చేతివాటం

చేతివాటం (ఆంగ్లం: Handedness) అనేది మానవులలో సున్నితమైన పనులు చేయడంలో కుడి, ఎడమ చేతుల మధ్య వ్యత్యాసం ఉండడం. కుడి చేతితో పనులు సులువుగా చేసుకొనే వారిని కుడి చేతివాటం కలవాడు అంటారు. అలాగే ఎడమ చేతితో చేసుకొనే వారిని ఎడమ చేతివాటం వాడు అంటారు. చాలా తక్కువమంది రెండు చేతులతో ఒకే విధంగా పనిచేసుకోగలవారుంటారు. వారిని సవ్యసాచి అంటారు. అయితే ఒక వ్యక్తి ఏ చేతివాటం కలవాడో తెలుసుకోవడానికి సాధారణంగా వారు ఏ చేతితో రాస్తారో అనేదాని మీద నిర్ణయిస్తారు.

Left Handers' Day, August 13 2002

చేతివాటాలు-రకాలు

మార్చు
  • కుడి చేతివాటం చాలా సాధారణం. వీరు కుడి చేతితో సునాయాసంగా పనిచేయగలరు.
  • ఎడమ చేతివాటం కొద్ది మందిలో కనిపిస్తుంది. వీరు ఎడమ చేతితో సునాయాసంగా పనిచేయగలరు. ఒక అంచనా ప్రకారం ఇంచుమించు 8-15% మంది ప్రపంచ జనాభాలో ఎడమ చేతివాటం కనిపిస్తుంది.[1]
  • మిశ్రమ చేతివాటం కలవారు కొన్ని పనులు ఎడమ చేతితోను మరికొన్ని పనులు కుడి చేతితోను చేయడానికి అలవాటు పడతారు.
  • సవ్యసాచిత్వం చాలా అరుదైనది. వీరు ఎంత సున్నితమైన పనైనా రెండు చేతులతో ఒకే ప్రావీణ్యతతో చేయగలుగుతారు. భారత పురాణాలలో అర్జునుడు సవ్యసాచిగా పేర్కొంటారు.

ఎడమ చేతివాటం ఉన్న ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Hardyck C, Petrinovich LF (1977). "Left-handedness". Psychol Bull. 84 (3): 385–404. doi:10.1037/0033-2909.84.3.385. PMID 859955.
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణకాట ఆమ్రపాలివంగ‌ల‌పూడి అనితవాతావరణంఇంద్రజిత్ (1990 సినిమా)నారా చంద్రబాబునాయుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఈనాడుతెలుగు అక్షరాలుచింతకాయల అయ్యన్న పాత్రుడుతెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినాగ్ అశ్విన్మహాభారతంగాయత్రీ మంత్రంమహాత్మా గాంధీభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రత్యేక:ఇటీవలిమార్పులుమాదక ద్రవ్యాలుపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్రామాయణంఅంగుళంశ్రీ కృష్ణుడుసత్యరాజ్నక్షత్రం (జ్యోతిషం)స్త్రీవికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియకల్క్యావతారముమిథాలి రాజ్తెలంగాణపెమ్మసాని చంద్ర శేఖర్గిరిబాబువాడుకరి:Harsha Sai 4522ఏ.పి.జె. అబ్దుల్ కలామ్లోక్‌సభ స్పీకర్