జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి

జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్  సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల కంటే ఇవి విభిన్నంగా ఉంటాయి.

A UGM-96 Trident I clears the water after launch from a US Navy submarine in 1984

ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (5,500 కి.మీ. పైబడిన పరిధి) లాగానే పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు రకాల క్షిపణులు కూడా ఒకే క్షిపణి కుటుంబానికి చెంది ఉంటాయి. 

చరిత్ర

మార్చు

బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు అణుపాటవం గల దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఇవి నిఘా ఉపగ్రహాల కంటబడకుండా ఉంటూ, తమ అణ్వాయుధాలను ప్రయోగించగలవు. శత్రుదేశాల అణుదాడిలో నేలపై ఉండే అణ్వాయుధాలన్నీ నాశనమైనా, ఈ తొలిదాడిని తప్పించుకుని, విధ్వంసకమైన ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. దీంతో, ఏమాత్రం సందేహం వచ్చినా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం, తత్కారణంగా ప్రమాదవశాత్తూ అణుయుద్ధం మొదలయ్యే అవకాశం తొలగి పోయింది. ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ జలాంతర్గాములపై, ఎంతో కచ్చితత్వం గల క్షిపణులను మోహరించడం ద్వారా, శత్రుదేశ తీరానికి దగ్గరగా వెళ్ళి, తక్కువ ఎత్తు గల బాలిస్టిక్ పథంలో క్షిపణిని ప్రయోగించి, తొలిదాడి జరిగిన తరువాత అతి తక్కువ సమయంలో, అత్యంత కచ్చితత్వంతో ప్రతిదాడిని చెయ్యవచ్చు. అలాగే ఈ ప్రతిదాడి ద్వారా శత్రుదేశపు రాజకీయ, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే సామర్థ్యమూ వీటికి ఉంది.

రకాలు

మార్చు
ట్రైడెంట్ I C-4 SLBM ప్రయోగం, పునఃప్రవేశ వాహనాల దారులు
రష్యా, చైనాలకు చెందిన జ.ప్ర.బా.క్షి ఎడమ నుండి:R-29 వైసోటా (SS-N-8), R-29R (SS-N-18), R-39 (SS-N-20), R-29RM (SS-N-23), JL-1, JL-2

జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు (గత, ఇప్పటి, అభివృద్ధిలో ఉన్న) ఇవి:

రకంనాటో పిలిచే పేరుకనిష్ట పరిధి (కి.మీ.)గరిష్ఠ పరిధి (కి.మీ.)దేశంస్థితి
UGM-27 పోలారిస్ (A-1 నుండి A-3 దాకా)4,600 అమెరికామోహరింపు నుండి తొలగించారు
UGM-73 పోసీడాన్ (C-3)4,600 అమెరికామోహరింపు నుండి తొలగించారు
UGM-96 ట్రైడెంట్ I (C-4)7,400 అమెరికామోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5LE)12,000 అమెరికామోహరించారు
R-13SS-N-4600 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
R-21SS-N-51,650 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
R-27SS-N-62,4003,000 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
RSM-40[1] R-29 "వైసోటా"SS-N-8 "Sawfly"7,7009,000 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
R-27KSS-NX-133,600 సోవియట్ యూనియన్/రష్యాNever మోహరించారు[2]
RSM-45 R-31SS-N-17 "Snipe"4,500 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
RSM-50 R-29R "వైసోటా"SS-N-18 "Stingray"6,500 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
RSM-52 R-39 "Rif"SS-N-20 "Sturgeon"8,300 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు
RSM-54 R-29RM "ష్టిల్"SS-N-23 "Skiff"8,300 సోవియట్ యూనియన్/రష్యామోహరింపు నుండి తొలగించారు (Under rebuild to R-29RMU "Sineva")[3]
RSM-54 R-29RMU "సినేవా"SS-N-23 "Skiff"8,300 సోవియట్ యూనియన్/రష్యామోహరించారు
RSM-54 R-29RMU2 "లేనర్"8,30012,000 సోవియట్ యూనియన్/రష్యామోహరించారు
RSM-56 R-30 "బులావా"SS-NX-32[4]8,0008,300 సోవియట్ యూనియన్/రష్యామోహరించారు
UGM-27 Polaris (A-3) and Chevaline4,600 United Kingdomమోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5)12,000 United Kingdomమోహరించారు
M13,000 ఫ్రాన్సుమోహరింపు నుండి తొలగించారు
M23,200 ఫ్రాన్సుమోహరింపు నుండి తొలగించారు
M203,000 ఫ్రాన్సుమోహరింపు నుండి తొలగించారు
M45,000 ఫ్రాన్సుమోహరింపు నుండి తొలగించారు
M456,000 ఫ్రాన్సుమోహరించారు
M518,00010,000 ఫ్రాన్సుమోహరించారు
JL-1[5]2,500 చైనామోహరింపు నుండి తొలగించారు (never fully మోహరించారు)
JL-27,4008,000 చైనామోహరించారు
JL-311,000 చైనాపరీక్షిస్తున్నారు [6]
K-15 సాగరిక7501,900 భారత్మోహరించారు
K-43,500 భారత్అరిహంత్ తరగతి జలాంతర్గామి నుండి పరీక్షించారు.[7]
K-56,000 భారత్అభివృద్ధి జరుగుతోంది[8][9]
పుక్కుక్‌సాంగ్-1/KN-115002,500 ఉత్తర కొరియాఅభివృద్ధి జరుగుతోంది[10]

సైనికేతర వినియోగం

మార్చు

కొన్ని రష్యా జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఉపగ్రహ వాహకనౌకలుగా మార్చారు. 

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Korabli VMF SSSR, Vol. 1, Part 1, Yu. Apalkov, Sankt Peterburg, 2003, ISBN 5-8172-0069-4
  2. SS-NX-13 SLBM System (U), Defense Intelligence Agency, D5T-1020S-4l7-75, 1 October 1975
  3. "SSBN K-51 Verkhoturye arrived to Zvezdochka for repairs today". Rusnavy.com. 23 August 2010. Retrieved 8 October 2010.
  4. NASIC-1031-0985-09
  5. "JL-1 [CSS-N-3] – China Nuclear Forces". Fas.org. Retrieved 10 February 2012.
  6. "詹氏:大陸將試驗巨浪3飛彈 採用東風41技術". 联合早报网. Retrieved 2017-08-08.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-08. Retrieved 2018-07-02.
  8. "Going nuclear at sea". The Indian Express. 19 March 2015. Retrieved 11 January 2017.
  9. "India's First Ballistic Missile Sub to Begin Sea Trials". The Diplomat. 30 July 2013. Retrieved 11 January 2017.
  10. (2nd LD) N.K. leader calls SLBM launch success, boasts of nuke attack capacity – Yonhap, 25 August 2016 08:17 am

బయటి లింకులు

మార్చు
🔥 Top keywords: ప్రపంచ యోగ దినోత్సవంమొదటి పేజీనారా చంద్రబాబునాయుడువంగ‌ల‌పూడి అనితయోగాబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడుబండారు శ్రావణి శ్రీమేడిపల్లి సత్యంతెలుగు అక్షరాలుకొత్తపల్లి జయశంకర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రత్యేక:ఇటీవలిమార్పులువాతావరణంతెలుగుగోరంట్ల బుచ్చయ్య చౌదరిశ్రీలీల (నటి)సుఖేశ్ చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపోచారం శ్రీనివాసరెడ్డిపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రంరుషికొండజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహాభారతంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికింజరాపు అచ్చెన్నాయుడువై.యస్.భారతిఏరువాక పున్నమిఅంగుళంకార్తెతెలుగుదేశం పార్టీతెలంగాణ