కళింగ (చారిత్రక భూభాగం)

భారతదేశపు చారిత్రక ప్రాంతం

భారతదేశపు చారిత్రక ప్రాంతంలో కళింగ ఒకటి. ఇది సాధారణంగా మహానది, గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతంగా నిర్వచించబడింది. అయినప్పటికీ దాని సరిహద్దులు దాని వైవిధ్యమైన పాలకుల పాలనలో భూభాగ వైశాల్యం హెచ్చుతగ్గులకు గురైంది. కళింగ ప్రధాన భూభాగంలో ప్రస్తుత విస్తారమైన ఒడిశా భాగం, ఆంధ్రప్రదేశు ఉత్తర భాగాన్ని అంతర్భాగంగా ఉన్నాయి. దాని శిఖరాగ్రస్థాయిలో కళింగ ప్రాంతం ప్రస్తుత ఛత్తీసుగఢులో కొంత భాగాన్ని కూడా కలిగి ఉంది.

పటం
Extreme points of Kalinga, as mentioned in the historical records

పురాణ గ్రంథమైన మహాభారతంలో కళింగాలను ప్రధాన తెగగా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలో కళింగ యుద్ధం ఫలితంగా ఈ ప్రాంతం మౌర్య నియంత్రణలోకి వచ్చింది. దీనిని తరువాత అనేక ప్రాంతీయ రాజవంశాలు పాలించాయి. దీని పాలకులు కళింగాధిపతి ("లార్డు ఆఫ్ కళింగ") అనే బిరుదును కలిగి ఉన్నాడు; ఈ రాజవంశాలలో మహామేఘవాహన, వసిష్ఠ, మాతారా, పిత్రాభక్తా, శైలోద్భవ, సోమవంశి, తూర్పు గంగా వంశాలు ఉన్నాయి. భౌమా-కరాలు మరొక ముఖ్యమైన ప్రాంతీయ రాజవంశం అయినప్పటికీ వారు తమ రాజ్యాన్ని కళింగ అని పిలవలేదు. వివిధ సమయాలలో కళింగ ప్రాంతం కూడా పెద్ద సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. తూర్పు గంగా తరువాత కళింగ క్రమంగా దాని ప్రత్యేక రాజకీయ గుర్తింపును కోల్పోయింది.

విస్తరణ మార్చు

కళింగ ప్రాంతాన్ని సాధారణంగా మహానది, గోదావరి నదుల మధ్య ఉన్నతూర్పు తీర ప్రాంతంగా నిర్వచించారు. అయినప్పటికీ చరిత్రలో వివిధ సమయాల్లో దాని ఖచ్చితమైన సరిహద్దులు హెచ్చుతగ్గులకు గురయ్యాయి.[1]

పురాతన భారతీయ సాహిత్యంలో కళింగ ప్రాంతంలో ఒరిస్సాలోని గంజాం జిల్లా, ఆంధ్రప్రదేశు సరిహద్దుకు సమీపంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంతో సంబంధం కలిగి ఉంది.[2]

కొన్ని సమయాలలో కళింగ కృష్ణానది దక్షిణ సరిహద్దు వరకు మరింత విస్తరించింది. ఉత్తరాన ఇది కొన్నిసార్లు మహానది దాటి వైతరణి నది వరకు విస్తరించింది. కళింగ ప్రాంతం ప్రస్తుతం ఒడిశా మొత్తం భూభాగం లేదు: ఒరిసా ఈశాన్య భాగం ప్రత్యేకమైన ఉత్కళ ప్రాంతంలో చేర్చబడింది.[3]

ఉత్కళప్రాంతం క్రమంగా తన గుర్తింపును కోల్పోయి కళింగలో భాగంగా పరిగణించబడింది.[4]

కళింగ తూర్పు సరిహద్దు సముద్రం (బెంగాల్ బే) వరకు విస్తరించింది. దాని పశ్చిమ సరిహద్దును గుర్తించడం కష్టం. ఎందుకంటే ఇది దాని పాలకుల రాజకీయ శక్తితో మారుతూ ఉంటుంది. అయినప్పటికీ కళింగ పశ్చిమాన అమరకాంతక కొండల వరకు విస్తరించిందని పురాణ సాహిత్యం సూచిస్తుంది.[5]

అనేక పురాతన శాసనాలు "త్రికలింగ" అనే పదాన్ని ప్రస్తావించాయి. దీనిని అనేక విధాలుగా అన్వయించారు. ఒక సిద్ధాంతం ఆధారంగా త్రికలింగ కళింగ విస్తార పరిధిని సూచిస్తుంది. అయినప్పటికీ తూర్పు చాళుక్య రికార్డులు కళింగ, త్రికలింగ రెండు విభిన్న ప్రాంతాలు అని సూచిస్తున్నాయి. కళింగకు పశ్చిమాన కొండ ప్రాంతాన్ని త్రికలింగ ప్రాంతంగా సూచిస్తుంది.[6]

చరిత్ర మార్చు

ఈ ప్రాంతం పేరు అదే పేరుగల తెగ నుండి వచ్చింది. పురాణ గ్రంథం మహాభారతం ఆధారంగా కళింగుల పూర్వీకులు, వారి పొరుగు తెగల సోదరులు. ఈ పొరుగువారిలో అంగాలు, వంగాలు, పుండ్రాలు, సుహ్మాలు ఉన్నారు.[7]

కళింగులు ఒడిశాలోని వైతరిణి నది నుండి విశాఖపట్నం జిల్లాలోని వరాహనంది వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని ఆక్రమించారు.[8] పురాతన కాలంలో దీని రాజధాని దంతకురా లేదా దంతపుర నగరం (ప్రస్తుతం గంజాం జిల్లాలోని చికాకోలు సమీపంలో ఉన్న దంత్రవక్త కోట, లంగులియా (లంగులిని) నది చేత కొట్టుకుపోయింది).[8]

నందిరాజ అనే రాజు గతంలో అక్కడ ఒక జలాశయాన్ని త్రవ్వినట్లు హతిగుంప శాసనం సూచిస్తుంది. నందరాజవంశం రాజును నందరాజుగా సూచిస్తున్నాడని ఊహిస్తే కళింగ ప్రాంతం ఏదో ఒక సమయంలో నందులచేత ఆక్రమించబడిందని తెలుస్తుంది.[9] ఇది నందుల పతనం తరువాత మళ్ళీ స్వతంత్రంగా మారినట్లు కనిపిస్తుంది. దీనిని మెగస్తనీసు ఇండికాలో (క్రీ.పూ. 3 వ శతాబ్దం) "కాలింగే" గా వర్ణించారు:

ప్రినాసు, కైనాసు (గంగా ఉపనది) రెండూ నౌకాయానానికి అనుకూలంగా ఉండే నదులు. గంగానదీ తీరంలో నివసించే తెగలలోని కాలింగే ప్రజలు సముద్రానికి సమీపంలో ఉన్నాయి. మండే (మల్లి) పైన ఎత్తైనప్రాంతంలో ఉన్నారు. వీరిలో మల్లసు పర్వతం కూడా ఉంది. ఈ ప్రాంతానికి గంగా సరిహద్దుగా ఉంది

—-మెగాస్తేన్స్ ఫ్రాగ్. XX.B. ప్లినీలో. హిస్ట్. Nat. V1. 21.9-22. 1.[10]

కాలింగే రాజ నగరాన్ని పార్థాలిసు అంటారు. వారి రాజుకు 60,000 మంది సైనికులు, 1,000 మంది గుర్రపు సైనికులు, 700 ఏనుగులు "యుద్ధ ప్రాంగణంలో" చూస్తూ ఉంటారు

—-మెగాస్తేన్స్ ఫ్రాగ్. LVI. ప్లిన్లో. హిస్ట్. Nat. VI. 21. 8–23. 11.[10]

క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలో కళింగను మౌర్య చక్రవర్తి అశోకుడు సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. మౌర్య భూభాగం కళింగ ప్రధాన కార్యాలయం తోసాలిలో ఉంది. మౌర్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత ఈ ప్రాంతం మహామేఘవాహన కుటుంబం నియంత్రణలోకి వచ్చింది. దీని రాజు ఖరవేల తనను తాను "కళింగ సుప్రీం ప్రభువు" గా అభివర్ణించాడు.[2]

4 వ శతాబ్దంలో కళింగ గుప్తా ఆధిపత్యం కిందకు వచ్చింది. గుప్తుల ఉపసంహరణ తరువాత, దీనిని అనేక చిన్న రాజవంశాలు పరిపాలించాయి. దీని పాలకులు కళింగధిపతి ("కళింగ ప్రభువు") అనే బిరుదును కలిగి ఉన్నారు.[11]

7 వ శతాబ్దంలో శైలోద్భవ రాజు రెండవ మాధవరాజా, తూర్పు గంగా రాజు ఇంద్రవర్మను సకల-కళింగాధిపతి అనే బిరుదును పొందారు.[12]

8 వ -10 వ శతాబ్దాలలో భౌమా-కారా రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. అయినప్పటికీ వారు తమ రాజ్యాన్ని "తోసాలా" అని పిలిచారు (కళింగ పురాతన రాజధాని తోసాలి నుండి తీసుకోబడింది).[13] తరువాతి సోమవంశి రాజులు తమను కళింగ, కోసల, ఉత్కళ ప్రభువు అని పిలిచారు.[14]

11 వ -15 వ శతాబ్దంలో తూర్పు గంగా ఈ ప్రాంతంలో ఆధిపత్య శక్తిగా మారింది. కళింగాధిపతి అనే బిరుదు ఉంది. వారి రాజధాని మొదట కళింగనగర (ఆధునిక ముఖలింగం) వద్ద ఉంది. తరువాత 12 వ శతాబ్దంలో అనంతవర్మను చోదగంగా పాలనలో కటకా (ఆధునిక కటకు) కు బదిలీ చేయబడింది.[15]

శ్రీలంక పురాణ చరిత్రలో కళింగ కూడా ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది మహావంశం ప్రకారం పురాణ యువరాజు విజయ జన్మస్థలం.[16]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వనరులు మార్చు

🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణఘట్టమనేని కృష్ణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డికార్తెఈనాడుసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంతెలుగుఅందెశ్రీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమజ్జయంతిఆంధ్రప్రదేశ్ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంవికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియఎల్లోరా గుహలుహనుమంతుడురామాయణంతెలుగు అక్షరాలుఅహల్యా బాయి హోల్కర్యూట్యూబ్మహాభారతంకుక్కుట శాస్త్రంప్రజ్వల్ రేవణ్ణరాణి గారి బంగళాగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిద్వాదశ జ్యోతిర్లింగాలుతెలంగాణతెలంగాణ ఉద్యమంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ అవతరణ దినోత్సవంస్త్రీతెలుగు సినిమాలు 2024జయ జయహే తెలంగాణభారతదేశంలో కోడి పందాలుగాయత్రీ మంత్రం