అయనీకరణం

అయనీకరణం అంటే ఒక పరమాణువు లేదా అణువు ఎలక్ట్రాన్లను కోల్పోవడం లేదా చేర్చుకోవడం వలన ధనావేశం లేదా ఋణావేశాన్ని పొందడం.[1] ఇందులో భాగంగా అవి చాలా సార్లు రసాయనిక మార్పుకు కూడా లోనవుతాయి. దీని ఫలితంగా ఏర్పడే విద్యుదావేశం కలిగిన పరమాణువు లేదా అణువులను అయాన్లు అంటారు. సాధారణంగా పరమాణువు లోపలి కణాలు ఒకదానితో ఒకటి గుద్దుకోవడం వలన, పరమాణువులు మరో పరమాణువు, అణువు లేదా అయాన్లతో ఢీకొనడం, లేదా విద్యుదయస్కాంత వికిరణానికి లోనవడం లాంటి వాటి వల్ల అయనీకరణం జరగవచ్చు. రేడియో ధార్మిక క్షీణతలో భాగంగా అంతర్గతంగా జరిగే చర్యల వల్ల కేంద్రకం తన శక్తిని దగ్గర్లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఇచ్చి బయటికి వెళ్ళేలా చేసి అయనీకరణానికి కారణమవుతుంది.

సూర్యుని నుంచి వచ్చే గాలి భూవాతావరణంలో ధ్రువ ప్రాంతాల్లో పరమాణువులను అయాన్లుగా మార్చడం వలన అవి వివిధ రకాల రంగులకు వెదజల్లి అరోరాలుగా ఏర్పడతాయి.
సూర్యుని నుంచి వచ్చే గాలి భూవాతావరణంలో ధ్రువ ప్రాంతాల్లో పరమాణువులను అయాన్లుగా మార్చడం వలన అవి వివిధ రకాల రంగులకు వెదజల్లి అరోరాలుగా ఏర్పడతాయి.

మూలాలు

మార్చు
  1. "ionization | Definition, Examples, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపవన్ కళ్యాణ్వాతావరణంప్రత్యేక:అన్వేషణవై. శ్రీలక్ష్మిపితృ దినోత్సవంనారా చంద్రబాబునాయుడుప్రకృతి - వికృతిశ్రీకృష్ణార్జున యుద్ధముసంస్కృతాంధ్ర వ్యాకరణములుస్త్రీసరస్వతిఈనాడుఅన్నాలెజినోవాఈదుల్ అజ్ హాతెలుగువికీపీడియా:Contact usబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపెమ్మసాని చంద్ర శేఖర్నైపుణ్యంసత్యభామపవిత్ర గౌడయమునా నదివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపక్షముతెలుగు అక్షరాలుతెలుగుదేశం పార్టీగాయత్రీ మంత్రంమహాభారతంకుక్కుట శాస్త్రంపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుపెళ్ళి పుస్తకంశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాపోలవరం ప్రాజెక్టు