పులివెందుల శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పులివెందుల శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

పులివెందుల
—  శాసనసభ నియోజకవర్గం  —
పులివెందుల is located in Andhra Pradesh
పులివెందుల
పులివెందుల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లాకడప
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులువై.యస్. రాజశేఖరరెడ్డి

చరిత్ర

మార్చు

జిల్లా పశ్చిమాన అనంతపురంజిల్లా సరిద్దులో ఉన్న ఈ నియోజకవర్గం ప్రారంభంనుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన ఘనతను పొందినది. 2009 ఎన్నికలలోనూ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజశేఖరరెడ్డి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో 6వ విజయం నమోదుచేశాడు .1978 నుంచి ఇక్కడ ప్రతిసారి వై.ఎస్. కుటుంబ సభ్యులే గెలుపొందుతుండటం విశేషం.

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు
పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

వివిధ రాజకీయపార్టీల బలాబలాలు

మార్చు

పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ప్రారంభంనుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. ఇంతరవకు జరిగిన శాసనసభల ఎన్నికలలో 1962లో ఒక్కసారి మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచాడు. 1955, 1967 ఎన్నికలలో కమ్యూనిష్ఠు పార్టీలు రెండో స్థానంలో నిలిచి కొద్దిగా ప్రభావితం చేయగా, 1978లో దేశవ్యాప్తంగా ప్రబలిన జనతా పార్టీ ప్రభంజనంలో ఈ స్థానంలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత జరిగిన అన్ని ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రధాన ప్రత్యర్థులుగా మారుతున్నారు.

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరముఎన్నికైన అభ్యర్థిపార్టీసమీప ప్రత్యర్థిప్రత్యర్థి పార్టీ
1955పెంచికల బసిరెడ్డికాంగ్రెస్ పార్టీగజ్జల మల్లారెడ్డిసి.పి.ఐ
1962చవ్వా బాలిరెడ్డిస్వతంత్ర అభ్యర్థిపెంచికల బసిరెడ్డికాంగ్రెస్ పార్టీ
1967పెంచికల బసిరెడ్డికాంగ్రెస్ పార్టీపి.వెంకటరెడ్డిసి.పి.ఎం
1972పెంచికల బసిరెడ్డికాంగ్రెస్ పార్టీఎన్.ఎ.ఆర్ దేవిరెడ్డిస్వతంత్ర అభ్యర్థి
1978వై.ఎస్.రాజశేఖరరెడ్డికాంగ్రెస్ పార్టీడి.నారాయణరెడ్డిజనతా పార్టీ
1983వై.ఎస్.రాజశేఖరరెడ్డికాంగ్రెస్ (ఐ)యెద్దుల బాలిరెడ్డితెలుగుదేశం పార్టీ
1985వై.ఎస్.రాజశేఖరరెడ్డికాంగ్రెస్ పార్టీడి.సదాశివరెడ్డితెలుగుదేశం పార్టీ
1989వై.ఎస్.వివేకానందరెడ్డికాంగ్రెస్ పార్టీజ్యోతి దేవిరెడ్డితెలుగుదేశం పార్టీ
1991 (ఉప ఎన్నికలు)వై.ఎస్.పురుషోత్తంరెడ్డికాంగ్రెస్ పార్టీబాలస్వామిరెడ్డితెలుగుదేశం పార్టీ
1994వై.ఎస్.వివేకానందరెడ్డికాంగ్రెస్ పార్టీసిరిగిరెడ్డి రామమునిరెడ్డితెలుగుదేశం పార్టీ
1999వై.యస్. రాజశేఖరరెడ్డికాంగ్రెస్ పార్టీఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ
2004వై.యస్. రాజశేఖరరెడ్డికాంగ్రెస్ పార్టీఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ
2009వై.యస్. రాజశేఖరరెడ్డికాంగ్రెస్ పార్టీఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ
2011-ఉప ఎన్నికవై. ఎస్. విజయమ్మవై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీవై.యెస్.వివేకానంద రెడ్డికాంగ్రెస్ పార్టీ
2014-2019వై.ఎస్. జగన్మోహన్ రెడ్డివై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ
2019వై.ఎస్. జగన్మోహన్ రెడ్డివై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డిపై 40777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రాజశేఖరరెడ్డికి 74432 ఓట్లు రాగా, సతీష్ కుమార్ రెడ్డి 33655 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సతీశ్ కుమార్ రెడ్డి మళ్ళీ పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోటీచేసి విజయం సాధించాడు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి ఆకస్మిక మరణంతో అయన సతీమణి వై.యెస్.విజయమ్మ 2010లో పులివెందుల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2011 ఉపఎన్నిక

మార్చు

2011లో వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్నుండి వెలుపలికి వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వై.యెస్.విజయమ్మ కూడా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వై.యెస్.ఆర్.సి.పి. తరపున 90,000పైచిలుకు భారీ మెజారిటీతో గెలుపొందారు.

2014 ఎన్నికలు

మార్చు

2014 సాధారన ఎన్నికలలో వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి వై.యెస్.ఆర్.సి.పి. పార్టీ తరపున 70,000పైచిలుకు ఓట్ల మెజారిటీతో సీమాంధ్రలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యరు.

సంవత్సరంశాసనసభ నియో. క్రమ సంఖ్యశాసనసభ నియో. పేరుశాసనసభ నియో. వర్గముగెలిచిన అభ్యర్థిలింగముపార్టిఓట్లుఓడిన అభ్యర్థిలింగముపార్టిఓట్లు
2014248పులివెందులజనరల్వై.యెస్.జగన్ మోహన్ రెడ్డిపువై.యెస్.ఆర్.సి.పి.124576యెస్.సతీశ్ కుమార్ రెడ్డిపుతె.దే.పా49333


నియోజకవర్గ ప్రముఖులు

మార్చు
వై.ఎస్.రాజశేఖరరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌గా చిరపరిచితుడు. 1949లో[2] పులివెందులలో జన్మించిన వైఎస్సార్ తండ్రి వై.ఎస్.రాజారెడ్డి వలె అనతికాలంలోనే ప్రసిద్ధిచెందినాడు. 1978లో క్రియాశీల రాజకీయాలలో చేరిన వైఎస్సార్ మొత్తం 4 సార్లు రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టాడు. అన్నే సార్లు లోక్‌సభకు కూడా ఎన్నికైనాడు. పోటీచేసిన అన్ని ఎన్నికలలో గెలుపొందడం అతని ప్రత్యేకత. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. గత శాసనసభ కాలంలో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించి, తదుపరి ఎన్నికలలో విజయానికి అనేక చర్యలు చేపట్టినాడు. అందులో ముఖ్యమైనది పాదయాత్ర. అతని విశేషకృషి మూలంగా 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో సహజంగానే ముఖ్యమంత్రి పీఠం కూడా అతనికే దక్కింది. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.
వై.ఎస్.వివేకానందరెడ్డి
1989లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వై.ఎస్.వివేకానందరెడ్డి 1950, ఏప్రిల్ 1న జన్మించాడు. 1999లో 13వ లోక్‌సభకు, 2004 మరోసారి 14వ లోక్‌సభకు ఎన్నికైనాడు.[3]
వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి

వై.యెస్.ఆర్.సి.పి అధ్యక్షులు, శాసన సభలో విపక్ష నేత.

వై.యెస్.విజయమ్మ

వై.యెస్.ఆర్.సి.పి గౌరవ అధ్యక్షురాలు

ప్రస్తుత పూర్వ శాసనసభ అభ్యర్థుల జాబితా

మార్చు

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేల వారి పార్టీ పేరుతో సంవత్సరం వారీ జాబితా క్రింద ఉంది:

సంవత్సరంశాసనసభ నియో. క్రమ సంఖ్యశాసనసభ నియో. పేరుశాసనసభ నియో. వర్గముగెలిచిన అభ్యర్థిలింగముపార్టిఓట్లుఓడిన అభ్యర్థిలింగముపార్టిఓట్లు
2014248పులివెందులజనరల్వై.యెస్.జగన్ మోహన్ రెడ్డిపువై.యెస్.ఆర్.సి.పి.124576యెస్.సతీశ్ కుమార్ రెడ్డిపుతె.దే.పా49333
2011ఉప ఎన్నికలుపులివెందులజనరల్వై.యెస్.విజయమ్మస్త్రీవై.యెస్.ఆర్.సి.పి.110098వై.యెస్.వివేకానంద రెడ్డిపుకాంగ్రెస్28725
2009248పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్103556యెస్.సతీశ్ కుమార్ రెడ్డిపుతె.దే.పా34875
2004160పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్74432యెస్.సతీశ్ కుమార్ రెడ్డిపుతె.దే.పా33655
1999160పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్62019యెస్.సతీశ్ కుమార్ రెడ్డిపుతె.దే.పా32010
1994160పులివెందులజనరల్వై.యెస్.వివేకానంద రెడ్డిపుకాంగ్రెస్90673సిరిగిరెడ్డి రామముని రెడ్డిపుతె.దే.పా19093
1991ఉప ఎన్నికలుపులివెందులజనరల్వై.యెస్.పురుషోత్తమ రెడ్డిపుకాంగ్రెస్109318బి.ఆర్.అన్నారెడ్డిపుతె.దే.పా11870
1989160పులివెందులజనరల్వై.యెస్.వివేకానంద రెడ్డిపుకాంగ్రెస్77183దేవిరెడ్డి జ్యోతిపుతె.దే.పా29437
1985160పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్61048దేవిరెడ్డి సదాశివ రెడ్డిపుతె.దే.పా30206
1983160పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్47256యెద్దుల బాలిరెడ్డిపుఇండిపెండెంట్33889
1978160పులివెందులజనరల్వై.యెస్.రాజశేఖర రెడ్డిపుకాంగ్రెస్47874డి.నారాయణ రెడ్డిపుజనతా27378
1972160పులివెందులజనరల్పెంచికల బసిరెడ్డిపుకాంగ్రెస్37742దేవిరెడ్డి నారాయణ రెడ్డిపుఇండిపెండెంట్22237
1967157పులివెందులజనరల్పెంచికల బసిరెడ్డిపుకాంగ్రెస్43421పొన్నతోట వి.ఆర్పుసి.పి.ఎం.9775
1962164పులివెందులజనరల్చవ్వా బాలిరెడ్డిపుఇండిపెండెంట్25451పెంచికల బసిరెడ్డిపుకాంగ్రెస్20443
1955142పులివెందులజనరల్పెంచికల బసిరెడ్డిపుకాంగ్రెస్27820గజ్జల మల్లారెడ్డిపుసి.పి.ఐ.13903


ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-18. Retrieved 2008-07-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-28. Retrieved 2008-07-12.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా