ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్

ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ అనగా ఫ్రాన్స్ లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టరు. దీనిని అత్యంత కీలక పాత్ర వహిస్తున్న భారత్ సహా 35 దేశాలు కలిసి రూ.1.22 లక్షల కోట్లతో స్వచ్ఛ అణువిద్యుత్ కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి. ఈ రియాక్టర్ నిర్మాణం 2021 నాటికి పూర్తయ్యేలా భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఈయూ, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసామూ మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 లో 800 మంది శాస్త్రవేత్తలు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. సూర్యునిలో నిరంతరం మండుతూ ఏవిధంగా వేడి ఉత్పన్నమవుతుందో అటువంటి ప్రక్రియను ఈ అణురియాక్టర్ లో జరిపి విడుదలయ్యిన వేడితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు. దశాబ్దాలుగా ఎదురుచూసి నిర్మించతలపెట్టిన మొట్టమొదటి "కేంద్రక సంలీన అణు రియాక్టర్" ఇది. ఈ రియాక్టర్ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తితో తయారు చేసే విద్యుత్ స్వచ్ఛమైన విద్యుత్‌, దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు ఏర్పడవు, నియంత్రించడం సులభం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండదు.

ITER Exhibit (01810402) (12219071813) (cropped).jpg
ITER -ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ నమూనా

కేంద్రక సంలీనం

మార్చు

కేంద్రక సంలీనం అనగా రెండు లఘు పరమాణువుల కేంద్రకాలు సంలీనం చెంది ఒకే ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే ఈ పరమాణువులు కలిసి పెద్దగా ఒకే ఒక కేంద్రకంగా ఏర్పడిన ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో విచ్ఛిన్నమైన ద్రవ్యరాశి శక్తిగా జనిస్తుంది. కేంద్రక సంలీన చర్య సూర్యునిలో నిరంతరం జరుగుతుండటం వలన శక్తి అనంతంగా జనిస్తూ ఉంటుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువు గా ఏర్పడుతూ అనంతశక్తి జనిస్తూ ఉంటుంది.

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 30-10-2014 - (స్టీలుడబ్బాలో సూర్యగోళం! - ఫ్రాన్స్‌లో అతిపెద్ద కేంద్రక సంలీన అణురియాక్టర్)
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా