ఛార్మీ కౌర్

సినీ నటి

ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబాయిలో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది.

ఛార్మి

జన్మ నామంఛార్మి కౌర్
జననంమే 17, 1986
పంజాబ్, ఇండియా
క్రియాశీలక సంవత్సరాలు2001 నుండి
భార్య/భర్తఅవివాహిత

తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.

2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఛార్మి నటించిన సినిమాలు మార్చు

సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుఇతర నటీ నటులుదర్శకుడుభాష
2013సేవకుడుశ్రీకాంత్వి. సముద్రతెలుగు
2005జ్యోతిలక్ష్మీజ్యోతిలక్ష్మీసత్యదేవ్ కంచరానపూరి జగన్నాధ్తెలుగు
2009మనోరమగీతాంజలి/గిలినిషాన్వి.ఈశ్వరరెడ్డితెలుగు
2008సకుటుంబ సపరివార సమేతంశ్రీకాంత్తెలుగు
ఇంకా పేరు పెట్టని ద్విభాషా చిత్రం (నిర్మాణంలో ఉంది)అరవింద్తెలుగు, తమిళం
మైకేల్ మదన కామరాజుశ్రీకాంత్, ప్రభు దేవా'నిధి' ప్రసాద్తెలుగు
సుందరకాండపింకీఅల్లరి నరేష్బాపుతెలుగు
2007మంత్రమంత్రశివాజీ, కౌషతులసీ రామ్తెలుగు
లవ కుశఉపేంద్ర, శివరాజ్ కుమార్, జెన్నిఫర్ కొత్వాల్, రుతికఓం సాయి ప్రకాష్కన్నడం
2006రాఖీగౌరిఎన్. టి. ఆర్. జూనియర్కృష్ణ వంశీతెలుగు
చిన్నోడుసుమంత్కన్మణితెలుగు
పౌర్ణమిచంద్రకళప్రభాస్, త్రిషప్రభు దేవాతెలుగు
స్టైల్లారెన్స్, ప్రభు దేవా, కమలిని ముఖర్జీలారెన్స్తెలుగు
లక్ష్మీశైలజవెంకటేష్, నయన తారవి. వి. వినాయక్తెలుగు
చుక్కల్లో చంద్రుడుసంధ్యసిద్ధార్థ్, సదా, సలోనిశివకుమార్తెలుగు
2005అల్లరి పిడుగుసుబ్బలక్ష్మిబాల కృష్ణ, కత్రినా కైఫ్జయంత్ పరాంజీతెలుగు
పొలిటికర్ రౌడీకావేరిమోహన్ బాబు, అబ్బాస్, ప్రకాష్ రాజ్తెలుగు
అనుకోకుండా ఒక రోజుసహస్రజగపతి బాబు, శశాంక్, పూజా భారతిచంద్రశేఖర్ ఏలేటితెలుగు
చక్రంలక్ష్మిప్రభాస్, అసిన్, ప్రకాష్ రాజ్కృష్ణ వంశీతెలుగు
2004మాస్ప్రియనాగార్జునలారెన్స్తెలుగు
చంటిరవితేజశోభన్తెలుగు
గౌరిశ్వేతసుమంత్బి. వి. రమణతెలుగు
కాట్టు చంపగంమలయాళం
శ్రీ ఆంజనేయంపద్దునితిన్కృష్ణవంశీతెలుగు
2003నీకే మనసిచ్చానుశ్రీకాంత్తెలుగు
కుర్రాడొచ్చాడుశింబుటి. రాజేందర్తెలుగు
ఆహా, ఎత్నై అళగుతమిళం
2002కాదల్ అళివతిల్లైతమిళం
కాదల్ కిసు కిసుతమిళం
2001నీతోడు కావాలిమానసతెలుగు

మూలాలు మార్చు

🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్మొదటి పేజీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీ ఫిల్మ్ సిటీపవన్ కళ్యాణ్మనమేతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుఈనాడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీనందమూరి బాలకృష్ణకింజరాపు రామ్మోహన నాయుడుచిరాగ్ పాశ్వాన్రేణూ దేశాయ్కార్తెచేప ప్రసాదంవాతావరణంతెలుగునరేంద్ర మోదీఉషాకిరణ్ మూవీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.భారతిభారత కేంద్ర మంత్రిమండలిఅందెశ్రీశివ ధనుస్సుతెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్తెలుగు అక్షరాలునందమూరి తారక రామారావురాజ్యసభచిరంజీవివికీపీడియా:Contact usగాయత్రీ మంత్రం