ఇయాన్ బోథం

1955, నవంబర్ 24న జన్మించిన ఇయాన్ బోథం (Ian Botham) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ ప్రతిభ చూపి 14 సెంచరీలు, 383 వికెట్లు సాధించాడు. అనేక టెస్ట్ క్రికెట్ రికార్డులను సృష్టించిన బోథం రిటైర్‌మెంట్ అయి 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంగ్లాండు తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా తన రికార్డును నిలబెట్టుకున్నాడు.

సర్ ఇయాన్ బోథం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Sir Ian Terence Botham OBE
పుట్టిన తేదీ (1955-11-24) 1955 నవంబరు 24 (వయసు 68)
Heswall, Cheshire, England
మారుపేరుBeefy, Both, Guy[1]
ఎత్తు6 ft 2 in (1.88 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm fast-medium
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 474)1977 జూలై 28 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1992 జూన్ 18 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 33)1976 ఆగస్టు 26 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1992 ఆగస్టు 24 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974–86Somerset
1987–88Queensland
1987–91Worcestershire
1992–93Durham
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు102116402470
చేసిన పరుగులు520021131939910474
బ్యాటింగు సగటు33.5423.2133.9729.50
100లు/50లు14/220/938/977/46
అత్యుత్తమ స్కోరు20879228175*
వేసిన బంతులు2181562716354722899
వికెట్లు3831451172612
బౌలింగు సగటు28.4028.5427.2224.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు270593
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు4n/a8n/a
అత్యుత్తమ బౌలింగు8/344/318/345/27
క్యాచ్‌లు/స్టంపింగులు120/–36/–354/–196/–
మూలం: [1], 2007 ఆగస్టు 22
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుIan Botham
ఆడే స్థానంCentre half
సీనియర్ కెరీర్*
సంవత్సరాలుజట్టుApps(Gls)
1978–80Yeovil Town17(1)
1980–85Scunthorpe United11(0)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

ఇయాన్ బోథం 102 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 33.54 సగటుతో 5200 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 28.40 సగటుతో 383 వికెట్లను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 208 పరుగులు. 14 సెంచరీలు, 22 అర్థసెంచరీలు నమోదుచేశాడు. బౌలింగ్‌లో ఒకే ఇన్నింగ్సులో ఐదేసి వికెట్లను 27 సార్లు, ఒకే టెస్టులో పదేసి వికెట్లను 4 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 8 వికెట్లు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

బోథం 116 వన్డేలలో ఇంగ్లాండు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 23.21 సగటుతొ 2113 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలో అతని అత్యధిక స్కోరు 79 పరుగులు. బౌలింగ్‌లో 28.54 సగటుతో 145 వికెట్లను పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 31 పరుగులకు 4 వికెట్లు.

ప్రపంచ కప్ పోటీలు మార్చు

ఇయాన్ బోథం 3 సార్లు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. 1979లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించగా, 1983లో జరిగిన మూడవ ప్రపంచ కప్‌లో విల్లీస్ నేతృత్వంలో పాల్గొన్నాడు. 1992లో గ్రాహం గూచ్ నేతృత్వంలోని ఇంగ్లాండు జట్టుకు చివరిసారిగా ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

అవార్డులు మార్చు

  • 1978లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనాడు.
  • 1981లో బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

సాధించిన రికార్డులు మార్చు

  • అతి తక్కువ టెస్టులలో 1000 పరుగులు, 100 వికెట్లు; 2000 పరుగులు, 200 వికెట్లు; 3000 పరుగులు, 300 వికెట్లు సాధించిన రికార్డు సృష్టించాడు.
  • అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన రికార్డు సృష్టించిననూ అది తరువాతి కాలంలో పలువురిచే ఛేదించబడింది. అయిననూ అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఇంగ్లాండు బౌలర్‌గా ఇంకనూ రికార్డు ఇతని పేరిటే కొనసాగుతోంది.
  • ఒకే ఇన్నింగ్సులో సెంచరీ, 5 వికెట్లను 5 పర్యాయాలు సాధించి ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.
  • 1980లో భారత్‌పై ఒకే టెస్టులో 10 వికెట్లు, సెంచరీ సాధించి ఈ ఘనత పొందిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
  • 1981లో ఒకే టెస్టులో 6 సిక్సర్లు సాధించి రికార్డు సృష్టించాడు. తరువాత ఈ రికార్డు అధికమించబడింది.

మూలాలు మార్చు

  1. "Ian Botham". espncricinfo. Retrieved ఏప్రిల్ 18 2012. {{cite web}}: Check date values in: |accessdate= (help)

బయటి లింకులు మార్చు

🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్మొదటి పేజీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీ ఫిల్మ్ సిటీపవన్ కళ్యాణ్మనమేతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీనందమూరి బాలకృష్ణకింజరాపు రామ్మోహన నాయుడుచిరాగ్ పాశ్వాన్రేణూ దేశాయ్కార్తెచేప ప్రసాదంవాతావరణంతెలుగునరేంద్ర మోదీఉషాకిరణ్ మూవీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.భారతిభారత కేంద్ర మంత్రిమండలిఅందెశ్రీశివ ధనుస్సుతెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్తెలుగు అక్షరాలునందమూరి తారక రామారావురాజ్యసభచిరంజీవివికీపీడియా:Contact usగాయత్రీ మంత్రం