చేపలు పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం గాలం. దీనిని లోహంతో తయారు చేస్త్రారు. పట్టే చేపల పరిమాణాన్ని బట్టి గాలం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలాన్ని ఆంగ్లంలో ఫిష్ హుక్ అంటారు. గాలం కొక్కెము ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది. కట్టిన దారం జారిపోకుండా ఒక వైపు రింగు వలె లేక వెడల్పుగా ఉంటుంది. సూదిగా ఉన్న గాలానికి ఎరను సులభంగా గుచ్చవచ్చు, కాని ఎర గాలము నుంచి తప్పించుకోవడానికి సూదిమొన దగ్గర ఉన్న చీలిక అడ్డుపడుతుంది.

గాలం యొక్క నిర్మాణం

ఎర్ర మార్చు

గాలానికి ఎర్రను గుచ్చుతారు. ఎర్ర అనగా దురుద్దేశంతో సమర్పించే ఆహారం. ఎర్ర కోసం ఎక్కువగా వానపాములను ఉపయోగిస్తారు. అందుకనే వానపాములను ఎర్రలని కూడా అంటారు.

బెండు మార్చు

చేపలు పట్టడానికి ఉపయోగించే గాలం నీళ్లలో మునుతుంది. చేపలు ఎంతలోతులో ఎక్కువగా తిరుగుతుంటాయో గాలానికి అందుబాటులో ఉంటాయో అంతలోతు మాత్రమే గాలం నీళ్లలో మునిగేలా సన్నని గట్టి దారంతో బెండును కడతారు. నీళ్లపై బెండు తేలుతుంది కాబట్టి బెండు నుంచి గాలంనకు కట్టిన దారం ఎంత పొడవు ఉంటుందో అంత లోతులో గాలం మునిగి ఉంటుంది. చేప గాలానికి తగిలించిన ఎర్రను తిన్నప్పుడు గాలం చేపనోటిలో కుచ్చుకుంటుంది. గాలానికి చిక్కిన చేప తప్పించుకోవడానికి చేసే ప్రయత్నానికి నీటిపైన తేలుతున్న బెండు లోపలికి లాగుతున్నట్లుగా కనబడుతుంది.

కర్ర మార్చు

చేపలు బావులలో, చెరువులలో, కాలువలలో పట్టేటప్పుడు గట్టుపై నిలబడి గాలాన్ని నీటి మధ్యలోకి విసరడానికి గాలానికి చిక్కిన చేపను పైకి లాగడానికి కర్రను ఉపయోగిస్తారు. కర్రకు కట్టిన దారం సన్నగా గట్టిగా అవసరమయిన పొడవుతో మధ్యన బెండును ఉంచి చివరన గాలాన్ని కడతారు.

గాలం యొక్క మరొక అర్థం మార్చు

మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ధి పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.

"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=గాలం&oldid=3877827" నుండి వెలికితీశారు
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణహేమఈనాడుతీన్మార్ మల్లన్నశ్రీ గౌరి ప్రియతెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డికార్తెవాతావరణం2024 భారత సార్వత్రిక ఎన్నికలుపవిత్ర జయరామ్తెలుగు అక్షరాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిదినేష్ కార్తీక్ఆంధ్రప్రదేశ్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిసెక్స్ (అయోమయ నివృత్తి)రామాయణంయూట్యూబ్అరుణాచలంమార్కాపురం మండలంభారతదేశంలో కోడి పందాలువికీపీడియా:Contact usకుక్కుట శాస్త్రంకావ్య మారన్షాబాజ్ అహ్మద్అంగుళంగాయత్రీ మంత్రంనక్షత్రం (జ్యోతిషం)మహేంద్రసింగ్ ధోనిద్వాదశ జ్యోతిర్లింగాలులలితా సహస్ర నామములు- 1-100సన్ రైజర్స్ హైదరాబాద్పునుగు పిల్లినితీశ్ కుమార్ రెడ్డిగౌతమ బుద్ధుడు