బ్రియాన్ లారా

వెస్ట్ఇండీస్‌కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్

1969, మే 2 న జన్మించిన బ్రియాన్ లారా (Brian Charles Lara) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుపొందాడు. లారా పలుసార్లు టెస్ట్ క్రికెట్‌లో టాప్‌ర్యాంక్ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించడమే కాకుండా టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ 501* పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోరులో ప్రపంచరికార్డు సృష్టించాడు.

బ్రియాన్ లారా

TC, OCC
2012 లో లారా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రియాన్ చార్లెస్ లారా
పుట్టిన తేదీ (1969-05-02) 1969 మే 2 (వయసు 55)
శాంటా క్రజ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో
ఎత్తు5 ft 8 in (1.73 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుRight-arm leg break
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 196)1990 డిసెంబరు 6 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2006 నవంబరు 27 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 59)1990 నవంబరు 9 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2007 ఏప్రిల్ 21 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987–2008Trinidad and Tobago
1992–1993Transvaal
1994–1998Warwickshire
2010Southern Rocks
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు131299261429
చేసిన పరుగులు11,95310,40522,15614,602
బ్యాటింగు సగటు52.8840.4851.8839.67
100లు/50లు34/4819/6365/8827/86
అత్యుత్తమ స్కోరు400*169501*169
వేసిన బంతులు6049514130
వికెట్లు445
బౌలింగు సగటు15.25104.0029.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు000
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు000
అత్యుత్తమ బౌలింగు2/51/12/5
క్యాచ్‌లు/స్టంపింగులు164/–120/–320/–177/–
మూలం: CricInfo, 2012 ఫిబ్రవరి 4

ప్రారంభ జీవితం మార్చు

ఆరేళ్ళ ప్రాయంలోనే క్రికెట్ శిక్షణకై లారా తండ్రి స్థానిక హార్వార్డ్ కోచింగ్ క్లినిక్ లో చేర్పించాడు. ఫాతిమా కళాశలలో ఉన్నప్పుడు లారా క్రికెట్ జీవితం ప్రారంభమైంది. 14 సంవత్సరాల వయస్సులో పాఠశాల లీగ్ పోటీలలో పాల్గొని 126.16 సగటుతో 745 పరుగులు చేశాడు. దోంతో ట్రినిడాడ్ తరఫున అండర్-16 టీమ్ లో స్థానం పొందినాడు. 15 సంవత్సరాల వయస్సులోనే వెస్ట్‌ఇండీస్ తరఫున అండర్-19 టీమ్‌లో స్థానం పొందినాడు.

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రియాన్ లారా స్థానం అత్యున్నతమైంది. టెస్ట్ క్రికెట్‌లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఒక ఇన్నింగ్సులో అత్యధిక స్కోరు సాధించిన రికార్డులు అతని పేరిటే ఊన్నాయి. 1994లో ఇంగ్లాండుపై 375 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించగా, 2003లో దాన్ని మాథ్యూ హెడెన్ 380 పరుగులు చేసి అధికమించాడు. లారా మళ్ళీ 400 పరుగుల ఇన్నింగ్సుతో మరో పర్యాయం ప్రపంచ రికార్డు చేజిక్కించుకున్నాడు. అంతేకాదు డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత టెస్టులలో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గాను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బిల్స్ పాన్స్‌ఫోర్డ్ తర్వాత 2 క్వాడ్రుపుల్ సెంచరీలు (400 కంటే అధికంగా పరుగులు సాధించడం) చేసిన రెండో బ్యాట్స్‌మెన్ గాను అవతరించాడు. టెస్ట్ క్రికెట్ మొత్తంలో 9 డబుల్ సెంచరీలు సాధించి వీటిలో కూడా 12 డబుల్ సెంచరీలు సాధించిన డాన్ బ్రాడ్‌మెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. 1995లో ఇంగ్లాడుతో జరిగిన టెస్ట్ సీరీస్ లో వరుసగా 3 టెస్టులలో 3 శతకాలు సాధించాడు. 2005 నవంబర్లో ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా అధికమించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇతడు మూడు పర్యాయాలు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. మొదటి పర్యాయం 1998లో, రెండో సారి 2003లో, చివరగా 2006 ఏప్రిల్లో శివనారాయణ్ చందర్‌పాల్ రాజీనామాతో నాయకత్వం చేపట్టాడు. 2006 డిసెంబర్ 16న టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి వెస్ట్‌ఇండీస్ బ్యాట్స్‌మెన్ గా రికార్డు స్థాపించాడు[1]. 2007, ఏప్రిల్ 10న లారా వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు [2].

క్రీడాజీవితంలో ముఖ్యసంఘటనలు మార్చు

  • తొలి సెంచరీలోనే ఆస్ట్రేలియాపై 277 పరుగులు చేసి తొలి టెస్ట్ సెంచరీ ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వారిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు [3]
  • 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్సులలో 7 సెంచరీలు సాధించిన వారిలో ఇతడే ప్రథముడు.
  • టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 క్వాడ్రుపుల్ సెంచరీలను సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్.
  • 2005, నవంబర్ 26న టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు.[4]
  • 5 వేర్వేరు సంవత్సరాలలో టెస్టులలో 1000 పరుగులు చొప్పున సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు.
  • అతివేగంగా 11,000 టెస్టు పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు..[5]
  • వెస్ట్‌ఇండీస్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.[6]
  • అతను సాధించిన సెంచరీలలో 9 డబుల్ సెంచరీలు. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నాడు.
  • టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై సెంచరీలు సాధించాడు.
  • వెస్ట్‌ఇండీస్ టీం స్కోరులో 20% పరుగులు సాధించాడు. ఈ విషయంలో డాన్ బ్రాడ్‌మెన్ (23%), జార్జ్ హీడ్లీ (21%) మాత్రమే ఇతనికంటే ముందున్నారు.
  • 2001-02 లో శ్రీలంకపై 3 టెస్టుల సీరీస్ లో 688 పరుగులు సాధించాడు. 3 టెస్టుల సీరీస్ లో ఇది రెండో అత్యధిక సీరీస్ స్కోరు. అంతేకాకుండా ఈ సీరీస్ లో వెస్టీండీస్ చేసిన పరుగులలో ఇది 42%.[7]
  • 2001-02 శ్రీలంక సీరీస్‌లో ఒకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన 6 గురు బ్యాట్స్‌మెన్లలో చోటు సంపాదించాడు.[8]
  • 164 క్యాచ్‌లు పట్టి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లలో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.[9]

అవార్డులు మార్చు

  • 1994లో బి.బి.సి.స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు సాధించాడు.
  • 1995లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికయ్యాడు.

టెస్ట్ సెంచరీలు మార్చు

బ్రియాన్ లారా సాధించిన టెస్ట్ సెంచరీల జాబితా
పరుగులుమ్యాచ్ప్రత్యర్థివేదికసంవత్సరం
[1]2775ఆస్ట్రేలియాసిడ్నీ, ఆస్ట్రేలియా1993
[2]16713ఇంగ్లాండుజార్జ్‌టౌన్, గుయానా1993
[3]37516ఇంగ్లాండుఆంటిగ్వా1994
[4]14721న్యూజీలాండ్వెల్లింగ్టన్, న్యూజీలాండ్1995
[5]14529ఇంగ్లాండుమాంచెస్టర్, ఇంగ్లాండ్1995
[6]15230ఇంగ్లాండునాటింఘామ్, ఇంగ్లాండు1995
[7]17931ఇంగ్లాండులండన్, ఇంగ్లాండు1995
[8]13238ఆస్ట్రేలియాపెర్త్, ఆస్ట్రేలియా1997
[9]10342ఇండియాఆంటిగ్వా1997
[10]11545శ్రీలంకకింగ్స్‌టౌన్, సెయింట్ విన్సెంట్1997
[11]21361ఆస్ట్రేలియాకింగ్‌స్టన్, జమైకా1999
[12]153*62ఆస్ట్రేలియాబ్రిడ్జిటౌన్, బార్బడస్1999
[13]10063ఆస్ట్రేలియాఆంటిగ్వా1999
[14]11268ఇంగ్లాండుమాచెస్టర్, ఇంగ్లాండు2000
[15]18273ఆస్ట్రేలియాఅడిలైడ్, ఆస్ట్రేలియా2000
[16]17881శ్రీలంకగాలె, శ్రీలంక2001
[17]22183శ్రీలంకకొలంబో, శ్రీలంక2001
[18]13083శ్రీలంకకొలంబో, శ్రీలంక2001
[19]11091ఆస్ట్రేలియాజార్జ్‌టౌన్, గుయానా2003
[20]12292ఆస్ట్రేలియాపోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్2003
[21]20995శ్రీలంకసెయింట్ లూసియా2003
[22]19198జింబాబ్వేబులావాయో, జింబాబ్వే2003
[23]20299దక్షిణాఫ్రికాజొహన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా2003
[24]115101దక్షిణాఫ్రికాకేప్‌టౌన్, దక్షిణాఫ్రికా2004
[25]400*106ఇంగ్లాండుఆంటిగ్వా2004
[26]120108బంగ్లాదేశ్కింగ్‌స్టన్, జమైకా2004
[27]196113దక్షిణాఫ్రికాపోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్2005
[28]176114దక్షిణాఫ్రికాబ్రిడ్జ్‌టౌన్, బార్బడస్2005
[29]130116పాకిస్తాన్బ్రిడ్జ్‌టౌన్, బార్బడస్2005
[30]153117పాకిస్తాన్కింగ్‌స్టన్, జమైకా2005
[31]226121ఆస్ట్రేలియాఅడిలైడ్, ఆస్ట్రేలియా2005
[32]120126ఇండియాసెయింత్ లూసియా2006
[33]122129పాకిస్తాన్లాహోర్, పాకిస్తాన్2006
[34]216130పాకిస్తాన్ముల్తాన్, పాకిస్తాన్2006

వన్డే సెంచరీలు మార్చు

బ్రియాన్ లారా సాధించిన వన్డే సెంచరీల జాబితా
పరుగులుమ్యాచ్ప్రత్యర్థివేదికసంవత్సరం
[1]12841పాకిస్తాన్డర్బాన్, దక్షిణాఫ్రికా1993
[2]111*42దక్షిణాఫ్రికాబ్లూయెంఫోటీన్, దక్షిణాఫ్రికా1993
[3]11445పాకిస్తాన్కింగ్‌స్టన్, జమైకా1993
[4]15354పాకిస్తాన్షార్జా, UAE1993
[5]13983ఆస్ట్రేలియాపోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్1995
[6]16990శ్రీలంకషార్జా, UAE1995
[7]11196దక్షిణాఫ్రికాకరాచి, పాకిస్తాన్1996
[8]146*100న్యూజీలాండ్పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్1996
[9]104102న్యూజీలాండ్కింగ్‌స్టన్, సెయింట్ విన్సెంట్1996
[10]102108ఆస్ట్రేలియాబ్రిస్బేన్, ఆస్ట్రేలియా1997
[11]103*109పాకిస్తాన్పెర్త్, ఆస్ట్రేలియా1997
[12]110125ఇంగ్లాండుబ్రిడ్జిటౌన్, బార్బడస్1998
[13]117157బంగ్లాదేశ్ఢాకా, బంగ్లాదేశ్1999
[14]116*176ఆస్ట్రేలియాసిడ్నీ, ఆస్ట్రేలియా2001
[15]111202కెన్యాకొలంబో, Sri Lanka2002
[16]116203దక్షిణాఫ్రికాకేప్‌టౌన్, దక్షిణాఫ్రికా2011
[17]116217శ్రీలంకబ్రిడ్జిటౌన్, బార్బడస్2003
[18]113219జింబాబ్వేబులావాయో, జింబాబ్వే2003
[19]156250పాకిస్తాన్అడిలైడ్, ఆస్ట్రేలియా2005

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.howstat.com/cricket/Statistics/Batting/BattingCareerRuns_ODI.asp?Stat=5000 |title= ODI Batting Statistics
  2. Lara confirms one-day retirement BBC News retrieved July 30 2007
  3. Highest Maiden Tons Stats from CricInfo, retrieved July 30 2007
  4. Most Test Runs Stats from CricInfo retrieved July 30 2007
  5. Fastest Test Runs Stats from CricInfo retrieved July 30 2007
  6. http://www.cricinfo.com/db/STATS/TESTS/BATTING/LEADING_BATSMEN_TEST_100S.html Leading Test Batsmen] Stats from CricInfo retrieved July 30 2007
  7. Highest Aggregate runs in series Stats from CricInfo retrieved July 30 2007
  8. 100s in each innings Stats from Cric Info retrieved July 30 2007
  9. Test Career catces Stats from CricInfo retrieved July 30 2007
🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్మొదటి పేజీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీ ఫిల్మ్ సిటీపవన్ కళ్యాణ్మనమేతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీనందమూరి బాలకృష్ణకింజరాపు రామ్మోహన నాయుడుచిరాగ్ పాశ్వాన్రేణూ దేశాయ్కార్తెచేప ప్రసాదంవాతావరణంతెలుగునరేంద్ర మోదీఉషాకిరణ్ మూవీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.భారతిభారత కేంద్ర మంత్రిమండలిఅందెశ్రీశివ ధనుస్సుతెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్తెలుగు అక్షరాలునందమూరి తారక రామారావురాజ్యసభచిరంజీవివికీపీడియా:Contact usగాయత్రీ మంత్రం