ఖురాన్ : కురాన్, ఖొరాన్, ఖుర్‌ఆన్, ఖొర్ఆన్, కొరాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

  • కురాన్ అరబ్బీ భాషలో అల్లాహ్ (దేవుడు) ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). ప్రవక్త ద్వారా మానవాళికి పంపిన ఇస్లాం మతము యొక్క చివరి పవిత్ర గ్రంథము. ఖుర్ఆను గ్రంథం దాదాపు 1400 సంవత్సరాలకు పూర్వం కారుణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్ (స)పై రమజాను మాసంలో అవతరించింది. దాదాపు ఇరవైమూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఈ గ్రంథం మానవుల అవసరాలకు, ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా సందేశాలను మోసుకొచ్చింది.
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ · ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఒక పవిత్ర ఖుర్‌ఆన్ గ్రంథం ముఖచిత్రం 'అల్-ఖుర్‌అన్ అల్-కరీమ్'

[1][2][3],[4][5]అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట','మాటిమాటికి చదివే' గ్రంథం అని అర్ధము.

నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంథం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీసులు) - మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక).

ముసల్మానుల నమ్మకము ప్రకారము దేవుని సందేశాలు మొదటి ప్రవక్తయైన ఆదమ్తో ప్రాంభింపబడి, షుహుఫ్ ఇ ఇబ్రాహిమ్,[6] తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన ),[7][8], జబూర్ (దావీదు కీర్తనలు),[9][10],ఇంజీల్ (క్రీస్తు సువార్త), వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖురాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంథాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది.[11][12][13].యూదు, క్రైస్తవ గ్రంథాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని.[14][15]

ఈ ఖుర్ఆను గ్రంథం ఖలీఫా ఉమర్‌బిన్ ఖత్తాబ్ (ర) చేతుల్లోకి రాగానే ఆయన హృదయంలో ఆవరించి ఉన్న కారుచీకట్లు తొలగిపోయాయి. నిజమైన ఇస్లామీ చైతన్యస్ఫూర్తి ఆయనకు కలిగింది. ఆయన 'ఫారూఖె ఆజమ్' అనే బిరుదుతో అలంకృతులయ్యారు. ఈ ఖుర్ఆను గ్రంథం తన అనుయాయులకు పటిష్ఠమైన విశ్వాసాన్ని కలిగించింది. వారి హృదయాలు దైవభక్తితో పులకించిపోయాయి. ఆ గ్రంథం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి ఆజ్ఞను వారు తు.చ. తప్పకుండా పాటించేవారు. 'ఓ ముస్లిములారా! రుకూ చేసేవారితో కలిసి మీరు కూడా రుకూ చెయ్యండి' అనే ఆజ్ఞ చెవుల్లో పడగానే వారు మసీదుల వైపు పరుగెత్తేవారు. 'వడ్డీని తీసుకోవద్దు, అది నిషిద్ధం' అనే ఆకాశవాణి విన్నంతనే వారి వడ్డీ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. 'మద్యపానం నిషిద్ధం' అనే దైవాజ్ఞ అవతరించగానే సారాయి కుండలన్నీ బద్దలైపోయాయి.

ఖురాను కు ఉన్న ఇతర పేర్లు మార్చు

వ్యాసాల పరంపరఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


కురాన్ కి ఉన్న ఇతర పేర్లు:

వరుస సంఖ్య
అరబ్బీ పేరు
అంటే అర్ధం
ఈ పేరున్న ఖురానువాక్యం కనీసం ఒకటి
1కితాబ్అల్లాహ్ గ్రంథం2:2
2కితాబ్-ఎ-ముబీన్స్పష్టమైన ఆదేశాలు గలది5:57
3హుదామార్గదర్శిని2:120
4ఫుర్‌ఖాన్గీటురాయి25:1
5బుర్‌హాన్ఆధారం, నిదర్శనం4:174
6మొయిజత్హితోపదేశం3:138
7ముసద్దిఖ్ధ్రువపచేది5:46
8బుష్రాశుభవార్త నిచ్చేది17:105
9హఖ్సత్యం10:108
10జిక్రాజ్ఞాపకంవుంచుకొనేది3:58
11ఇల్మ్జ్ఞానం2:119
12నూర్వెలుగు4:174
13హకీంవివేచననిచ్చేది36:1
14ఇబ్రత్గుణపాఠం నేర్పేది12:111
15రహ్మత్కరుణగలది6:157
16బసాయిరున్మనోనేత్రాలు తెరిచేది28:43
17షిఫారోగనివారిణి, పిచ్చికుదిర్చేది10:57, 17:82
18ముఫస్సల్సవివరమైనది6:114
19మీజాన్ధర్మకాటా42:17
20ముహైమిన్రక్షించేది5:48
21ఇమాంమార్గదర్శి, సారథి, నాయకుడు16:89
22మజీద్మహిమ గలది46:1
23కరీంగౌరవప్రథమైనది, ఉన్నతమైనది56:77
24ఖురాన్చదివేది2.185
25ముబీన్స్పష్టమైనది43.2
26కలామల్లాహ్అల్లాహ్ వాక్కులు (దేవుని మాటలు)2.75
27మౌవిజాహ్హెచ్చరించేది3.138
28అలియ్యుఉన్నతమైనది43.4
29ముబారక్దీవెనకరమైనది6.155
30భయాన్ప్రకటన3.138
31అజబ్ఆశ్చర్యకరమైనది72.1
32తజ్కిరాబుద్ధిచెప్పేది73.19
33ఉర్వతిల్ ఉత్కానమ్మకంగా నడిపించేది31.22
34సిద్క్సత్యం39.33
35హిక్మాపనిచేసే జ్ఞానం54.5
36అదల్కచ్చితమైనది6.115
37అమ్రుల్లాహ్దేవుని ఆజ్ఞ65.5
38మునాదిపిలిచేది3.193
39నజీర్గెలిచేది41.4
40అజీజ్అజేయమైనది41.41
41బలగ్సందేశమిచ్చేది14.52
42సుహుఫిమ్ ముకర్రమఘనతగల గ్రంథాలు80.13
43మర్ఫువాగొప్పది80.14
44ముసద్దిఖ్సాక్షి2.89
45బుర్హాన్ఋజువు4.174
46ముహైమిన్సంరక్షిణి5.48
47హబల్ అల్లాహ్దేవుని త్రాడు3.103
48ఫజల్ముగించేది86.13
49అహ్ సనుల్ హదీస్అందమైన దైవ సందేశం39.23
50ఖయ్యీంతిన్ననిది98.3
51మథనీసరిపడేది39.23
52ముత్షబీఅలంకారికమైనది39.23
53తంజీల్బయలుపరచినది56.80
54రూహ్ఆత్మ42.52
55వహీదైవ సందేశం21.45
56హక్కుల్ యకీన్స్థిరమైన సత్యం56.95
57అరబీఅరబ్బీలో వచ్చింది12.2

అర్ధంకాని అరబ్బీ పారాయణం కంటే మాతృభాషలో అర్ధం చేసుకుంటూ చదవటం ఎంతో మేలు.

ఖుర్‌ఆన్ విభాగాలు మార్చు

దస్త్రం:ఖుర్‌ఆన్ మొదటి అధ్యాయం ఫాతిహా.ఖొరాన్‌లో మొదటి ఉపోద్ఘాత ప్రార్థనా విభాగం తరువాత మొత్తం 114 సూరాలు (అధ్యాయాలు) ఉన్నాయి. మొత్తం సూక్తులు (ఆయత్ లు) 6236, మొత్తం పదాలు 86430, మొత్తం అక్ష రాలు 323760, మొత్తం ఖురాన్ అవతరించిన కాలం 22 సంవత్సరాల 5 నెలల 14 రోజులు, వ్రాసి భద్రపరచిన అనుచరులు (సహాబీలు)40 మంది. మక్కాలో వచ్చిన సూరాలు90, మదీనాలో వచ్చిన సూరాలు 24. ఖురాన్లో అల్లాహ్ పేరు 2697 సార్లు వస్తే ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). అనే పేరు 4 సార్లు, అహ్మద్ అనే పేరు ఒక్క సారే వచ్చింది. హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ అల్లాహ్ ప్రవక్తలను అవతరింపజేశాడు.[16]మొదట్లో ఉన్న పెద్ద అధ్యాయాలలో మొహమ్మదు(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). తన చివరికాలంలో చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. చివరిలో ఉన్న చిన్న అధ్యాయాలలో మొహమ్మదుకు(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). తెలియజేయబడిన మొదటి సందేశాలున్నాయి.[17][18]

ఒక్కొక్క సూరాకు ఆ విభాగంలోని ప్రధాన విషయానికి సంబంధించిన శీర్షిక చెప్పబడింది.

హిజ్బ్ లేదా మంజిల్ విభాగాలు మార్చు

మొదటి విభాగమైన సూరా అల్-ఫాతిహాను మినహాయించి మిగిలిన కొన్న్ని కొన్ని సూరాలను ఒక హిజ్బ్‌గా విభజించారు. 65 సూరాలు కలిగి ఉన్న ఏడవ హిజ్బ్ ను హిజ్బ్ ముఫాసిల్ అని కూడా అంటారు.

  • 1వ మంజిల్ = 3 సూరాలు (2 నుండి 4 వరకు)
  • 2వ మంజిల్ = 5 సూరాలు (5 నుండి 9 వరకు)
  • 3వ మంజిల్ = 7 సూరాలు (10 నుండి 16 వరకు)
  • 4వ మంజిల్ = 9 సూరాలు (17 నుండి 25 వరకు)
  • 5వ మంజిల్ = 11 సూరాలు (26 నుండి 36 వరకు)
  • 6వ మంజిల్ = 13 సూరాలు (37 నుండి 49 వరకు)
  • 7వ మంజిల్ = 65 సూరాలు (50 నుండి 114 వరకు)

ఖుర్‌ఆన్ ఆవిర్భావం మార్చు

13వ శతాబ్దికి చెందిన ఒక ఖుర్‌ఆన్‌లో 33వ సూరా పేజీ

ప్రవక్తగా గుర్తింపబడడానికి ముందు ముహమ్మద్ తరచుగా మక్కా పట్టణం వెలుపల ఉన్న హీరా గుహలో దైవధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అప్పుడు ఆయనకు దైవదూత అయిన జిబ్రయీల్ (అలైహిస్సలాం - ఆయనకు శాంతి కలుగుగాక) కాంతిమయంగా కనపడి చదువు అని గంభీరమైన స్వరంతో అన్నారు. తనకు చదువురాదని ముహమ్మద్ చెప్పినా అదే ఆదేశం వినిపించింది. చకితుడైన మహమ్మదు ఇంటికి వచ్చి భార్య ఖదీజా (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) కు ఈ విషయం చెప్పాడు. ఆమె తన బంధువు వరఖా బిన్‌ నౌఫల్‌తో సంప్రదించి, ముహమ్మద్ ను ప్రోత్సహించింది. ఇలా ప్రారంభమయిన దైవ సందేశావతరణ 23 సంవత్సరాలు కొనసాగింది. అల్లాహ్ సందేశాలు అందుకొన్నపుడల్లా ముహమ్మద్ విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవారు.

ముహమ్మద్ ప్రవక్త తనకు తెలియజేయబడిన సందేశాలను ప్రకటిస్తూ వుండగా ఆయన సహచరులు వాటిని విని తమకు ఏది అందుబాటులో ఉంటే దానిపై వ్రాశారు. రాసిన తరువాత లేఖకుడు ముహమ్మద్ కు అది చదివి వినిపించేవాడు. అదిగా సరిగా వ్రాశారని నిర్ధారించుకొన్న తరువాత దానిని భద్రపరచేవారు.

ఆదినుండి ఇస్లాం సంప్రదాయం ప్రకారం నమాజ్లో ఖుర్‌ఆన్ సూక్తులు పఠించడం వలన ఆ సూక్తులను పలువురు కంఠస్తం చేశారు. ఇక చదవడం, రాయడం వచ్చిన సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు) వివిధభాగాలను స్వయంగా రాసుకొని దాచుకొనేవారు.

మహనీయుని నిర్యాణానంతరం ఆయన మొదటి ప్రతినిధి (ఖలీఫా) హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) వివిధ ప్రాంతాలలో ఉన్న హాఫిజ్ అల్ ఖురాన్ (ఖుర్‌ఆన్ స్మర్త) లందరినీ రాజధానికి రావించి, జాయెద్ ఇబిన్ తాబిత్ అల్-అన్సారీ అధ్వర్యంలో ఖురాన్ ను ఒక ప్రామాణిక సంపూర్ణ గ్రంథంగా కూర్పించారు. 'ఆ ప్రతి అబూబక్ర్ వద్ద, అతని మరణానంతరం ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ వద్ద, అతని అనంతరం ఒమర్ కూతురు హఫ్సా బింతె ఉమర్ వద్ద ఉంది.[19]మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) పాలనా కాలంలో దాని ప్రతులు తీయించి అధికారికంగా రాజ్యాలలో వివిధ ప్రాంతాలకు పంపించారు. వాటిలో రెండు ప్రతులు ఈనాటికి కూడా లభ్యమౌతున్నాయి. ఖురాన్ ఆదినుండి ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పరంపరాగతంగా తరతరాలుగా అందింపబడుతున్నది అని వివిధ పరిశోధనలద్వారా ధ్రువీకరింపబడింది.

అరబీ భాష, ఖురాన్ మార్చు

ఖుర్‌ఆన్ అవతరించిన అరబ్బీ భాష దాదాపు యాభయ్ కోట్ల మంది ప్రజలకు, 20 పైచిలుకు దేశాలలో మాతృభాషగా ఉంది. వ్యాకరణం, పదకోశం, ఉచ్చారణ, నుడికారాలు ఈ 1400 సంవత్సరాలలో స్థిరంగా ఉన్నందున ఆనాటి అరబ్బులలాగానే ఈనాడు అరబ్బీ భాష మాటలాడేవారు కూడా చదివి అర్ధం చేసుకోగలరు.

ఖురాన్ శైలి విశిష్టమైనదని సర్వత్రా గుర్తిస్తారు. అందులోని పదజాల సౌందర్యం వలన ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యమని వివిధ అభిప్రాయాలున్నాయి. ఇందులో పద్యానికి ఉండవలసిన లాక్షణిక నియతి ఏదీ లేకపోయినా భావగర్భితమైన పదబంధాలు, కవితా సృష్టిలోని నుడికారపు సొంపులు, పదాలంకరణలు మాత్రం ఉన్నాయి. అలాగే మరొకవైపు గద్యానికి వుండవలసిన భావగాంభీర్యం, భావ సమగ్రత, విషయానుశీలనం, వాక్యాల పటుత్వం కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. అయినా ఖురాన్ శైలి గ్రంథ రచనలా వుండదు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది. ‍‌[20]

ఖుర్‌ఆన్ సవాలు మార్చు

మహమ్మదీయుల విశ్వాసం ప్రకారం ఖుర్‌ఆన్‌లో చెప్పబడిన విషయం అద్భుత సత్యమవడమే కాదు. ఖుర్‌ఆన్ ఆవిర్భావమే ఒక అద్భుతం. ఇది స్వయంగా దైవవాణి. మనిషిచే రచింపబడే అవకాశమే లేదు.[21] ఈ విషయం నిరూపించడానికి ఖుర్‌ఆన్‌లోనే సవాలులు ఉన్నాయి.

  • "వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్దనుండి గాక మరెవరివద్దనుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది గదా?"—ఖురాను (4:82)
  • "మానవజాతి అంతా కలిసి తమ శక్తినంతా కలిపి ధారపోసినా ఇటువంటి గ్రంథాన్ని రచింపజాలరు -- ఖురాను (17:88)
  • ఒకవేళ మా దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంథం పట్ల మీకేమైనా అనుమానం ఉంటే, ఇందులో ఉన్నటువంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పనికోసం ఒక్క దేవుడ్ని వదలి మీ సహాయకులందరినీ పిలుచుకోండి. మీరు సత్యమంతులైతే ఈ పని చేసి చూపండి. మీరీ పని చేయలేకపోతే .... ఎంతమాత్రం చేయలేరు.... మనుషులు, పాషాణాలు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్య తిరస్కారులకోసం అది సిద్ధంగా ఉంది.-- ఖురాను (2:23)

ఈ విధమైన సవాలులను ఎదుర్కొనే ప్రయత్నాలు (ముస్లిమేతరుల చేత) జరిగాయిగాని వాటిని ముస్లిం పండితులు ఆమోదించలేదు.[22]

ఖురాన్ సూరాల జాబితా మార్చు

(ఖుర్‌ఆన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ అనువాదం - నుండి తీసుకొన్న విషయ సూచిక: https://te.wikisource.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82)

తైమూర్ కాలంలోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన ఖుర్‌ఆన్ - షుమారు 1400 సంవత్సరం కాలం.

ఖురాన్ లో 114 సూరాలు గలవు. క్రింది సూరా పేర్లను చూడండి:

సూచన : 'మక్కీ' అనగా మక్కాలో, 'మదనీ' అనగా మదీనాలో అవతరించి నట్లు (ప్రకటింప) బడినవి.shaikakbarali330

సంఖ్యఅరబీ సూరా పేరుతెలుగులో అర్థంఆయత్ లు లేదా సూక్తులురుకూలుమక్కీ / మదనీ
1అల్-ఫాతిహాపరిచయం/ప్రారంభం (అల్-ఫాతిహా)71మక్కీ
2అల్-బఖరాగోవు28640మదనీ
3ఆల్-ఎ-ఇమ్రాన్ఇమ్రాన్ (మూసా తండ్రి) కుటుంబం20020మదనీ
4అన్-నిసాస్త్రీలు176మదనీ
5అల్-మాయిదావడ్డించిన విస్తరి120మదనీ
6అల్-అన్ఆమ్పశువులు165మక్కీ
7అల్-ఆరాఫ్శిఖరాలు206మక్కీ
8అల్-అన్ఫాల్సమర సొత్తు75మదనీ
9అత్-తౌబాపశ్చాత్తాపం129మదనీ
10యూనుస్యూనుస్ ప్రవక్త109మక్కీ
11హూద్హూద్ ప్రవక్త123మక్కీ
12యూసుఫ్యూసుఫ్ ప్రవక్త111మక్కీ
13అర్-రాద్మేఘ గర్జన43మదనీ
14ఇబ్రాహీంఇబ్రాహీం ప్రవక్త52మక్కీ
15అల్-హిజ్ర్హిజ్ర్ వాసులు99మక్కీ
16అన్-నహల్తేనెటీగ128మక్కీ
17బనీ ఇస్రాయీల్ఇస్రాయీల్ సంతతి111మక్కీ
18అల్-కహఫ్మహాబిలం110మక్కీ
19అల్-మర్యంమరియం (ఈసా తల్లి)98మక్కీ
20తాహాతాహా135మక్కీ
21అల్-అంబియాదైవ ప్రవక్తలు112(మక్కి)
22అల్-హజ్హజ్ యాత్ర78మదనీ
23అల్-మోమినీన్విశ్వాసులు118మక్కీ
24అన్-నూర్జ్యోతి64మదనీ
25అల్-ఫుర్ ఖాన్గీటురాయి77మక్కీ
26అష్-షుఅరాకవులు227మక్కీ
27అన్-నమల్చీమలు93మక్కీ
28అల్-ఖసస్గాధలు88మక్కీ
29అల్-అన్కబూత్సాలెపురుగు69మక్కీ
30అర్-రూమ్రోమ్ వాసులు60మక్కీ
31లుఖ్ మాన్లుఖ్ మాన్344మక్కీ
32అస్-సజ్దాసాష్టాంగ ప్రమాణము303మక్కీ
33అల్-అహ్ జబ్సైనిక దళాలు739మదనీ
34సబాసబా జాతి546మక్కీ
35ఫాతిర్సృష్టికర్త455మక్కీ
36యాసీన్యాసీన్835మక్కీ
37అల్-సాఫ్ఫత్(పంక్తులు తీరినవారు)1825మక్కీ
38సాద్సాద్885మక్కీ
39అజ్-జుమర్బృందాలు758మక్కీ
40అల్-మోమిన్విశ్వాసి859మక్కీ
41హా మీమ్హా మీమ్546మక్కీ
42అష్-షూరాసలహా సంప్రదింపులు535మక్కీ
43అజ్-జుఖ్రుఫ్బంగారు నగలు897మక్కీ
44అద్-దుఖాన్పొగ593మక్కీ
45అల్-జాసియాకూలబడినవాడు374మక్కీ
46అల్-ఆహ్ ఖఫ్ఇసుక కొండల నేల354మక్కీ
47ముహమ్మద్ముహమ్మద్384మదనీ
48అల్-ఫతహ్విజయం292మదనీ
49అల్-హుజూరాత్నివాస గ్రహాలు182మదనీ
50ఖాఫ్ఖాఫ్453మక్కీ
51అజ్-జారియాగాలి దుమారం603మక్కీ
52అత్-తూర్తూర్ పర్వతం492మక్కీ
53అన్-నజ్మ్నక్షత్రం623మక్కీ
54అల్-ఖమర్చంద్రుడు553మక్కీ
55అర్-రహ్మాన్కరుణామయుడు783మదనీ
56అల్-వాఖియాసంఘటన963మక్కీ
57అల్-హదీద్ఇనుము294మదనీ
58అల్-ముజాదిలావాదిస్తున్న స్త్రీ223మదనీ
59అల్-హష్ర్దండయాత్ర243మదనీ
60అల్-ముమ్ తహినాపరీక్షిత మహిళ132మక్కీ
61అస్-సఫ్ఫ్సైనిక పంక్తి142మదీనా
62అల్-జుమాసప్తాహ సమావేశం (శుక్రవారం)112మదనీ
63అల్-మునాఫిఖూన్కపట విశ్వాసులు112మదనీ
64అత్-తగాబూన్జయాపజయాలు182మదనీ
65అత్-తలాఖ్విడాకులు (ఇస్లాం)122మదనీ
66అత్-తహ్రీమ్నిషేధం122మదనీ
67అల్-ముల్క్విశ్వ సార్వభౌమత్వం302మక్కీ
68అల్-ఖలమ్కలం522మక్కీ
69అల్-హాక్ఖాపరమ యదార్థం522మక్కీ
70అల్-మారిజ్ఆరోహణా సోపానాలు442మక్కీ
71నూహ్నూహ్282మక్కీ
72అల్-జిన్న్జిన్282మక్కీ
73అల్-ముజమ్మిల్దుప్పట్లో నిదురించేవాడు202మక్కీ
74అల్-ముదస్సిర్దుప్పట్లో పడుకున్నవాడు562మక్కీ
75అల్-ఖియామాప్రళయం402మక్కీ
76అద్-దహ్ర్సమయం312మక్కీ
77అల్-ముర్సలాత్రుతుపవనాలు502మక్కీ
78అన్-నబాసంచలనాత్మక వార్త401మక్కీ
79అన్-నాజియాత్దూరి లాగేవారు462మక్కీ
80అబసభృకుటి ముడిచాడు421మక్కీ
81అత్-తక్వీర్చాప చుట్టలా291మక్కీ
82అల్-ఇన్ ఫితార్బీటలు191మక్కీ
83అల్-ముతఫ్ఫిఫీన్హస్తలాఘవం361మక్కీ
84అల్-ఇన్ షిఖాఖ్ఖండన251మక్కీ
85అల్-బురూజ్ఆకాశ బురుజులు221మక్కీ
86అత్-తారిఖ్ప్రభాత నక్షత్రం171మక్కీ
87అల్-అలామహోన్నతుడు191మక్కీ
88అల్-ఘాషియాముంచుకొస్తున్న ముప్పు261మక్కీ
89అల్-ఫజ్ర్ప్రాత॰కాలం (ఫజ్ర్)301మక్కీ
90అల్-బలద్పట్టణం201మక్కీ
91అష్-షమ్స్సూర్యుడు151మక్కీ
92అల్-లైల్రాత్రి (లైల్)211మక్కీ
93అజ్-జుహాపగటి వెలుతురు111మక్కీ
94అలమ్ నష్రహ్మనశ్శాంతి81మక్కీ
95అత్-తీన్అంజూరం81మక్కీ
96అల్-అలఖ్గడ్డకట్టిన రక్తం191మక్కీ
97అల్-ఖద్ర్ఘనత51మక్కీ
98అల్-బయ్యినావిస్పష్ట ప్రమాణం81మదనీ
99అజ్-జల్ జలాభూకంపం81మదనీ
100అల్-ఆదియాత్తురంగం111మక్కీ
101అల్-ఖారిఅమహోపద్రవం111మక్కీ
102అత్-తకాసుర్ప్రాపంచిక వ్యామోహం81మక్కీ
103అల్-అస్ర్కాల చక్రం31మక్కీ
104అల్-హుమజానిందించేవాడు91మక్కీ
105అల్-ఫీల్ఏనుగు51మక్కీ
106ఖురైష్ఖురైషులు41మక్కీ
107అల్-మాఊన్సాధారణ వినియోగ వస్తువులు71మక్కీ
108అల్-కౌసర్శుభాల సరోవరం31మక్కీ
109అల్-కాఫిరూన్అవిశ్వాసులు61మక్కీ
110అన్-నస్ర్సహాయం31మక్కీ
111అల్-లహబ్అగ్నిజ్వాల51మక్కీ
112అల్-ఇఖ్లాస్ఏకేశ్వరత్వం41మక్కీ
113అల్-ఫలఖ్అరుణోదయం51మక్కీ
114అల్-నాస్మానవాళి61మక్కీ

ఇవికూడా చూడండి మార్చు


మూలాలు మార్చు

  1. Qur'ān, Chapter 2, Verses 23-24
  2. Living Religions: An Encyclopaedia of the World's Faiths, Mary Pat Fisher, 1997, page 338, I.B. Tauris Publishers,
  3. "Qur'an, Chapter 17, Verse 106". Archived from the original on 2007-12-15. Retrieved 2007-06-15.
  4. Qur'an, Chapter 33, Verse 40
  5. Watton, Victor, (1993), A student's approach to world religions:Islam, Hodder & Stoughton, pg 1. ISBN 0-340-58795-4
  6. "Qur'ān Chapter 87, Verses 18-19". Archived from the original on 2007-06-29. Retrieved 2007-06-15.
  7. Qur'ān, Chapter 3, Verse 3
  8. "Qur'ān, Chapter 5, Verse 44". Archived from the original on 2006-12-05. Retrieved 2007-06-15.
  9. "Qur'ān, Chapter 4, Verse 163". Archived from the original on 2007-06-10. Retrieved 2007-06-15.
  10. "Qur'ān, Chapter 17, Verse 55". Archived from the original on 2007-12-15. Retrieved 2007-06-15.
  11. Qur'ān, Chapter 3, Verse 84
  12. "Quran, Chapter 4, Verse 136". Archived from the original on 2007-06-10. Retrieved 2007-06-15.
  13. "The Qur'an assumes the reader to be familiar with the traditions of the ancestors since the age of the Patriarchs, not necessarily in the version of the "Children of Israel" as described in the Bible but also in the version of the "Children of Ismail" as it was alive orally, though interspersed with polytheist elements, at the time of the Prophet Muhammad (s). The term Jahiliya (ignorance) used for the pre-Islamic time does not mean that the Arabs were not familiar with their traditional roots but that their knowledge of ethical and spiritual values had been lost." Exegesis of Bible and Qur'an, H. Krausen. https://web.archive.org/web/20091019233234/http://geocities.com/Athens/Thebes/8206/hkrausen/exegesis.htm
  14. "Qur'ān, Chapter 15, Verse 9". Archived from the original on 2007-04-02. Retrieved 2007-06-15.
  15. "Qur'ān Chapter 5, Verse 46". Archived from the original on 2006-12-05. Retrieved 2007-06-15.
  16. Sydney Nettleton Fisher, The Middle East: a history, p.55
  17. Molloy (2006), p.451
  18. Esposito (2002), p.8
  19. However, the Quran in a single manuscript form was only made during the reign of the Caliph Othman who ordered the production of several copies.Sahih Bukhari, Volume 6, Book 60, Number 201 Archived 2008-01-19 at the Wayback Machine
  20. 'అబుల్ ఇర్ఫాన్' అనువదించిన "ఖుర్‌ఆన్ భావామృతం" ఉపోద్ఘాతం నుండి.
  21. "Inimitable Qur'an - Qu'ranic Style". Archived from the original on 2007-09-20. Retrieved 2007-06-15.
  22. Islamic-Awareness.org - The Challenge of the Qur'an

వనరులు మార్చు

అనువాదాలు మార్చు

ప్రాచీన విశ్లేక్షణ మార్చు

  • al-Tabari, Muhammad ibn Jarir -- Jami‘ al-bayân `an ta'wil al-Qur'ân, Cairo 1955-69, transl. J. Cooper (ed.), The Commentary on the Qur'an, Oxford University Press, 1987. ISBN 0-19-920142-0
  • Tafsir Ibn-Kathir, Hafiz Imad al-din Abu al-Fida Ismail ibn Kathir al-Damishqi al-Shafi'i - (died 774 Hijrah (Islamic Calendar))
  • Tafsir Al-Qurtubi (Al-Jami'li-Ahkam), Abu Abdullah Muhammad ibn Ahmad Abi Bakr ibn Farah al-Qurtubi - (died 671 Hijrah (Islamic Calendar))

పాత విశ్లేషణ మార్చు

ఇటీవలి విశ్లేక్షణ మార్చు

డైరెక్టరీలు మార్చు

🔥 Top keywords: ఈనాడుఆంధ్రజ్యోతితెలుగుహనుమజ్జయంతిసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీవికీపీడియా:Contact usబంగారంఉపద్రష్ట సునీతప్రత్యేక:అన్వేషణహనుమంతుడువెంట్రుకగ్లోబల్ వార్మింగ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహనుమాన్ చాలీసాశ్రీలలిత (గాయని)జై శ్రీరామ్ (2013 సినిమా)పవన్ కళ్యాణ్అశ్వత్థామసలేశ్వరంతెలుగు అక్షరాలునక్షత్రం (జ్యోతిషం)యూట్యూబ్ఎస్. జానకిసుందర కాండఅనసూయ భరధ్వాజ్తెలుగు సినిమాలు 2024సప్త చిరంజీవులుశ్రీ గౌరి ప్రియయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరాశిప్రభాస్చరాస్తిగాయత్రీ మంత్రంతెలంగాణబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికొండా విశ్వేశ్వర్ రెడ్డి