కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

కాకినాడ
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాగోదావరి
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుకాకినాడ
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుమల్లిపూడి మంగపతి పళ్లంరాజు
మొదటి సభ్యులుసి.హెచ్.వి.రామారావు

చరిత్ర

మార్చు

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.[1] గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు 2009-2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 2014 మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయమును చవిచూసినారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు
  1. కాకినాడ గ్రామీణ
  2. కాకినాడ పట్టణ
  3. జగ్గంపేట
  4. తుని
  5. పిఠాపురం
  6. పెద్దాపురం
  7. ప్రత్తిపాడు

నియోజకవర్గపు గణాంకాలు

మార్చు
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,15,092 [2]
  • ఓటర్ల సంఖ్య: 12,42,734
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.31%, 1.47%.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

మార్చు
లోక్‌సభపదవీకాలంగెలిచిన అభ్యర్థిపార్టీ
మొదటి1952-57సి.హెచ్.వి.రామారావుసి.పి.ఐ.
రెండవ1957-62బి. ఎస్. మూర్తి, మొసలికంటి తిరుమలరావుభారత జాతీయ కాంగ్రెస్
మూడవ1962-67మొసలికంటి తిరుమలరావుభారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ1967-71మొసలికంటి తిరుమలరావుభారత జాతీయ కాంగ్రెస్
ఐదవ1971-77మల్లిపూడి శ్రీరామ సంజీవరావుభారత జాతీయ కాంగ్రెస్
ఆరవ1977-80మల్లిపూడి శ్రీరామ సంజీవరావుభారత జాతీయ కాంగ్రెస్
ఏడవ1980-84మల్లిపూడి శ్రీరామ సంజీవరావుభారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ1984-89తోట గోపాలకృష్ణతెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91మల్లిపూడి మంగపతి పళ్ళంరాజుభారత జాతీయ కాంగ్రెస్
పదవ1991-96తోట సుబ్బారావుతెలుగుదేశం పార్టీ
పదకొండవ1996-98తోట గోపాలకృష్ణతెలుగుదేశం పార్టీ
పన్నెండవ1998-99ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుభారతీయ జనతా పార్టీ
పదమూడవ1999-04ముద్రగడ పద్మనాభంతెలుగుదేశం పార్టీ
పదునాల్గవ2004-2009మల్లిపూడి మంగపతి పళ్ళంరాజుభారత జాతీయ కాంగ్రెస్
15వ2009-2014మల్లిపూడి మంగపతి పళ్ళంరాజుభారత జాతీయ కాంగ్రెస్
16వ2014- 2019తోట నరసింహంతెలుగుదేశం పార్టీ
17వ2019 - 2024వంగా గీతవై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
18వ2024 -తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్[3]జనసేన పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నిక ఫలితాలను చూపే "పై" చిత్రం

  మల్లిపూడి పల్లం రాజు (49.38%)
  ముద్రగడ పద్మనాభం (42.5%)
  చంద్రావతి ద్వారంపూడి (3.62%)
  పూగల అప్పారావు (1.97%)
  ఇతరులు (4.43%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కాకినాడ
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్మల్లిపూడి పల్లం రాజు మంగపాటి410,98249.38+9.69
తెలుగుదేశం పార్టీముద్రగడ పద్మనాభం353,73042.50-11.14
Independentచంద్రావతి ద్వారంపూడి30,1533.62
బహుజన సమాజ్ పార్టీపూగల అప్పారావు16,3731.97
కమ్యూనిస్టు పార్టీ పాహ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్నైనాలశెట్టి మూర్తి9,4581.13+0.04
Independentపువ్వుల ఆనందరావు8,5441.03
Independentచాగంటి సూర్యనారాయణ మూర్తి3,0440.37
మెజారిటీ57,2526.88+21.83
మొత్తం పోలైన ఓట్లు832,28468.44+2.90
భారత జాతీయ కాంగ్రెస్ holdSwing+9.69

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బిక్కిన విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.ఎం.పళ్ళంరాజు పోటీలో ఉన్నాడు.[5]

సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
200923కాకినాడజనరల్ఎం.ఎం.పల్లంరాజుపుకాంగ్రెస్323607చలమలశెట్టి సునీల్పుప్ర.రా.పా289563

2014 ఎన్నికలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2014: కాకినాడ [6]
PartyCandidateVotes%±%
తెలుగుదేశం పార్టీతోట నరసింహం514,40246.76+20.04
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీసునీల్ కుమార్ చలమలసెట్టి[7]510,97146.45
భారత జాతీయ కాంగ్రెస్మల్లిపూడి మంగపతి పల్లంరాజు19,7541.80
RPI (K)మోత శారద6,8360.62
CPI(ML)Lయేగుపాటి అర్జునరావు1,4950.14
BSPముతాబత్తుల రత్నకుమార్2,5110.23
AAPశ్రీనివాస్ దంగేటి2,3560.21
None of the aboveNone of the Above41,6743.8
మెజారిటీ3,4310.31
మొత్తం పోలైన ఓట్లు1,099,99977.59+1.27
తెదేపా gain from INCSwing

మూలాల విభాగం

మార్చు
  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  3. Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  6. "KAKINADA LOK SABHA (GENERAL) ELECTIONS RESULT". Archived from the original on 2016-04-11. Retrieved 2016-05-19.
  7. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా