name
Homo హైడెల్‌బెర్గెన్సిస్
ఓట్టో షోటెన్‌సాక్, 1908
Synonyms

హోమో రొడీసియెన్సిస్
(ఆర్థర్ స్మిత్ వుడ్‌వార్డ్, 1921)

1907 లో ఒట్టో షోటెన్‌సాక్ కనుగొన్న క్రింది దవడ, దీని మొట్టమొదటి శిలాజం. [1] [3] ఈ జాతి పుర్రెల లక్షణాలు హోమో ఎరెక్టస్, శరీర నిర్మాణపరంగా ఆధునిక హోమో సేపియన్లు రెండింటి లక్షణాలతో పోలి ఉంటాయి; దాని మెదడు పరిమాణం దాదాపు హోమో సేపియన్ల మెదడుతో సమానంగా ఉంటుంది . ఉత్తర స్పెయిన్‌లో అటాపుర్కాలోని సిమా డి లాస్ హ్యూసోస్ గుహలోని పొరల్లో మంచి నిక్షేపా లున్నాయి. 2018 నాటికి ఇక్కడ తవ్వకాలు ఇంకా సాగుతున్నాయి. [4]

హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ తూర్పు, దక్షిణ ఆఫ్రికాల్లోను (ఇథియోపియా, నమీబియా, దక్షిణాఫ్రికా), ఐరోపా (ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్) అంతటానూ విస్తరించాయి. మునుపటి హోమో యాంటెసెస్సర్ తోటి, నియాండర్తల్, డెనిసోవన్స్, ఆధునిక మానవుల తోటీ హోమో ఎర్గాస్టర్ సంబంధం కచ్చితంగా ఏమిటనేది అస్పష్టంగా ఉంది. [5] [6] [7]

హోమో సేపియన్స్, హోమో హైడెల్‌బెర్గెన్సిస్ నుండి హోమో ర్హొడేసియన్సిస్ ద్వారా సుమారు 4,00,000 సంవత్సరాల క్రితం, తూర్పు, ఉత్తర ఆఫ్రికాల్లో ఉద్భవించిందని ప్రతిపాదించారు. [8] [9] హోమో ఎరెక్టస్, హోమో హైడెల్‌బెర్గెన్సిస్, హోమో రొడీసియెన్సిస్, నియాండర్తల్ ల మధ్య సార్వత్రికంగా ఆమోదించిన విభజన రేఖలు లేకపోవడం వల్ల, అనేక శిలాజాలను ఏదో ఒక నిర్దుష్టమైన క్రోనోస్పీసీస్‌కు ఆపాదించడం కష్టంగా ఉంది. ఈ విషయమై పాలియోఆంత్రోపాలజిస్టులలో తరచూ అభిప్రాయ భేదాలు ఏర్పడుతూంటాయి.

4,00,000, 2,60,000 సంవత్సరాల క్రితాల మధ్య కాలానికి చెందిన శిలాజాలు ఆఫ్రికాలో కనిపించనందున, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ హోమో సేపియన్లకు పూర్వీకుడా కాదా అనే విషయం నిశ్చయంగా తేలలేదు. సిమా డి లాస్ హ్యూసోస్ శిలాజాల జన్యు విశ్లేషణను (మేయర్ తదితరులు. 2016) పరిశీలిస్తే - హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్‌ను నియాండర్తల్ వంశంలో చేర్చి, "పూర్వ-నియాండర్తల్" లేదా "పురాతన నియాండర్తల్" లేదా "తొలి నియాండర్తల్" అని పిలవాలనే సూచన చేసింది. ఈ విధంగా చూస్తే నియాండర్తల్, ఆధునిక వంశాలు వేరుపడిన సమయం, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ ఆవిర్భావానికి ముందు, అంటే సుమారు 6,00,000 నుండి 8,00,000 సంవత్సరాల క్రితాల మధ్యకు, ముందుకు జరుగుతోంది. ఇది సుమారుగా హోమో యాంటెసెస్సర్ అంతరించిన కాలంం. [10] [11]

ప్రారంభ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్, హెచ్. ఎరెక్టస్ మధ్య వివరం కూడా అస్పష్టంగా ఉంది. [4] [12]

ఉత్పన్నం, వర్గీకరణ మార్చు

హోమో హైడెల్‌బెర్గెన్సిస్ : స్టెయిన్హీమ్ స్కల్ రెప్లికా

హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ 8,00,000 - 7,00,000 సంవత్సరాల క్రితం హోమో యాంటెసెస్సర్ నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు. హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ అని వర్గీకరించిన అత్యంత పురాతన శిలాజం సుమారు 6,00,000 సంవత్సరాల క్రితం నాటిది. అయితే 2005 లో సఫోక్ లోని లోలోఫ్ట్ సమీపంలోని పేక్‌ఫీల్డ్‌లో ఫ్లింట్ పనిముట్లు దొరికాయి. ఈ పనిముట్ల వద్ద వాటర్ వోల్ అనే జీవికి చెందిన పంటి శిలాజం కూడా దొరికింది. ఈ జీవి కాలం స్పష్టంగా తెలుసు కాబట్టి, ఇంగ్లాండ్‌లో మానవ ఉనికి 7,00,000 సంవత్సరాల క్రితం ఉందని తెలుస్తోంది. ఈ మానవ శిలాజం హెచ్. యాంటెసెస్సర్, హెచ్ . హైడెల్‌బెర్గెన్సిస్ మధ్య పరివర్తన రూపమై ఉండవచ్చని భావించారు. [13] [14] [15] [16] ఇంగ్లాండ్‌లోని హ్యాపీస్‌బర్గ్‌లో దాదాపు పదిలక్షల సంవత్సరాల వయస్సు గల యాభై చరిత్ర పూర్వ హోమినిడ్ పాదముద్రలు కనుగొన్నారు. వారు 12 లక్షల సంవత్సరాల క్రితం, 8 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య జీవించిన హోమో యాంటెసెస్సర్ సభ్యులై ఉండవచ్చు. [17]

ఐరోపాలో, 2,40,000 సంవత్సరాల క్రితం, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ నుండి హెచ్. నియాండర్తలెన్సిస్ ఉద్భవించిందని భావిస్తున్నారు (శిలాజాల లేమి కారణంగా, ఇది ఊహించిన సాంప్రదాయికమైన తేదీ; 2,40,000 సంవత్సరాలకు ముందున్న హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ ను పూర్వ-నియాండర్తల్ అనీ, మునుపటి నియాండర్తల్ అనీ కూడా అంటారు). [18] హోమో సేపియన్స్, దాదాపు 3,00,000 సంవత్సరాల క్రితం తరువాత హెచ్. రొడీసియెన్సిస్ (ఆఫ్రికా హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్) నుండి ఉద్భవించింది.

వోల్స్టోనియన్ స్టేజ్, ఇప్స్‌విచియన్ స్టేజ్ ల సమయంలో (దీర్ఘకాలిక క్వాటర్నరీ హిమనదీయ కాలాలలో చివరిది) హెచ్ . హైడెల్‌బెర్గెన్సిస్ యొక్క ఐరోపా, ఆఫ్రికా శాఖలు శరీరనిర్మాణ పరంగా వేరుపడ్డాయని వాదించారు. స్పెయిన్ లోని ఆటపురికా పుర్రె, జాంబియాలో దొరికిన కాబ్వే పుర్రె ఆధారంగా ఈ వాదన చేసారు. [19]

హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ ఉద్భవించడం, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ నుండి అధునిక మానవులు, నియాండర్తళ్ళు ఉద్భవించడం - ఈ రెండూ కూడా విస్పష్టంగా లేవు. రెండూ చర్చనీయాంశాలు గానే ఉన్నాయి. హెచ్. ఎరెక్టస్, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ రెండింటినీ పాలిటైపిక్ జాతులనే వర్ణించారు. వీటి ప్రస్థానం అనేక జనాభా అవరోధాలు (బాటిల్‌నెక్), తత్సంబంధిత సంఘటనల ద్వారా సాగింది. యురేషియాలో మధ్య ప్లైస్టోసీన్ కాలపు మానవులు గ్లేసియేషన్ల కారణంగా ఒకదాని వెంట ఒకటిగా జనాభా అవరోధాలను ఎదుర్కొన్నారని హుబ్లిన్ (2013) సారాంశంలో పేర్కొన్నారు. హెచ్. రొడీసియెన్సిస్ లేదా హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ సెన్సు లాటో (అంటే నియాండర్తల్) నుండి ఉద్భవించిన "పాశ్చాత్య యూరేషియన్ క్లేడ్", MIS 12 వద్ద (4,80,000 సంవత్సరాల క్రితం) వేరుపడి, మళ్ళీ MIS 5 వద్ద (1,30,000 సంవత్సరాల క్రితం) ఏకమైంది. యురేషియా హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్, హెచ్. నియాండర్తాలెన్సిస్ లు MIS 11 వద్ద (4,24,000 సంవత్సరాల క్రితం) కంటే ముందు వేరుపడి ఉంటాయని ఇది సూచిస్తోంది. 4,00,000 - 2,60,000 సంవత్సరాల మధ్య ఆఫ్రికాలో శిలాజాల లేమి కారణంగా హెచ్. రొడీసియెన్సిస్ నుండి హెచ్ . సేపియన్స్ ఉద్భవించిందనే భావన అస్పష్టంగా ఉంది.

హోమో హైడెల్‌బెర్గెన్సిస్‌ ఓ స్వతంత్ర క్రోనోస్పీసీస్ అని క్రిస్ స్ట్రింగర్ (2012) వాదించాడు. [20] సిమా డి లాస్ హ్యూసోస్ శిలాజాలపై 2013 లో చేసిన జన్యు అధ్యయనం, వాటిని హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ లేదా "ప్రారంభ నియాండర్తల్" గా వర్గీకరించింది.

అర్ధ శతాబ్దానికి పైగా, చాలా మంది నిపుణులు హోమో హైడెల్‌బెర్గెన్సిస్‌ను ప్రత్యేక టాక్సన్‌గా అంగీకరించడానికి ఇష్టపడలేదు. స్పెసిమెన్లు పెద్దగా లభించకపోవడం వలన, ఇతర మానవ జాతులతో శరీరనిర్మాణంలోని పోలికలను పరిశీలించడానికి వీలు కాకపోవడం దీనికి కారణం. 1990 ల నుండి మధ్య ప్లైస్టోసీన్ కాలపు శిలాజాలు అనేకం లభించడంతో "హైడెల్‌బెర్గెన్సిస్" అనే జాతి పేరు పునరుజ్జీవనం పొందింది. [21] [22]

1908 నుండిటైప్ స్పెసిమెన్‌ను హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలోని పాలియోంటాలజీ ఇన్స్టిట్యూట్‌లో భద్రపరచారు. ఈ సంస్థ దీన్ని 2010 చివరి వరకూ కూడా హోమో ఎరెక్టస్ హైడెల్‌బెర్గెన్సిస్ అనే, అంటే హోమో ఎరెక్టస్ లోని ఉపజాతిగా, వర్గీకరించింది. 2015 లో దీన్ని ప్రత్యేక జాతిగా అంగీకరిస్తూ హోమో హైడెల్‌బెర్గెన్సిస్ గా మార్చారు. [23]

"రోడేషియా మ్యాన్" (కాబ్వే 1) కు హోమో సేపియన్స్ అర్కాయికస్, [24] హోమో సేపియన్స్ రొడీసియెన్సిస్ [25] అనే పేర్లు కూడా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎక్కువగా దీన్ని హోమో హైడెల్‌బెర్గెన్సిస్ అనే వర్గీకరిస్తున్నారు. వైట్ తదితరులు (2003) రోమేసియన్ మ్యాన్‌ను హోమో సేపియన్స్ ఇడాల్టు (హెర్టో మ్యాన్) కు పూర్వీకుడని సూచించారు. [26] [27]

రూప నిర్మాణం మార్చు

దస్త్రం:MEH Homo heidelbergensis Daynes.jpg
హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ వయోజన మగ, సిమా డి లాస్ హ్యూసోస్ నుండి వచ్చిన శకలాలు ఆధారంగా ఎలిసబెత్ డేనెస్ (2010) చే పునర్నిర్మాణం

హోమో హైడెల్‌బెర్గెన్సిస్ హోమో ఎరెక్టస్ కు, హోమో నియాండర్తాలెన్సిస్ లకు మధ్యన ఉన్న జాతి. దీని సాధారణ కపాల పరిమాణం సుమారు 1,250 సెం.మీ.3.[28] "హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ శరీర నిర్మాణం స్పష్టంగా నియాండర్తల్ కంటే ప్రాచీనమైనది. కానీ చక్కగా గుండ్రంగా ఉండే పలువరుస, పూర్తిగా ఉన్న పళ్ళు ... మానవుడికి ఉన్నట్లే ఉన్నాయి." [29]

సాధారణంగా దిగువ ప్లైస్టోసీన్ నుండి మధ్య ప్లైస్టోసీన్‌ వరకూ ఉన్న పరిణామ ధోరణులే వీటి పరిశీనల్లో గమనించారు. కపాలము, దంతాల గట్టిదనంలో వచ్చిన మార్పులతో పాటు, హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ కు మెదడు పరిమాణంలో చెప్పుకోదగిన పెరుగుదల ఉంది. [30]

మగ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ సగటు ఎత్తు 1.75 మీ., బరువు 62 కిలోలు ఉండగా, ఆడవారి సగటు 1.57 మీ., 51 కిలోలు. అటాపుర్కా (బుర్గోస్, స్పెయిన్) లో దొరికిన 27 పూర్తి మానవ ఎముకలను పునర్నిర్మించినపుడు హెచ్. నీన్దేర్తాలెన్సిస్తో పోల్చి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ ఎత్తును నిర్ణయించడానికి వీలైంది; ఈ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ సగటున 170 సెం.మీ. ఎత్తుతో నియాండర్తళ్ళ కంటే కొంచెం పొడవుగా ఉండేవని తెలిసింది. [31]

విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన లీ ఆర్. బెర్జర్ ప్రకారం, 3,50,000, 4,00,000 సంవత్సరాల క్రితం నాటి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ జనాభా మామూలు ఎత్తు 2.1 మీ. కు పైగా ఉందని జంఘిక తొడ ఎముకల అవశేషాలు సూచిస్తున్నాయి. [32] [33] [34] అతని ప్రకారం, గడ్డి భూముల విస్తరణ సమయంలో స్వల్పకాలం పాటు ఇలా ఉండేది. ఈ గడ్డిభూములు చాలా పెద్ద అన్‌గులేట్స్, జింకలూ ఉద్భవించడానికి దారితీసాయి.

ఒట్టో స్కోటెన్సాక్ 1907 లో తన ఒరిజినల్ జాతుల వర్ణనలో మౌర్ 1 దవడను వివరించాడు: [35]

"దవడ, దంతాల మధ్య ఒక నిర్దుష్టమైన అనుపాతలేమి" స్పష్టంగా ఉన్నందున "మన వస్తువు యొక్క స్వభావం" "మొదటి చూపులోనే" తెలిసి పోతోంది: "పళ్ళు ఆ ఎముక పరిమాణంతో పోలిస్తే చాలా చిన్నవి. పళ్ళు ఉండే స్థలం, పళ్ళు ఎంతో అభివృద్ధి చెందేందుకు వీలుగా ఉంది". "ఇంతకు మునుపు తెలిసిన ఇటీవలి లేదా శిలాజ మానవ దవడ దేనిలోనూ ఇది కనబడలేదు. అయిష్టంగానే దీన్ని మానవునిగా అంగీకరించిన పండితుడిని తప్పుపట్టకూడదు: మానవుడిగా పరిగణించడానికి ఆవశ్యకమైన ముఖ్య లక్షణం - బయటికి విస్తరించి ఉండే గడ్దం - అసలే లేదు. అయినప్పటికీ ఈ లోపాన్ని దవడ భాగపు అసాధారణ కొలతలతో కలిపి చూసారు. వాస్తవానికి, మనం చూస్తున్నది మానవ భాగాలే అని చెప్పే రుజువు దంతాల అమరిక మాత్రమే. పూర్తిగా సురక్షితంగా ఉన్న దంతాలపై మానవుడు అనే ముద్ర స్పష్టంగా ఉంది: కోర పళ్ళకు ఇతర పళ్ళ కంటే దృఢంగా ఉన్న జాడలేమీ కనిపించలేదు. ఇటీవలి మానవులలో జరిగినట్లే మితమైన పొందికైన సహ-పరిణామం జరిగినట్లు సూచిస్తున్నాయి. "

ప్రవర్తన మార్చు

బాక్స్‌గ్రోవ్‌లో దొరికిన వందలాది హ్యాండ్‌యాక్స్‌లలో ఒకటి

అటాపుర్కా (స్పెయిన్) లోని ఒక గోతిలో 28 మానవ అస్థిపంజరాల కనుగొనడాన్ని బట్టి, హోమో ప్రజాతికి చెందిన జీవుల్లో చనిపోయినవారిని సమాధి చేసిన మొట్తమొదటి జాతి, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ అని అనుకోవచ్చు. [36] [37]

చెవి బయటి భాగం, మధ్య భాగాల నిర్మాణాన్ని బట్టి, ఆధునిక మానవులతో సమానమైన శ్రవణ సున్నితత్వం వాళ్ళకు ఉందని తెలుస్తోంది. బహుశా వాళ్ళు అనేక విభిన్న శబ్దాల మధ్య తేడాను గుర్తించగలిగారు.[38] దంతాల అరుగుదలను విశ్లేషిస్తే, వారు ఆధునిక వ్యక్తుల లాగా కుడిచేతి వాటం కలిగి ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది. [39] స్టీవెన్ మిథెన్ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్, దాని వారసుడు హెచ్. నియాండర్తాలెన్సిస్ మాదిరిగానే, భాష లేని రోజుల నాటి సంభాషణా వ్యవస్థ వారికి ఉండేదని అనుకోవచ్చు. కళారూపాలేమీ కనబడలేదు గానీ, పెయింట్ లాగా ఉపయోగపడే ఎర్రమట్టి ఫ్రాన్సుకు దక్షిణాన టెర్రా అమాటాలో కనబడింది.

జర్మనీలోని షునిన్గెన్‌ పురావస్తు స్థలంలో, వేటాడేందుకు ఎనిమిది ఈటెలతో పాటు, ఇతర చెక్క పనిముట్లు, సుమారు 4,00,000 సంవత్సరాల నాటివి, కనిపించాయి. వేట కోసం ఉపయోగించిన ఐదులక్షల సంవత్సరాల నాటి రాతి ములుకులు దక్షిణాఫ్రికాలోని కథూ పాన్ 1 లో దొరికాయి. వాటి అరుగుదలను, అలాంటి ములుకులనే ఇప్పుడు వాడగా ఏర్పడిన అరుగుదలతో పోల్చి నిర్ధారించుకున్నారు. ఆధునిక మానవులు, నియాండర్తల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వతంత్రంగా అభివృద్ధి చేయకుండా, రాతి ములుకులు కలిగిన ఈటెను వారసత్వంగా పొందారని ఈ పరిశోధన ద్వారా అర్థమౌతోంది. [40]

షునింగెన్ ఈటెలు చెక్కతో చేసిన ఎనిమిది విసిరే ఈటెలు. ఇవి 3,00,000 సంవత్సరాల క్రితం నాటివి. వీటిని 1994, 1998 మధ్యకాలంలో, జర్మనీలోని హెల్మ్‌స్టెడ్‌ కౌంటీలో షునింగెన్‌ లోని ఓపెన్-కాస్ట్ లిగ్నైట్ గనిలో కనుగొన్నారు. వీటితో పాటు, వేలాది జంతువుల ఎముకలు కూడా కనిపించాయి. హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్‌ను (నియాండర్తల్-పూర్వం) చురుగ్గా వేటాడిన వాళ్ళకు తొలి ప్రత్యక్ష సాక్ష్యంగా భావిస్తారు. [41] [42]

శిలాజాలు మార్చు

మౌర్ లో దొరికిన ఒరిజినల్ టైప్ స్పెసిమెన్

ఐరోపా మార్చు

ఈ జాతి యొక్క మొట్టమొదటి శిలాజం, మౌర్ 1, ను 1907 అక్టోబర్ 21 న జర్మనీలోని హైడెల్బర్గ్ సమీపంలోని మౌర్ వద్ద కనుగొన్నారు. అయితే, 1908 వరకు దీనిపట్ల ప్రజల్లో ఆసక్తి కలగలేదు. ఈ శిలాజం, ప్రీమోలార్ దంతాలు లేకపోవడం తప్పించి మంచి స్థితిలో ఉన్న దవడ. చివరికి ఈ పళ్ళు కూడా దగ్గరలోనే కనబడ్డాయి. హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒట్టో స్కోటెన్సాక్, ఈ శిలాజాన్ని గుర్తించి, పేరు పెట్టాడు. [43]

తదుపరి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ అవశేషాలు జర్మనీ లోని స్టీన్‌హీం అన్ డర్ లో (స్టీన్‌హీం పుర్రె, 3,50,000 సంవత్సరాల క్రితం నాటిది), ఫ్రాన్స్ లోని అరాగో లో(అరాగో 21), గ్రీస్ లోని పెట్రాలోనాలో, ఇటలీ లోని సియాంపటే డెల్ డియావోలో లోనూ లభించాయి.

బాక్స్‌గ్రోవ్ మ్యాన్ అనేది 1994 లో ఇంగ్లీష్ ఛానెల్‌కు దగ్గరగా ఉన్న బాక్స్‌గ్రోవ్ క్వారీలో కనుగొన్న జంఘిక దిగువ భాగం. ఈ శిలాజం వద్ద వందలాది చేతి గొడ్డళ్ళు కూడా కనిపించాయి. ఇది 4,78,000 - 5,24,000 సంవత్సరాల క్రితం నాటిది. [44] తరువాతి సీజన్లలో ఇదే స్థలంలో అనేక హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ పళ్ళు కనబడ్డాయి.

1992 నుండి, ఒక స్పానిష్ బృందం ఉత్తర స్పెయిన్‌లోని సియెర్రా డి అటాపుర్కాలోని సిమా డి లాస్ హ్యూసోస్ స్థలంలో కనీసం 3,50,000 సంవత్సరాల వయస్సు గల 5,500 పైచిలుకు మానవ ఎముకలను కనుక్కుంది. ఈ గోతిలో బహుశా 32 వ్యక్తుల శిలాజాలు ఉన్నాయి. వీటితో పాటు ఉర్సస్ డెనింగెరి అనే జంతువు, ఇతర మాంసాహార జీవులవి, ఒక రెండు అంచుల గొడ్డలీ కూడా కనిపించాయి. [45] ఎరుపు క్వార్ట్జైట్‌తో తయారు చేసిన ఈ అషూలియన్ గొడ్డలి అంత్యక్రియల్లో చేసే ఒక రకమైన కర్మ అని కల్పన చేసారు. అదే అయితే, అంత్యక్రియల అభ్యాసాల గురించి తెలిసిన అత్యంత పురాతన ఆధారం అవుతుంది. హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ యొక్క అవశేషాలన్నిటిలోను తొంభై శాతం ఈ ఒక్క సైట్ లోనే దొరికాయి. ఈ గుంట లోని శిలాజాల్లో కిందివి ఉన్నాయి:

  • ఒక పూర్తి కపాలం (పుర్రె-5), మిగ్యులిన్ అని పేరు పెట్టారు. పుర్రె-4 (అగామెమ్నాన్ అని పేరు పెట్టారు) వంటి ఇతర పుర్రెల శకలాలు, రూయి (ఎల్ సిడ్ అనే పేరు గల స్థానిక హీరో) అని పేరు పెట్టిన పుర్రె-6 .
  • పూర్తి కటి (కటి-1), ఎల్విస్ ప్రెస్లీ జ్ఞాపకార్థం ఎల్విస్ అనే మారుపేరు.
  • హనువులు, దంతాలు, అనేక పోస్ట్‌క్రానియల్ ఎముకలు (తొడలు, చేతుల, పాదాల ఎముకలు, వెన్నుపూస, పక్కటెముకలు మొదలైనవి.)

సమీప సైట్‌లలో హోమో యాంటెసెస్సర్ శిలాజాలు ఉన్నాయి. హోమో యాంటెసెస్సర్ కు సంబంధించిన శిలాజాలు ఇవి మాత్రమే. కానీ ఇవి వివాదాస్పదమైనవి.

సిమా డి లాస్ హ్యూసోస్ వద్ద ఉన్న అవశేషాలు హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ కు చెందినవా, లేక ప్రారంభ హెచ్. నియాండర్తాలెన్సిస్ కు చెందినవా అనే విషయమై ్రస్తుతంప ండితుల మధ్య చర్చ జరుగుతోంది. [46] 2015 లో, సిమా డి లాస్ హ్యూసోస్ గుహల లోని శిలాజాల మైటోకాండ్రియల్ డిఎన్ఎ నమూనాలను అధ్యయనం చేస్తే అవి "నియాండర్తల్ లతో కాకుండా డెనిసోవాన్స్ యొక్క మైటోకాన్డ్రియల్ డిఎన్ఎతో దూర సంబంధం కలిగి ఉన్నాయి" అని వెల్లడైంది. [47]

సిమా హోమినిన్లు డెనిసోవా హోమినిన్లు గానీ, నియాండర్తళ్ళు గానీ కాదని 2016 లో న్యూక్లియర్ డిఎన్‌ఎ విశ్లేషణలో తేలింది. నియాండర్తళ్ళు, డెనిసోవాన్లకు శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులకూ మధ్య వేర్పాటు 4,30,000 సంవత్సరాల క్రితమే జరిగినట్లుగా కూడా తేలింది. [48] [49]

హోమో సేపియన్స్, నియాండర్తల్‌లు హోమో హైడెల్‌బెర్గెన్సిస్ శాఖ నుండి వేరుపడ్డాయని ఇటీవలి అధ్యయనాల్లో ఊహించారు. "ఆసియాలో హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ శిలాజాలు లభించే సంభావ్యత ఉంది, అవి డెనిసోవాన్ల పూర్వీకులకు చెంది ఉండే అవకాశం ఉంది" అని వారు ప్రతిపాదించారు. [1]

ఆఫ్రికా మార్చు

కబ్వే పుర్రె యొక్క ప్రతిరూపం
దస్త్రం:Homo heidelbergensis adult male - head model - Smithsonian Museum of Natural History - 2012-05-17.jpg
జాన్ గుర్చే (2010), (స్మిత్సోనియన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ) కబ్వే పుర్రె ఆధారంగా నిర్మించిన ముఖం
దస్త్రం:Burgos - Museo de la Evolución Humana (MEH) - Homo Rhodesiensis.JPG
ఎలిసబెత్ డేనెస్ (2010), (మ్యూజియం ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్, బుర్గోస్) కబ్వే పుర్రె ఆధారంగా నిర్మించిన హోమో రొడీసియెన్సిస్ నమూనా

20 వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికా (బోడో, న్డుటు, ఇయాసి, ఇలేరెట్), ఉత్తర ఆఫ్రికా (సాలే, రాబాట్, దార్-ఎస్-సోల్టేన్, డిజెల్ ఇర్హౌడ్, సిడి అబెర్రాహమన్, టిఘెనిఫ్) లలో శరీరనిర్మాణంలో పోలికలున్న అనేక శిలాజ అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. 1953 లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నబ సల్దాన్హా కపాలం 1955, 1996 ల మధ్య కనీసం మూడు సార్లు వర్గీకరణ సమీక్షలకు లోనైంది. [50]

కబ్వే 1 ను "బ్రోకెన్ హిల్ స్కల్" అని కూడా పిలుస్తారు. దీనిని ఆర్థర్ స్మిత్ వుడ్వార్డ్ 1921 లో హోమో రొడీసియెన్సిస్ యొక్క టైప్ స్పెసిమెన్‌గా నిర్ణయించాడు; ప్రస్తుతం దీన్ని ఎక్కువగా హోమో హైడెల్‌బెర్గెన్సిస్‌కు చెందినదిగా భావిస్తున్నారు. [51] దీన్ని 1921 లో ఉత్తర రోడేషియాలోని బ్రోకెన్ హిల్ (ఇప్పుడు కబ్వే, జాంబియా) లోని ఒక సీసం, జింక్ గనిలో స్విస్ గని పనివాడు టామ్ జ్విగ్లార్ కనుగొన్నాడు. కపాలంతో పాటు, మరొక వ్యక్తికి చెందిన పై దవడ, ఒక త్రికము (సాక్రం), ఒక అంతర్జంఘిక, రెండు తొడ ఎముకలు కూడా దొరికాయి. కనుగొన్న సమయంలో పుర్రెను "రోడేసియన్ మ్యాన్" అని పిలిచారు. కాని ఇప్పుడు దీనిని బ్రోకెన్ హిల్ స్కల్ లేదా కబ్వే కపాలం అని పిలుస్తున్నారు. బ్రోకెన్ హిల్ పుర్రె యొక్క కపాల సామర్థ్యం 1,230 సెం.మీ.3 గా అంచనా వేసారు. [52] బాడా తది., (1974) అస్పార్టిక్ యాసిడ్ రేస్‌మైజేషన్ పద్ధతిలో లెక్కించి ఇది 1,10,000 సంవత్సరాల క్రితం నాటిదిగా తేల్చారు. [53] [54] ఈ పాలియోఆంత్రోపోలాజికల్ స్థలం నాశనమై పోవడంతో భూపొరలను డేటింగు చెయ్యడానికి వీలు లేకుండా పోయింది. హోమినిన్ లన్నిటికంటే కూడా ఎత్తైన కనుబొమలు కలిగిన ఈ పుర్రె చాలా బలమైన వ్యక్తికి చెందినదని సూచిస్తోంది. దీని ముఖం హోమో నియాండర్తాలెన్సిస్ లాగా వెడల్పాటిదని (పెద్ద నాసికా ఎముకలు, మందపాటి పొడుచుకు వచ్చిన కనుబొమలటొ) వర్ణించారు. దాంతో, పరిశోధకులు "ఆఫ్రికన్ నియాండర్తల్" లాంటి వివరణలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, పుర్రె చాలా దృఢంగా ఉండడానికి సంబంధించి, ఆధునిక హోమో సేపియన్స్కు నియాండర్తళ్ళకూ మధ్య అనేక మధ్యంతర లక్షణాలను ఇటీవలి పరిశోధనలు హైలైట్ చేసాయి. పుర్రెలో పై పళ్లలో, పదింటిలో తొర్రలు కనిపించాయి. పంటి తొర్రలకు సంబంధించిన పురాతన సంఘటనల్లో ఇదొకటి. ఈ తొర్రలు మరణానికి ముందు ఏర్పడిన గణనీయమైన ఇంఫెక్షన్ను సూచిస్తున్నాయి. దంత వ్యాధి లేదా దీర్ఘకాలిక చెవి ఇంఫెక్షను వల్ల మరణం సంభవించి ఉండవచ్చు. ఈ పుర్రెను లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచారు. జాంబియాలోని లివింగ్‌స్టోన్‌ మ్యూజియంలో దీని ప్రతిరూపం ఉంది.

6,00,000 సంవత్సరాల క్రితం నాటి [55] బోడో కపాలాన్ని 1976 లో ఇథియోపియాలోని ఆవాష్ నది లోయలోని బోడో డి'ఆర్ వద్ద జోన్ కల్బ్ నేతృత్వంలోని బృంద సభ్యులు కనుగొన్నారు. [56] ముందు ముఖం కింది భాగాన్నిఅలెమాహ్యూ అస్ఫా, చార్లెస్ స్మార్ట్ లు కనుగొన్నారు. రెండు వారాల తరువాత, పాల్ వైట్ హెడ్, క్రెయిగ్ వుడ్ లు ముఖం పై భాగాన్ని కనుగొన్నారు. ఈ పుర్రె 6,00,000 సంవత్సరాల క్రితం నాటిది. [57] ఇది కబ్వే పుర్రె లాగానే ఉన్నప్పటికీ, వుడ్వార్డ్ చెప్పిన హోమో రొడీసియెన్సిస్ అని కాక, దాని ఆవిష్కర్తలు దీనిని హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్‌కు ఆపాదించారు. [58] దీనికి హోమో ఎర్గాస్టర్ / ఎరెక్టస్, హోమో సేపియన్ల మధ్య పరివర్తనను సూచించే లక్షణా లున్నాయి. [59]

మరొక స్పెసిమెన్, [60] ఉత్తర టాంజానియాలోని "న్డుటు సరస్సుకు చెందిన హోమినిడ్". ఇది సుమారు 4,00,000 సంవత్సరాల క్రితం నాటిది. 1976 లో, ఆర్.జె. క్లార్క్ దీనిని హోమో ఎరెక్టస్ అని వర్గీకరించాడు. అప్పటి నుండీ దీనిని అలాగే భావిస్తున్నారు -హెచ్. సేపియన్లకు దీనికీ కొన్ని సారూప్యతలున్నట్లు గుర్తించినప్పటికీ. ఆఫ్రికాలో కనుగొన్న ఇలాంటి శిలాజాలతో పోల్చి చూసిన తరువాత దీన్ని హెచ్. సేపియన్స్ యొక్క ఆఫ్రికన్ ఉపజాతిగా చెప్పడం చాలా సముచితంగా అనిపిస్తుంది. కపాల సామర్థ్యపు పరోక్ష అంచనా 1,100 సెం.మీ3 గా సూచిస్తోంది. దీని సుప్రటోరల్ సల్కస్ అంగనిర్మాణాన్ని బట్టి, "న్డుటు ఆక్సిపిట్ వలన దీని ఆకారం హోమో ఎరెక్టస్ మాదిరిగా కూడా లేదని" ఫిలిప్ రైట్మైర్ అన్నాడు. కానీ దీని మందపాటి ఇలియాక్ పిల్లార్ హోమో ఎరెక్టస్‌కు మాత్రమే ప్రత్యేకమైనదని స్టింగర్ (1986) ఎత్తి చూపాడు. [52] 1989 ప్రచురణలో క్లార్క్ ఇలా ముగించాడు: "మెదడు లోని ప్యారియెటల్, ఆక్సిపిటల్ ప్రాంతాలు పెద్దవిగా ఉండడాన్ని బట్టి దీన్ని ప్రాచీన హోమో సేపియన్లకు చెందినదిగా ఆపాదించాలి". [61]

సల్దాన్హా కపాలం, లేదా ఎలాండ్స్‌ఫోంటీన్ కపాలం శిలాజ అవశేషాలను హోమో హైడెల్‌బెర్గెన్సిస్గా గుర్తించారు. ఇది 1954 లో దక్షిణాఫ్రికాలోని హోప్‌ఫీల్డ్‌లో ఉన్న ఎలాండ్స్‌ఫాంటెయిన్‌లో దొరికింది. [62]

కొత్త ఆధారాలు మార్చు

భాష

గాలి సంచులు లేని తొలి మానవ పూర్వీకుడు హోమో హైడెల్‌బెర్గెన్సిస్ అని భావిస్తారు. గాలి సంచులు కోల్పోవడంతో మానవుడికి మాట్లాడే సామర్థ్యం వచ్చిందని భావిస్తారు. ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ వంటి పూర్వీకులకు, ఇతర గొప్ప కోతుల మాదిరిగానే గాలి సంచులు ఉన్నాయి. [63] ఇంకా, హోమో హైడెల్‌బెర్గెన్సిస్ కుడిచేతి వాటం ఉన్నట్లు ఆధారా లున్నాయి. హోమినిన్లలో చేతివాటానికి, భాష అభివృద్ధికీ సంబంధం ఉంది. [64] ఈ సాక్ష్యంపై ఆధారపడి, శాస్త్రవేత్తలు ఈ జాతి మాట్లాడే సామర్థ్యం గురించి ఊహించారు. మానవులు, చింపాంజీలు మాట్లాడే శబ్దపు పౌనఃపున్యాన్ని పోల్చి చేసిన తాజా అధ్యయనం ప్రకారం, హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ మాట్లాడే సామర్ధ్యాలు ఆధునిక మానవులకు చాలా దగ్గరగా ఉంటాయని తేలింది.

హోమో హైడెల్‌బెర్గెన్సిస్ తో మొదలైనవి

ఓడోంటొజెనిక్ కక్ష్య సెల్యులైటిస్తో హోమో హైడెల్‌బెర్గెన్సిస్ యొక్క పుర్రె [65]

మానవ జాతికి చెందిన లక్షణాల్లో అనేకం, మొదటగా హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్లో కనిపిస్తాయి. స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకారం, శాశ్వత ఆవాయాలను నిర్మించిన హోమో ప్రజాతికి చెందిన మొదటి జాతి ఇది. [66] ఇంకా, శీతల ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే శరీర ఆకృతి కలిగిన మొట్టమొదటి హోమో, హెచ్. హీడ్లెబెర్గెన్సిస్. దాని వారసులు మరింత చల్లటి శీతోష్ణస్థితులను తట్టుకునే లక్షణం పొందడానికి ఇది మార్గం సుగమం చేసింది: హెచ్. హీడ్లెబెర్గెన్సిస్ దేహం వెడల్పు దాని ఎత్తుతో పోలిస్తే ఎక్కువగా ఉండడంతో, శరీరం లోని వేడిని ఎక్కువ దాచుకుని కఠినమైన కఠినమైన శీతోష్ణస్థితులను భరించగలిగేది. [67] నోట్లో ఏర్పడే పుండు కారణంగా కంటికి వచ్చే ఇన్ఫెక్షను దీనికి వచ్చినట్లు గమనించారు. ఈ రకం జబ్బు మొట్టమొదటిగా గమనించింది హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ లోనే. [68] [69]

శిలాజాలు మార్చు

  • 1925/6 లో ఇజ్రాయెల్‌లో ఉన్న మొఘారెట్ ఎల్-జుట్టియే వద్ద లభించిన "గెలీలీ పుర్రె" ను "పశ్చిమ ఆసియాకు చెందిన హైడెల్బర్గ్" గా అభివర్ణించారు. [70]
  • పెట్రలోనా 1 ని 1960 లో గ్రీస్‌లోని పెట్రలోనా గుహలో కనుగొన్నారు. ఇది సుమారు 3,50,000 - 1,50,000 సంవత్సరాల నాటిది. దీనిని హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ లేదా హెచ్. నియాండర్తాలెన్సిస్ అని వర్గీకరించారు . [71]
  • టౌటావెల్ మాన్ (అరాగో 21) ఒక మానవ పుర్రె. దీన్ని1971 జూలై 22 న పైరినీస్-ఓరియెంటాలెస్ లోని టౌటావెల్ గ్రామానికి దగ్గరలో కనుగొన్నారు. ఇది 4,50,000 సంవత్సరాల కాలం నాటిది. ఈ శిలాజాన్ని హోమో ఎరెక్టస్ టాటావెలెన్సిస్ అని వర్గీకరించారు. ఇది హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్‌కు చెందినది కాదు. హెచ్. ఎరెక్టస్ యొక్క మరో వంశానికి చెందినది. హెచ్ . హైడెల్‌బెర్గెన్సిస్ కాలం లోనే ఇది ఐరోపాలో నివసించింది. [72]

ఇవి కూడా చూడండి మార్చు

గమనికలు మార్చు

మూలాలు మార్చు

మరింత చదవడానికి మార్చు

  • అవేరి, డి. మార్గరెట్. 2018. "జాంబియాలోని కబ్వే సమీపంలో బ్రోకెన్ హిల్ మ్యాన్ (హోమో రొడీసియెన్సిస్) యొక్క టైప్ సైట్ నుండి మైక్రోమమల్స్: ఎ హిస్టారికల్ నోట్." హిస్టారికల్ బయాలజీ 30 (1-2): 276–83. https://doi.org/10.1080/08912963.2017.1297434 . [1]
  • వెన్నునొప్పి: ఇది మిలియన్ల సంవత్సరాలుగా నొప్పిగా ఉంది - కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
  • ఫ్రైస్, మార్టిన్. 2010. "మిడిల్ ప్లీస్టోసీన్ హోమినిన్స్ మధ్య కాల్వరియల్ షేప్ వేరియేషన్: పాలియోఆంత్రోపాలజీలో ఉపరితల స్కానింగ్ యొక్క అనువర్తనం." పాలియోంటాలజీ, పాలియోఆంత్రోపాలజీలో రెండస్ పాలెవోల్, ఇమేజింగ్ & 3 డి, 9 (6): 435–43. https://doi.org/10.1016/j.crpv.2010.07.016 . [2]
  • గోడిన్హో, రికార్డో మిగ్యుల్, లారా సి. ఫిట్టన్, వివియానా టోరో-ఇబాకాచే, క్రిస్ బి. స్ట్రింగర్, రోడ్రిగో ఎస్. లాక్రూజ్, తిమోతి జి. బ్రోమేజ్, పాల్ ఓ హిగ్గిన్స్. 2018. "ది బిటింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హోమో సేపియన్స్ అండ్ హోమో హైడెల్‌బెర్గెన్సిస్." జర్నల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ 118 (మే): 56–71. https://doi.org/10.1016/j.jhevol.2018.02.010 . [3]
  • హబ్లిన్, జీన్-జాక్వెస్, అబ్దులౌహెడ్ బెన్-న్సెర్, షరా ఇ. బెయిలీ, సారా ఇ. ఫ్రీడ్‌లైన్, సైమన్ న్యూబౌర్, మాథ్యూ ఎం. స్కిన్నర్, ఇంగా బెర్గ్మాన్, తదితరులు. 2017. "జెబెల్ ఇర్హౌడ్, మొరాకో, పామో-ఆఫ్రికన్ ఆరిజిన్ ఆఫ్ హోమో సేపియన్స్ నుండి కొత్త శిలాజాలు." ప్రకృతి 546 (7657): 289-92. https://doi.org/10.1038/nature22336 . [4]
  • Murrill, Rupert I. (1975). "A comparison of the Rhodesian and Petralona upper jaws in relation to other Pleistocene hominids". Zeitschrift für Morphologie und Anthropologie. 66: 176–187. Murrill, Rupert I. (1975). "A comparison of the Rhodesian and Petralona upper jaws in relation to other Pleistocene hominids". Zeitschrift für Morphologie und Anthropologie. 66: 176–187. Murrill, Rupert I. (1975). "A comparison of the Rhodesian and Petralona upper jaws in relation to other Pleistocene hominids". Zeitschrift für Morphologie und Anthropologie. 66: 176–187. .
  • Murrill, Rupert Ivan (1981). Ed. Charles C. Thomas (ed.). Petralona Man. A Descriptive and Comparative Study, with New Information on Rhodesian Man. Springfield, Illinois: Thomas. ISBN 978-0-398-04550-0. Murrill, Rupert Ivan (1981). Ed. Charles C. Thomas (ed.). Petralona Man. A Descriptive and Comparative Study, with New Information on Rhodesian Man. Springfield, Illinois: Thomas. ISBN 978-0-398-04550-0. Murrill, Rupert Ivan (1981). Ed. Charles C. Thomas (ed.). Petralona Man. A Descriptive and Comparative Study, with New Information on Rhodesian Man. Springfield, Illinois: Thomas. ISBN 978-0-398-04550-0.
  • పెర్నర్, జోసెఫ్, ఫ్రాంక్ ఎస్కెన్. 2015. "హోమో హైడెల్‌బెర్గెన్సిస్లో మానవ సహకారం యొక్క పరిణామం: టెలియాలజీ వర్సెస్ మెంటలిజం." డెవలప్‌మెంటల్ రివ్యూ, థియరీస్ ఆఫ్ డెవలప్‌మెంట్, 38 (డిసెంబర్): 69–88. https://doi.org/10.1016/j.dr.2015.07.005 . [5]
  • Reich, David (2018). Who We Are And How We Got Here - Ancient DNA and the New Science of the Human Past. Pantheon Books. ISBN 978-1101870327. Reich, David (2018). Who We Are And How We Got Here - Ancient DNA and the New Science of the Human Past. Pantheon Books. ISBN 978-1101870327. Reich, David (2018). Who We Are And How We Got Here - Ancient DNA and the New Science of the Human Past. Pantheon Books. ISBN 978-1101870327. [6]
  • Rice, Stanley (2006). Encyclopedia of Evolution. Facts on File, Inc.
  • Sauer, A. (1985). Erläuterungen zur Geol. Karte 1 : 25 000 Baden-Württ. Stuttgart.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  • Schoetensack, O. (1908). Der Unterkiefer des Homo heidelbergensis aus den Sanden von Mauer bei Heidelberg. Leipzig: Wilhelm Engelmann.
  • Singer Robert R. and J. Wymer (1968). "Archaeological Investigation at the Saldanha Skull Site in South Africa". The South African Archaeological Bulletin. 23 (3): 63–73. doi:10.2307/3888485. JSTOR 3888485.
  • సల్దాన్హా శిలాజ కపాలం యొక్క ఎముక యొక్క పరిస్థితి, నిర్మాణంపై అధ్యయనాలు
  • Weinert, Hans (1937). "Dem Unterkiefer von Mauer zur 30jährigen Wiederkehr seiner Entdeckung". Zeitschrift für Morphologie und Anthropologie (in German). 37 (1): 102–13. JSTOR 25749563.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  • Woodward, Arthur Smith (1921). "A New Cave Man from Rhodesia, South Africa". Nature. 108 (2716): 371–372. Bibcode:1921Natur.108..371W. doi:10.1038/108371a0.

బయటి లింకులు మార్చు

Media related to Homo heidelbergensis at Wikimedia Commons

  1. Avery, D. Margaret (March 2017). "Micromammals from the type site of Broken Hill Man (Homo rhodesiensis) near Kabwe, Zambia: a historical note". Historical Biology (in ఇంగ్లీష్). 30 (1–2): 276–283. doi:10.1080/08912963.2017.1297434. ISSN 0891-2963.
  2. Friess, Martin (2010-09-01). "Calvarial shape variation among Middle Pleistocene hominins: An application of surface scanning in palaeoanthropology". Comptes Rendus Palevol (in ఇంగ్లీష్). 9 (6–7): 435–443. doi:10.1016/j.crpv.2010.07.016. ISSN 1631-0683.
  3. Godinho, Ricardo Miguel; Fitton, Laura C.; Toro-Ibacache, Viviana; Stringer, Chris B.; Lacruz, Rodrigo S.; Bromage, Timothy G.; O'Higgins, Paul (2018-05-01). "The biting performance of Homo sapiens and Homo heidelbergensis" (PDF). Journal of Human Evolution (in ఇంగ్లీష్). 118: 56–71. doi:10.1016/j.jhevol.2018.02.010. ISSN 0047-2484. PMID 29606203.
  4. Hublin, Jean-Jacques; Ben-Ncer, Abdelouahed; Bailey, Shara E.; Freidline, Sarah E.; Neubauer, Simon; Skinner, Matthew M.; Bergmann, Inga; Le Cabec, Adeline; Benazzi, Stefano (2017-06-07). "New fossils from Jebel Irhoud, Morocco and the pan-African origin of Homo sapiens" (PDF). Nature (in ఇంగ్లీష్). 546 (7657): 289–292. doi:10.1038/nature22336. ISSN 0028-0836. PMID 28593953.
  5. Perner, Josef; Esken, Frank (2015-12-01). "Evolution of human cooperation in Homo heidelbergensis: Teleology versus mentalism". Developmental Review (in ఇంగ్లీష్). 38: 69–88. doi:10.1016/j.dr.2015.07.005. ISSN 0273-2297.
  6. Diamond, Jared (April 20, 2018). "A Brand-New Version of Our Origin Story". The New York Times. Retrieved April 23, 2018.
🔥 Top keywords: