గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. 1955లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారిపేటలో కొంత భాగంతో గిద్దలూరు నియోజకవర్గంగా ఏర్పడింది.[1] గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ) లు కలిసి నాలుగుసార్లు గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు మూడుసార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, జనతాపార్టీ, ప్రజారాజ్యం పార్టీలు చెరోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులే మొదటి నుండి గెలుస్తూ ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో కెళ్ళా అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో రాయలసీమ ప్రభావం ఎక్కువ.[2]

గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°22′48″N 78°55′12″E మార్చు
పటం

2007 ఓటర్ల నమోదు ప్రకారం నియోజక వర్గంలో సుమారు లక్షా 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో కాపులు 27 శాతం, రెడ్లు 21 శాతం, కమ్మ 4 శాతం, ఎస్సీలు 12 శాతం, ముస్లిం, మైనారిటీలు 15 శాతం, ఇతర బి.సి కులాలు 21 శాతం ఉన్నారు.

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

2007 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంభం శాసనసభా నియోజకవర్గాన్ని రద్దు చేసి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు.

ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు

మార్చు
సంవత్సరంమొత్తం ఓట్లుపోలైన ఓట్లుచెల్లిన ఓట్లుఎన్నికైన అభ్యర్థిపార్టీఓట్లుసమీప ప్రత్యర్థిప్రత్యర్థి పార్టీఓట్లు
195552,24534,561పిడతల రంగారెడ్డికాంగ్రెస్ పార్టీ21,469తుపాకుల బసవయ్యసి.పి.ఐ13,092
196279,92151,53649,564ఈదుల బలరామిరెడ్డిస్వతంత్ర అభ్యర్థి25,630పిడతల రంగారెడ్డికాంగ్రెస్ పార్టీ23,934
196771,51050,95749,144దప్పిలి పాండురంగారెడ్డిస్వతంత్ర అభ్యర్థి29,970అడపాల రామస్వామిస్వతంత్ర అభ్యర్థి13,832
197276,98453,23052,358పిడతల రంగారెడ్డికాంగ్రెస్ పార్టీ43,706జె.వి.నారాయణస్వతంత్ర పార్టీ6,168
197891,38965,01762,110పిడతల రంగారెడ్డిజనతా పార్టీ30,705ముడియం పీరారెడ్డికాంగ్రెస్ పార్టీ20,533
198397,12864,01262,902ముడియం పీరారెడ్డితెలుగుదేశం పార్టీ32,853పిడతల రంగారెడ్డికాంగ్రెస్ పార్టీ30,049
19851,03,52068,87867,792పిడతల రంగారెడ్డిస్వతంత్ర అభ్యర్థి40,579ముడియం పీరారెడ్డికాంగ్రెస్ పార్టీ24,315
19891,23,05780,88478,431యాళ్లూరి వెంకటరెడ్డికాంగ్రెస్ పార్టీ45,694పిడతల విజయకుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ31,774
19941,03,82073,81972,238పిడతల రాంభూపాల్ రెడ్డితెలుగుదేశం పార్టీ29,496ముడియం పీరారెడ్డిస్వతంత్ర అభ్యర్థి20,035
19991,24,20780,52378,213పిడతల విజయకుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీ38,136పగడాల రామయ్యకాంగ్రెస్ పార్టీ34,954
2001 (ఉ.ఎ) [3]84,50384,503పిడతల సాయికల్పనారెడ్డితెలుగుదేశం పార్టీ53,919ముడియం పీరారెడ్డికాంగ్రెస్ పార్టీ28,814
2004పగడాల రామయ్యకాంగ్రెస్ పార్టీపిడతల సాయికల్పనారెడ్డితెలుగుదేశం పార్టీ
2009అన్నా వెంకట రాంబాబుప్రజారాజ్యం పార్టీ55282బి.చంద్రశేఖర్కాంగ్రెస్ పార్టీ47857
2014ముత్తుముల అశోక్ రెడ్డివైసీపీ94413అన్నా వెంకట రాంబాబుతెలుగుదేశం పార్టీ81520
2019అన్నా వెంకట రాంబాబువైసీపీ133,111ముత్తుముల అశోక్ రెడ్డితెలుగుదేశం పార్టీ52,076

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. http://www.suryaa.com/showdistricts.asp?category=4&subCategory=17&ContentId=13982[permanent dead link]
  2. http://www.suryaa.com/showdistricts.asp?category=4&subCategory=17&ContentId=12417[permanent dead link]
  3. శాసనసభ్యుడు పిడతల విజయకుమార్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు జరిగాయి
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా