బంద్ నిజానికి ఒక హిందీ పదం, దీని అర్థం మూసివేయడం. ఇది భారతదేశం, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో రాజకీయ ఉద్యమకారులు ఉపయోగించే ఒక నిరసన యొక్క ఒక రూపం. బంద్ సమయంలో ఒక రాజకీయ పార్టీ లేదా ఒక సంఘం సాధారణ సమ్మె ప్రకటిస్తుంది. భారత్ బంద్ అని ప్రకటిస్తే భారతదేశం అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, రాష్ట్ర బంద్ అని ప్రకటిస్తే రాష్ట్రం అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, జిల్లా బంద్ అని ప్రకటిస్తే జిల్లా అంతటా బంద్ చేయాలని సూచించినట్టు, ఈ విధంగా బంద్ ఒక నిర్ధిష్ట ప్రాంతంలో చేయాలని ముందుగా ప్రకటిస్తారు. తరచుగా సంఘం లేదా రాజకీయ పార్టీ బంద్ ప్రకటించినప్పుడు సాధారణ ప్రజలు కార్యాలయ పనులు మాని ఇంటి వద్దే ఉండాలని ఆశిస్తారు. అత్యంత ప్రభావం దుకాణదారులపై పడుతుంది, బంద్ చేసేవారు బంద్ సమయములో దుకాణాలు మూయమని చెబుతారు, అలాగే ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే వాహనదారులకు వాహనాలు నడపవద్దని చెబుతారు. బంద్ అనగా శక్తివంతమైన అర్థములో శాసనోల్లంఘన. ఎందుకంటే నిరసన సాధనలలో బంద్ చాలా భయానకమైనది, స్థానిక సమాజంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

బంద్ అనగా మూసివేయడం. బంద్ సమయంలో ఎటువంటి ఆర్థిక పరమైన లావాదేవిలు జరగకుండా నిర్భంధించడం. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని స్వచ్ఛంద బంద్ అని, బలవంతంగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే దానిని నిర్భంధ బంద్ అని అంటారు. ప్రభుత్వంపై తమ తీవ్రమైన వ్యతిరేకతా భావాన్ని ఈ రూపంలో ప్రదర్శిస్తారు.

"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=బంద్&oldid=2888557" నుండి వెలికితీశారు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు