రంతి దేవుడు

(రంతిదేవుడు నుండి దారిమార్పు చెందింది)

రంతి దేవుడు భాగవత పురాణం నవమ స్కందంలో ప్రస్తావించబడిన చంద్రవంశపు రాజు.[1] దానగుణానికి మచ్చుకగా ఈయనను ప్రస్తావిస్తారు. రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. రంతి దేవుని ప్రస్తావన భాగవత పురాణంతో పాటు మహాభారతంలోనూ, సంస్కృత కవి కాళిదాసు రచించిన మేఘదూతంలోనూ ఉంది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది చంబల్ ప్రాంతంలోని ఆధునిక రణతంబూరుగా పరిగణించబడుతున్నది.[2] చంబల్ ప్రాంతం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉంది.

ఒక రోజు రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా ఉపవాసం ఉంటాడు. 49 వరోజు కొద్దిగా అన్నం వండుకుంటాడు. దాన్ని ఆరగించేలోగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు. అతను ఆ అన్నం తినేసి తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. ఆ సమయానికి ఒక కుక్క అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటాడు.

మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

మూలాలు మార్చు

🔥 Top keywords: పవన్ కళ్యాణ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీప్రత్యేక:అన్వేషణకె.విజయానంద్తీన్మార్ మల్లన్నఈనాడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలురేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానరేంద్ర మోదీవై.యస్.భారతితెలుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునితీష్ కుమార్వాతావరణంనందమూరి తారక రామారావుకార్తెతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజనసేన పార్టీచిరంజీవిచిరాగ్ పాశ్వాన్వికీపీడియా:Contact usఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ప్రజా రాజ్యం పార్టీరాజ్యసభకింజరాపు రామ్మోహన నాయుడుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కంగనా రనౌత్రామాయణంలోక్‌సభ