రాజీవ్ గాంధీ

భారత మాజీ ప్రధాన మంత్రి

రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1][2]

రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ


6వ భారత ప్రధానమంత్రి
1984-1989
పదవీ కాలం
1984-1989
ముందుఇందిరా గాంధీ
తరువాతవి.పి.సింగ్
నియోజకవర్గంఅమేథీ , ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననంఆగష్టు 20 , 1944
ముంబై , మహారాష్ట్ర
India భారత్
మరణంమే 21 , 1991
శ్రీపెరుంబుదూరు , తమిళనాడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామిసోనియా గాంధీ
సంతానంప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ
నివాసంన్యూ ఢిల్లీ
మతంహిందూ
జులై,31, 2008నాటికి

తొలినాటి జీవితం, విద్య: మార్చు

  • తాత నెహ్రూ, తల్లి ఇందిరా, తమ్ముడు సంజయ్ తో రాజీవ్ గాంధీ
    1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
  • అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
  • 1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.

రాజకీయ జీవితం: మార్చు

రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరా గాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పిదప, 1983లో, అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 31 అక్టోబర్ 1984న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగాడు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.  రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు (PCC), పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు. మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ముగిసింది .

ప్రధానమంత్రిగా మార్చు

రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.

మరణం మార్చు

రాజివ్ గాంధీ సమాధి - వీర భూమి

1991 మే 21న, రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యయ్యాడు.

వారసత్వం మార్చు

భారతదేశ ఆధునిక చరిత్రలో రాజీవ్ గాంధీ ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆధునిక భారతాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తుంచుకోవడం జరుగుతుంది.

ఇవికూడా చూడండి మార్చు


ఇంతకు ముందు ఉన్నవారు:
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి
31/10/1984—2/12/1989
తరువాత వచ్చినవారు:
వి.పి.సింగ్

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
  2. విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్