గేమ్ ఆఫ్ థ్రోన్స్

గేమ్ ఆఫ్ త్రోన్స్ అన్నది డేవిడ్ బెనియాఫ్, డి.బి.వైస్ సృష్టించిన అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్. జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ రాసిన ఫాంటసీ నవలల సీరీస్ ని స్వీకరించి ఈ టీవీ సీరీస్ తీశారు. బెల్ ఫాస్ట్ లోని టైటానిక్ స్టూడియోస్ లోనూ, యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, క్రొయేషియా, ఐస్ లాండ్, మాల్టా, మొరాకో, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ వంటి పలు దేశాల్లోని లొకేషన్లలో చిత్రీకరించారు. సీరీస్ అమెరికా వ్యాప్తంగా హెచ్.బి.వో. చానెల్లో 2011 ఏప్రిల్ 17న ప్రసారం కావడం ప్రారంభం కాగా, ఆరవ సీజన్ 2016 జూన్ 26న ముగిసింది. సీరీస్ లో 7వ సీజన్,[1] 2017 జూలై 16 నుంచి ప్రసారం కానుండగా,[2] 2018లో ఎనిమిదవ సీజన్ తో సీరీస్ ముగియనుంది.[3]

గేమ్ ఆఫ్ థ్రోన్స్
తరం
  • ఫాంటసీ * సీరియల్ డ్రామా
సృష్టి కర్త
  • డేవిడ్ బెనియాఫ్ * డి.బి.వీస్
Based onఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ 
by జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్
Theme music composerరామిన్ జావేది
Opening themeమెయిన్ టైటిల్
Composerరామిన్ జావేదీ
దేశంఅమెరికా
అసలు భాషఆంగ్లం
సీజన్ల6 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య60
ప్రొడక్షన్
Executive producers
  • డేవిడ్ బెనియాఫ్f * డి. బి. వీస్ * కారొలిన్ స్ట్రాస్ * ఫ్రాంక్ డాల్గర్ * బెర్నెడెట్టే * జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్
ప్రొడక్షన్ locations
  • కెనడా * క్రొయేషియా * ఐస్ లాండ్ * మాల్టా * మొరాకో * స్పెయిన్ * యునైటెడ్ కింగ్ డమ్ * యునైటెడ్ స్టేట్స్
నడుస్తున్న సమయం50–69 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీలు
  • టెలివిజన్ 360 * గ్రాక్! టెలివిజన్ * జనరేటర్ ఎంటర్టైన్మెంట్ * స్టార్ట్లింగ్ టెలివిజన్ * బిగ్ హెడ్ లిటిల్ హెడ్
డిస్ట్రిబ్యూటర్
  • హెచ్.బి.వో. ఎంటర్ప్రైజెస్ * వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ * వార్నర్ హోమ్ వీడియో (బ్లూరే, డీవీడీ)
విడుదల
వాస్తవ నెట్‌వర్క్హెచ్.బి.వో.
చిత్రం ఫార్మాట్1080ఐ (16:9 హెచ్.డి.టి.వి)
ఆడియో ఫార్మాట్డాల్బీ డిజిటల్ 5.1
వాస్తవ విడుదల2011 ఏప్రిల్ 17 (2011-04-17) –
present
బాహ్య లంకెలు
Website
Production website

వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో జరిగినట్టు ఏర్పాటుచేసిన గేమ్ ఆఫ్ త్రోన్స్ కథనంలో అనేక అనేక కథాంశాలు, భారీ తారాగణం ఉన్నాయి. మొదటి కథా క్రమం ఏడు రాజ్యాల సింహాసనం (ఐరన్ త్రోన్) కోసం వివాదించే హక్కుదార్లు, సింహాసనం నుంచి స్వాతంత్రం, సార్వభౌమత్వం  కోసం పోరాడే సామంతులతో కలిసివుంటుంది. రెండో కథా క్రమంలో సింహాసన భ్రష్టులైన పూర్వ రాజవంశానికి సంబంధించిన వారసుల్లో మిగిలినవారు ప్రవాసంలో జీవిస్తూ సింహసనాన్ని తిరిగి పొందాలని చేసే ప్రయత్నాలు ఉంటాయి. మూడోదానిలో ప్రమాదకరమైన చలికాలం వస్తూండడం, ఉత్తరాదికి చెందిన భయంకరమైన వింత జీవులు, ప్రచండమైన మనుషుల ప్రమాదం ముంచుకురావడం సాగుతుంటుంది.

గేమ్ ఆఫ్ త్రోన్స్ హెచ్.బి.వో. చానెల్ లో రికార్డు స్థాయిలో వీక్షకులను పొంది, అంతర్జాతీయంగా విస్తారమైన అభిమానులను కలిగివుంది. నటన, సంక్లిష్టమైన పాత్రలు, కథ, విస్తృతికి అవకాశం, నిర్మాణ విలువలు వంటివాటికి విమర్శకుల ప్రశంసలు పొందింది. మరోవైపు సీరీస్ లో నగ్నత, హింస (లైంగిక హింసతో సహా) ఉపయోగం వల్ల విమర్శల పాలైంది. అత్యుత్తమ డ్రామా సీరీస్ పురస్కారాలు (2015, 16 సంవత్సరాలకు గాను) సహా సీరీస్ 38 ప్రైమ్ టైమ్ ఎమ్మా పురస్కారాలు పొందింది. స్క్రిప్ట్ ఆధారితమైన ప్రైమ్ టైమ్ సీరీస్ ల్లో ఇదే అతిఎక్కువ పురస్కారాలు పొందింది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో అత్యుత్తమ టెలివిజన్ సీరీస్ - డ్రామాకు నాలుగు నామినేషన్లు (2012, 2015, 2016, 2017) పొందింది. తారాగణంలో టైరియన్ లానిస్టర్ పాత్రలో పీటర్ డింక్లిజ్ నటనకు గాను రెండు ప్రైమ్ టైమ్ ఎమ్మీ పురస్కారాల్లో అత్యుత్తమ సహాయ నటుడు (డ్రామా) పురస్కారం (2011, 2015), 2012లో గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ సహాయ నటుడు (సీరీస్, టెలివిజన్ ఫిల్మ్) పురస్కారం అందుకున్నారు. లీనా హేడే, ఎమిలియా క్లార్క్, కిట్ హారింగ్టన్, మైసీ విలియమ్స్, డయానా రిగ్, మాక్స్ వాన్ సిడో సీరీస్ లో వారి నటనకు ప్రైమ్ టైమ్ ఎమ్మీ పురస్కారం నామినేషన్లు పొందారు.

నేపథ్యం మార్చు

Weapons in the series
గేమ్ ఆఫ్ త్రోన్స్ సీరీస్లో ప్రధానమైన థీమ్స్ - అధికారం, హింస. సీరీస్ కోసం రూపకల్పన చేసిన ఆయుధాల్లో ఇది ప్రతిఫలిస్తుంది. (వాటిలో కొన్నిటిని ఇక్కడ చూడొచ్చు)

కాల్పనిక ప్రపంచం మార్చు

ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నవలల సీరీస్ లో వెస్టెరోస్ కాల్పనిక ఖండంలోని ఏడు రాజ్యాలు, మరో కాల్పనిక ఖండమైన ఎసోస్ లో జరిగే కథాంశం గేమ్ ఆఫ్ త్రోన్స్ టెలివిజన్ సీరీస్ కు చాలావరకూ ఆధారం.[4][5] సీరీస్ రాజ్యానికి చెందిన రాజవంశీకుల మధ్య సింహాసనం కోసం పోరాటాన్ని, మిగతా కుటుంబాలు దాని నుంచి స్వాతంత్రం కోసం పోరాటాన్ని చేయడం చిత్రీకరిస్తుంది. మంచుతో గడ్డకట్టుకుపోయిన ఉత్తరం, తూర్పున ఎసోస్ ప్రాంతాల నుంచి అదనపు ప్రమాదాలు దీంట్లో పొడసూపుతూంటాయి.[6]

2012లో 40 ఇటీవలి అమెరికన్ టీవీ డ్రామా సీరీస్ ల మీద ఎపిసోడ్ కి సగటున ఎన్ని మరణాలు చూపిస్తున్నారన్న అంశంపై జరిగిన ఒక అధ్యయనంలో గేమ్ ఆఫ్ త్రోన్స్ రెండవ స్థానం పొందింది. (సగటున 14 మరణాలతో).[7]

థీమ్స్ మార్చు

సీరీస్ మధ్యయుగాల వాస్తవికతను ప్రతిబింబిస్తున్నందుకు ప్రశంసలు పొందింది.[8] జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ కథను సమకాలీన ఫాంటసీలా కాక చారిత్రిక కల్పనలా అనిపించేందుకు తగ్గ విధంగా రూపకల్పన చేశారు. మాయ మంత్రజాలాలకు తక్కువ ప్రధాన్యత, యుద్ధాలకు, రాజకీయ తంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎపిక్ ఫాంటసీ జాన్రాలో మాయాజాలాన్ని కొంతవరకే ఉపయోగించాలన్న దృక్పథంతో ఇలా చేశారు.[9][10][11] బెనియాఫ్ అనే విమర్శకుడు - జార్జ్ కటువైన వాస్తవికతను హై ఫాంటసీలోకి తీసుకువచ్చాడు. నలుపు-తెలుపుల ఊహా ప్రపంచంలోకి గ్రే ఛాయలు తీసుకువచ్చాడని పేర్కొన్నాడు.

మంచి-చెడుల మధ్య పోరాటం అన్నది ఫాంటసీ జాన్రాలో సాధారణమైన థీమ్, కానీ అది నిజజీవితానికి ప్రతిబింబం కాదంటాడు రచయిత మార్టిన్.[12] నిజజీవితంలో మంచిగానూ, దుర్మార్గంగానూ కూడా అదే మనిషి ఉండగలిగినట్టుగా, విముక్తి గురించి ప్రశ్నలు, పాత్రల మార్పుల గురించీ మార్టిన్ అన్వేషించసాగాడు.[13] చాలా ఫేంటసీలకు భిన్నంగా ఈ సీరీస్ వివిధ పాత్రలను వాటి వాటి దృక్కోణాల నుంచి చూసేందుకు వీలిస్తుంది. కాబట్టి ప్రతినాయకులు కూడా కథను వారి వైపు నుంచి చెప్పే వీలు దొరుకుతుంది.[14]

References మార్చు

🔥 Top keywords: